News July 24, 2024

BUDGET: అందుకే దేశం వదిలి వెళుతున్నారని విమర్శలు

image

ట్యాక్స్ విషయంలో కేంద్రం తీరుపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. బడ్జెట్‌తో అసంతృప్తికి గురైన ఓ యూజర్ ‘నేను సంపాదించినా, ఖర్చు చేసినా, ఈరెండూ కాకుండా పెట్టుబడి పెట్టినా ట్యాక్స్ వేస్తారు. ట్యాక్స్‌పై మళ్లీ సెస్ వేస్తారు’ అని ట్వీట్ చేశారు. దానిపై కొందరు స్పందిస్తూ ఈ ట్యాక్స్‌ల వల్లే చాలామంది దేశాన్ని విడిచివెళ్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు. ఆ కామెంట్స్‌కూ మద్దతు వస్తోంది.

News July 24, 2024

పెళ్లికి ముందు జయాబచ్చన్‌కు అమితాబ్ షరతులు!

image

బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ తన సతీమణి జయా బచ్చన్‌కు పెళ్లికి ముందు కండీషన్స్ పెట్టారట. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో జయాబచ్చన్ పెళ్లి నాటి విషయాలను గుర్తు చేసుకున్నారు. ‘పెళ్లి తర్వాత సినిమాలు చేయడానికి ఆయన అనుమతిచ్చారు కానీ, రోజూ షూటింగ్స్‌కు వెళ్లడానికి వీల్లేదన్నారు. కుటుంబానికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. మంచి ప్రాజెక్టులు ఎంచుకొని, సరైన మనుషులతో వర్క్ చేయాలని సూచించారు’ అని తెలిపారు.

News July 24, 2024

రేషన్ కార్డుల విషయంలో ఎవరూ ఇబ్బంది పడట్లేదు: ఉత్తమ్

image

TG: గతంలో ఉన్న రేషన్ కార్డులు కొనసాగుతున్నాయని, వాటిపై ఎలాంటి ప్రయోజనాలు అందాయో అవన్నీ ఇప్పుడూ అందుతున్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రేషన్ కార్డుల విషయంలో ఎవరూ ఇబ్బంది పడటం లేదని, ప్రజలు ఇబ్బంది పడుతున్నట్లు తమ దృష్టికి రాలేదని శాసనమండలిలో మంత్రి చెప్పారు. పథకాలకు లబ్ధిదారుల సంఖ్యను పెంచేందుకే తాము కృషి చేస్తున్నామన్నారు.

News July 24, 2024

ఢిల్లీలో జగన్ ధర్నా

image

ఢిల్లీలో జగన్ ధర్నా ప్రారంభమైంది. ఏపీలో వైసీపీ కార్యకర్తలు, సానుభూతిపరులపై టీడీపీ దాడులు చేస్తోందని ఆయన జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తున్నారు. ఇందులో వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు.

News July 24, 2024

త్వరగా పాఠం నేర్చిన బీజేపీ!

image

బీజేపీ త్వరగానే పాఠం నేర్చుకుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అందుకే బడ్జెట్లో యువతకు పెద్దపీట వేశారని చెబుతున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో యువ ఓటర్లు దూరమయ్యారనే ఉద్యోగాల కల్పన, ఇంటర్న్‌షిప్, మొదటి నెల వేతనం పథకాలు ప్రకటించినట్టు అంచనా వేస్తున్నారు. ఏపీ, బిహార్‌పై వరాలు ప్రకటించి సంకీర్ణ ధర్మాన్ని త్వరగానే అలవరుచుకున్నారని, రాబోయే రోజుల్లో ఆ 2 రాష్ట్రాలకు మరింత ప్రాధాన్యం లభిస్తుందని అంటున్నారు.

News July 24, 2024

అదిరిపోయే కాంబో.. అజిత్‌తో ప్రశాంత్ నీల్!

image

తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్‌తో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రెండు సినిమాలు తీయనున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. AK64 సినిమాను ప్రశాంత్ తెరకెక్కిస్తారని, 2025లో షూటింగ్ మొదలుపెట్టి 2026లో రిలీజ్ చేయనున్నట్లు పేర్కొన్నాయి. తర్వాతి ఫిల్మ్ KGFకి కనెక్ట్ చేస్తారని, ఇందులో అజిత్ లీడ్ రోల్‌లో కనిపించే అవకాశం ఉందని టాక్. ఈ రెండు చిత్రాలను హోంబలే ఫిల్మ్స్‌ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించే అవకాశం ఉంది.

News July 24, 2024

BRSకు పాస్ మార్కులు వేస్తున్నాం: శ్రీధర్‌బాబు

image

TG: అసెంబ్లీ వేదికగా ఆర్టీసీ విషయంలో కాంగ్రెస్ మేనిఫెస్టో చూపిస్తూ BRS MLA హరీశ్‌రావు అడిగిన ప్రశ్నకు మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను BRS నాయకులు బట్టీ పట్టినందుకు చాలా సంతోషమన్నారు. వెంటనే ఆ పక్కనే కూర్చొని ఉన్న సీఎం రేవంత్ ‘పాస్ మార్కులు వేశారా? లేదా?’ అని సరదాగా అడగ్గా.. ‘ఈ విషయంలో BRSకు మేం పాస్ మార్కులు వేశాం’ అని శ్రీధర్ బాబు నవ్వుతూ సమాధానం ఇచ్చారు.

News July 24, 2024

వెంటనే అంటే 8 నెలలు సరిపోదా?: హరీశ్‌

image

TG: కాంగ్రెస్ ప్రభుత్వంపై అసెంబ్లీ వేదికగా మాజీ మంత్రి, BRS MLA హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. ‘ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసి వెంటనే రెండు PRCలు ఇస్తామని, వారి డిమాండ్లు పరిష్కరిస్తామని కాంగ్రెస్ తమ మేనిఫెస్టోలో చెప్పింది. వెంటనే అంటే 8 నెలలు సరిపోదా?’ అని ప్రశ్నించారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో ఎప్పుడు విలీనం చేస్తారో స్పష్టమైన తేదీ చెప్పాలని డిమాండ్ చేశారు.

News July 24, 2024

శవ రాజకీయాలు మానుకో జగన్: జీవీ

image

AP: చంద్రబాబు ఢిల్లీ నుంచి నిధులను సాధించుకొస్తే.. జగన్ శవ రాజకీయాలు కోసం ఢిల్లీ వెళ్లారని వినుకొండ MLA జీవీ ఆంజనేయులు మండిపడ్డారు. ‘తన హయాంలో ఏపీ పరువును జగన్ ఢిల్లీలో తాకట్టు పెట్టారు. అసెంబ్లీలో మొహం చూపించలేకే ఆయన హస్తిన వెళ్లారు. వినుకొండలో వ్యక్తిగత కారణాలతోనే హత్య జరిగింది. గత ప్రభుత్వంలో జరిగిన 256 హత్యలకు ఏం సమాధానం చెబుతారు. జగన్‌కు పదవీ కాంక్ష తప్ప మరో ఆలోచన లేదు’ అని ఫైర్ అయ్యారు.

News July 24, 2024

LTCG Tax: హైదరాబాద్ రియల్టీకి ఊరట!

image

స్థిరాస్తిపై LTCG పన్ను 12.5 శాతానికి తగ్గించడం, ఇండెక్సేషన్ రద్దు వల్ల సామాన్యుడికి మేలేనని సమాచారం. సొంతింటి కల నెరవేర్చుకొనే ప్రజలపై ప్రభావం తక్కువేనని CLSA తెలిపింది. పాత ఇంటిని అమ్మి కొత్త ఇల్లు కొనేవారికి LTCG వర్తించదు. హైదరాబాద్, బెంగళూరు, పుణేలో ఈ ధోరణి ఎక్కువ. పెట్టుబడి ఉద్దేశంతో కొనుగోలు చేసే ఢిల్లీ, ముంబై మార్కెట్లో మాత్రం పన్ను మోత మోగనుంది. స్వల్పకాల పెట్టుబడైతే భారం మరీ ఎక్కువ.