India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

దేశంలో చరిత్ర పుస్తకాలను మార్చాల్సిన అవసరం ఉందని బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికీ హిస్టరీ బుక్స్‌లో అక్బర్, ఔరంగజేబు గురించి చదువుకోవడం అవసరమా అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను నటించిన ‘స్కై ఫోర్స్’ మూవీ ప్రమోషన్లలో ఆయన మాట్లాడారు. ‘చరిత్రలో దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన జవాన్ల గురించి పాఠాలు ఉండాలి. పరమవీరచక్ర అవార్డు పొందిన వారి కథనాలు ప్రచురించాలి’ అని పేర్కొన్నారు.

TG: జిల్లెలగూడలో మాధవి <<15230164>>హత్య కేసులో<<>> పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. నంద్యాలకు చెందిన మాధవి సంక్రాంతికి పుట్టింటికి వెళ్తానని అడగ్గా భర్త గురుమూర్తితో గొడవ జరిగిందని చెప్పారు. ఆ కారణంతోనే భార్యను చంపినట్లు భావిస్తున్నారు. డెడ్ బాడీని ముక్కలుగా నరికి, కుక్కర్లో ఉడికించి చెరువులో పడేసినట్లు గురుమూర్తి పోలీసుల విచారణలో వెల్లడించాడు. గురుమూర్తికి వేరే మహిళతో సంబంధం ఉందని కూడా అనుమానిస్తున్నారు.

AP: ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ కాగ్నిజెంట్ నుంచి త్వరలోనే శుభవార్త రాబోతుందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. దావోస్‌లో కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్‌తో ఆయన సమావేశమయ్యారు. ‘రాష్ట్రంలోని వైజాగ్, విజయవాడ, తిరుపతిలో భారీగా కోవర్కింగ్ స్పేస్ ఉంది. కాగ్నిజెంట్ విస్తరణలో భాగంగా ఇక్కడ కూడా కార్యాలయాలు ఏర్పాటు చేయాలని కోరాం. దీనిపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని ఆ సంస్థ సీఈఓ తెలిపారు’ అని పేర్కొన్నారు.

క్యాబ్ బుక్ చేసుకునేవారికి మొబైల్ ఫోన్ల ఆధారంగా ఛార్జ్ వేస్తున్నారనే <<15225725>>ఫిర్యాదులపై<<>> కేంద్రం చర్యలకు దిగింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఓలా, ఉబర్ సంస్థలకు నోటీసులు జారీ చేసింది. ఒకే రకమైన సేవకు వేర్వేరు ఛార్జీలు వసూలు చేయడంపై స్పందించాలని కోరింది. ఐఫోన్‌లో రైడ్ బుక్ చేస్తే ఒకలా, ఆండ్రాయిడ్ ఫోన్‌లో బుక్ చేస్తే ఇంకొకలా ఛార్జీలు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.

పొట్టకూటి కోసం పాపడాలమ్మే చక్రధర్ రాణా రోజుకు రూ.10వేలు సంపాదిస్తున్నారని తెలిసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలో ఉడాలా వీధుల్లో ఈయన 50 ఏళ్లుగా పాపడాలు అమ్ముతున్నారు. రోజూ 30-40 కిలోమీటర్లు నడిచి స్థానిక మార్కెట్‌లో విక్రయిస్తుంటారు. ఒక్కటి రూ.10 చొప్పున రోజూ వెయ్యి పీసులు అమ్మి రూ.10వేలు సంపాదిస్తున్నారు. తొలినాళ్లలో ఒక్కోటి 5 పైసలకు అమ్మేవారు.

AP: దావోస్ నుంచి ప్రభుత్వం ఎన్ని పెట్టుబడులు తెచ్చిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. ‘దావోస్ వెళ్లి రావడానికి ప్రభుత్వం ఎంత ఖర్చు చేసింది? దావోస్ నుంచి పెట్టుబడులు ఏ మేరకు తెచ్చారు? తెలియపరిస్తే వినాలని ఉంది!’ అని ట్వీట్ చేశారు.

AP: సీఎం చంద్రబాబు దావోస్ నుంచి స్వదేశానికి పయనమయ్యారు. మూడు రోజులకు పైగా సాగిన పర్యటనలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలతో కీలక ఒప్పందాలు చేసుకున్నారు. మైక్రోసాఫ్ట్ నుంచి మెర్‌ఎస్కే వంటి సంస్థలతో ఆయన బృందంతో కలిసి చర్చలు జరిపారు. కాగా అర్ధరాత్రి 12 గంటల తర్వాత సీఎం ఢిల్లీ చేరుకోనున్నారు.

FEB 1 నుంచి కార్ల ధరలను పెంచబోతున్నట్లు మారుతీ సుజుకీ కంపెనీ ప్రకటించింది. మోడల్‌ను బట్టి రూ.1500 నుంచి రూ.32500 వరకు పెంపు ఉంటుందని తెలిపింది. ముడిసరుకులు, నిర్వహణ ఖర్చులు పెరగడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామంది. వ్యాగన్ Rపై రూ.13000, బ్రెజాపై రూ.20వేలు, ఎర్టిగాపై రూ.15వేలు, స్విఫ్ట్‌పై రూ.5వేలు, ఆల్టో K10పై రూ.19500, బలెనోపై రూ.9వేలు, గ్రాండ్ విటారాపై రూ.25వేల వరకు ధరల పెంపు ఉంటుందని తెలిపింది.

టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కొద్దిరోజులుగా పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్నారు. తాజాగా జమ్మూకశ్మీర్‌తో జరిగిన రంజీ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లోనూ రోహిత్ (3) దారుణంగా విఫలమయ్యారు. చివరి 17 ఇన్నింగ్సు(అన్ని ఫార్మాట్లు)ల్లో ఆయన ఒకే ఒక ఫిఫ్టీ సాధించారు. ఐదు సార్లు మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్ నమోదు చేశారు. 17 ఇన్నింగ్సుల్లో 6, 5, 23, 8, 2, 52, 0, 8, 18, 11, 3, 3, 6, 10, 3, 9, 3 పరుగులు చేశారు.

TG: దావోస్ పర్యటనలో రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని భారీ ఒప్పందాలు చేసుకుంది. టిల్మాన్ ప్రెసిడెంట్ అహుజాతో CM రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. హైదరాబాద్‌లో అత్యాధునిక డేటా సెంటర్ అభివృద్ధికి అమెరికాకు చెందిన టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్‌తో రూ.15వేల కోట్ల ఎంవోయూ చేసుకుంది. మరోవైపు ఉర్సా క్లస్టర్స్‌తో రూ.5 వేల కోట్ల పెట్టుబడికి అంగీకారం చేసుకుంది. HYDలో ఈ సంస్థ AI డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది.
Sorry, no posts matched your criteria.