India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: సీఎం చంద్రబాబు నేడు పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. నరసరావుపేట నియోజకవర్గం యలమందల గ్రామంలో పింఛన్ల పంపిణీలో పాల్గొననున్న ఆయన వి.ఏడుకొండలు, తలారి శారమ్మ ఇళ్లకు వెళ్లి పెన్షన్ అందజేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. గ్రామస్థులతో సీఎం ముచ్చటిస్తారని, అందుకోసం వేదిక ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నాయి. అనంతరం CM కోటప్పకొండ వెళ్లి త్రికోటేశ్వరస్వామిని దర్శించుకుంటారని పార్టీ నేతలు తెలిపారు.

తెలంగాణలో జనవరి 1న సెలవు ఉండనుంది. న్యూ ఇయర్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ హాలిడే ప్రకటించడంతో అన్ని స్కూళ్లు, ఆఫీసులకు సెలవు ఉండనుంది. అటు ఏపీలో జనవరి 1న పబ్లిక్ హాలిడే లేదు. దీంతో రేపు విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు యథావిధిగా పనిచేస్తాయి. ఇంతకీ రేపు మీకు సెలవు ఇచ్చారా? లేదా? కామెంట్ చేయండి.

AP: రాష్ట్రంలోని 4,638మంది బూత్ లెవల్ ఆఫీసర్ల(BLO)కు త్వరలో గౌరవ వేతనాలు అందనున్నాయి. 2021-22 నుంచి వేతనాలందక 26 జిల్లాల్లోని BLOలు ఇబ్బంది పడుతున్నట్లు రాష్ట్ర లోకాయుక్తకు ఫిర్యాదు అందింది. దీనిపై స్పందించాలని SEPలో ఉన్నతాధికారులను లోకాయుక్త ఆదేశించింది. విచారణ జరిపిన అధికారులు రూ.58.62కోట్లు విడుదల చేయాలని జిల్లా ట్రెజరీ అధికారులను తాజాగా ఆదేశించారు. దీంతో త్వరలో BLOలకు వేతనాలు అందనున్నాయి.

చైనా తమపై సైబర్ దాడికి పాల్పడిందని అమెరికా ట్రెజరీ శాఖ చట్టసభకు రాతపూర్వకంగా తెలిపింది. ఈ నెల మొదటివారంలో తమ వర్క్ స్టేషన్లను, కొన్ని డాక్యుమెంట్లను సైబర్ నేరగాళ్లు యాక్సెస్ చేశారని పేర్కొంది. ‘మా సైబర్ భద్రత నిపుణులతో సంప్రదించి పరిస్థితిని చక్కదిద్దాం. దుండగులకు యాక్సెస్‌ను కట్ చేయగలిగాం. ఆధారాల్ని బట్టి ఈ పని చేసింది చైనా ప్రభుత్వ మద్దతున్న సైబర్ హ్యాకింగ్ బృందమే’ అని స్పష్టం చేసింది.

మారుతీ సుజుకీ సెడాన్ కారు డిజైర్ సరికొత్త ఘనత అందుకుంది. 2008లో మార్కెట్‌లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 30 లక్షల కార్ల అమ్మకాల మార్కును దాటింది. 2015లో 10 లక్షలు, 2019లో 20 లక్షల అమ్మకాల మైలురాళ్లను దాటింది. మార్కెట్లో ఎస్‌యూవీ తరహా వాహనాలకు డిమాండ్ పెరిగినా డిజైర్ అమ్మకాలు మాత్రం స్థిరంగా కొనసాగుతుండటం విశేషం.

TG: కాంగ్రెస్ రాష్ట్ర ప్రజలకు శనిలా పట్టిందంటూ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. CM రేవంత్ దుష్టపాలన సాగిస్తున్నారంటూ ఆమె మండిపడ్డారు. ‘కల్లబొల్లి మాటలతో ప్రజల్ని మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రాష్ట్రంలో ప్రతి 3 గంటలకోసారి మహిళలపై లైంగిక దాడి జరుగుతోంది. హామీలను గాలికొదిలేసిన కాంగ్రెస్ నేతల్ని ప్రజలు ఎక్కడికక్కడ నిలదీయాలి. కేసీఆర్ ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకున్నారు’ అని పేర్కొన్నారు.

TG: ఫార్ములా-ఈ రేస్ విషయంలో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని KTRదాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు నేడు విచారించనుంది. ఇక ఆయనకు ఊరటనిస్తూ అరెస్టు చేయొద్దని ఇచ్చిన గడువు సైతం నేటితో ముగుస్తున్న నేపథ్యంలో ఆ ఆదేశాలను పొడిగిస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. కోర్టు తీర్పును అనుసరించి కేటీఆర్ అరెస్ట్ ఆధారపడి ఉన్న నేపథ్యంలో నేటి విచారణ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

AP: తన సోదరుడు నాగబాబుకు మంత్రిపదవి ఇవ్వడంపై డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ మీడియాతో చిట్‌చాట్‌లో వివరణ ఇచ్చారు. ‘క్యాబినెట్‌లో అవకాశం నా సోదరుడని ఇవ్వలేదు. నాతో సమానంగా ఆయన పనిచేశారు. ఒకవేళ ఆ స్థానంలో నా సోదరుడి కాని వ్యక్తి, వేరే సామాజిక వర్గానికి వారైనా అదే అవకాశం ఇచ్చేవాడిని. కందుల దుర్గేశ్ కులమేంటో నాకు ఇప్పటికీ తెలీదు. కలిసి అభివృద్ధి కోసం పనిచేసేవారిని వారసత్వంగా చూడలేం’ అని స్పష్టం చేశారు.

సోషల్ మీడియా కారణంగా నెగటివిటీ తీవ్రమవుతుందని దర్శకుడు పూరీ జగన్నాధ్ తన పాడ్‌కాస్ట్‌లో తెలిపారు. ‘మీరు ఏ పోస్టు పెట్టినా నెగెటివిటీని ఆకర్షిస్తున్నట్లే. పనీపాటా లేనివారు దేశంలో కోట్లలో ఉన్నారు. మీ విషయాల్ని రహస్యంగా ఉంచండి. ముఖ్యంగా అమ్మాయిలకు చెబుతున్నా. భర్తే మీ ప్రపంచం అనుకున్నప్పుడు మిగిలిన ప్రపంచం మీ అన్యోన్యతను చూడాల్సిన అవసరం లేదు. జీవితాన్ని సోషల్ మీడియాలో పెట్టొద్దు’ అని పేర్కొన్నారు.

మెల్‌బోర్న్‌లో టీమ్ ఇండియా ఓటమిపై కెప్టెన్ రోహిత్ ప్రెస్‌మీట్‌లో స్పందించారు. ‘ఎంసీజీలో ఆఖరి ఇన్నింగ్స్ ఆడటం అంత ఈజీ కాదు. ఓటమి కచ్చితంగా నిరాశకు గురిచేసింది. పంత్ ఔట్ అయ్యాక ఓటమి తప్పదని అర్థమైంది. అతడి ఆటను తప్పుబట్టలేం. ఎన్నోసార్లు ఈ ఆటతోనే భారత్‌ను గెలిపించారు. ఏదేమైనా.. ఈ ఓటమిని పక్కన పెట్టి సిడ్నీలో గెలవడంపై దృష్టి సారిస్తాం’ అని స్పష్టం చేశారు.
Sorry, no posts matched your criteria.