India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: సినీ నటుడు మోహన్ బాబు అస్వస్థతకు గురయ్యారు. మరో కుమారుడు మంచు విష్ణుతో కలిసి గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరారు. దీంతో వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. కాగా తన ఇంట్లో ఇవాళ సాయంత్రం నుంచి జరిగిన వరుస ఘటనల నేపథ్యంలో ఆయన టెన్షన్‌కు గురైనట్లు తెలుస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
మీడియాపై దాడి చేసిన సినీ నటుడు మోహన్ బాబును తక్షణమే అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ట్వీట్ చేశారు. అయ్యప్ప మాలలో ఉన్న మీడియా ప్రతినిధిపై దాడి సిగ్గు చేటు, అమానుషమని అన్నారు. అంతకుముందు తన ఇంటి వద్దకు వచ్చిన మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దుర్భాషలాడుతూ, దాడికి పాల్పడ్డారు. మరోవైపు పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు.
ప్రస్తుత బిజీ లైఫ్‌లో రాత్రి పూట కొందరు ఆలస్యంగా భోజనం చేస్తుంటారు. కానీ రాత్రి 9 గంటల నుంచి 12 గంటల మధ్యలో తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా రోజూ తింటే ఆరోగ్యం దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు. బరువు పెరగడం, నిద్ర లేమి, బీపీ, షుగర్ వంటి జబ్బులు వచ్చే ఆస్కారం ఉంది. ఆలస్యంగా తినడం వల్ల కొవ్వు పెరిగి ఊబకాయం రావచ్చు. అందుకే సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య తినడం ఉత్తమం.
భారత్‌కు మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న ప్రతి ముగ్గురు నేరస్థులు, ఉగ్రవాదుల్లో ఒకరు అమెరికాలో తలదాచుకుంటున్నారని, ఆగ్రరాజ్యం వారికి ఆశ్రయంగా మారిందని కేంద్ర హోం శాఖ పేర్కొంది. వీరి అప్పగింత కోసం భారత దర్యాప్తు సంస్థలు చేసిన 178 పెండింగ్ అభ్యర్థనల్లో 65 ప్రస్తుతం US ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్టు తెలిపింది. 2002-18 మధ్య 11 అభ్యర్థనలకే US సమ్మతించినట్టు పేర్కొంది.
50 ఏళ్ల సినీ ప్రస్థానం, 500కు పైగా సినిమాలు, అద్భుతమైన MBU యూనివర్సిటీ, MP, పద్మశ్రీ, ఎన్నో అవార్డులు, డైలాగ్ కింగ్ ఇవన్నీ మోహన్ బాబు పేరు చెప్తే ఇప్పటివరకు గుర్తొచ్చేవి. కానీ కుమారుడు మంచు మనోజ్‌తో గొడవ అంశంతో మంచు ఫ్యామిలీ పరువు మంచులా కరిగిపోయింది. గుట్టుచప్పుడు కాకుండా 4 గోడల మధ్య పూర్తికావాల్సిన ఆస్తి వ్యవహారం వివాదాలతో బిగ్‌బాస్ హౌస్‌లా బయటకొచ్చింది. ఈ ఘటన మంచు ఫ్యామిలీకి మచ్చగా మిగిలింది.
ఇండియాలో రైళ్లు ఆలస్యంగా నడవటం కామన్. ఒక్కోసారి 4 గంటల్లో గమ్యాన్ని చేరే రైలు.. అనుకోని కారణాలతో 8 గంటలూ పట్టొచ్చు. కానీ, విశాఖ నుంచి UPలోని బస్తీకి DAP బస్తాలతో బయల్దేరిన ఓ గూడ్స్ గమ్యాన్ని చేరేందుకు ఏకంగా మూడేళ్ల ఎనిమిది నెలలు పట్టింది. దీంతో దేశంలో అత్యంత ఆలస్యంగా గమ్యాన్ని చేరిన రైలుగా రికార్డులకెక్కింది. కాగా 2014 నవంబర్‌లో బయల్దేరిన ఈ రైలు ప్రమాదం కారణంగా 2018 జులై 25న గమ్యాన్ని చేరుకుంది.
TG: మంచు మనోజ్ తీరుతో వాళ్ల అమ్మ ఆసుపత్రిలో చేరిందని మోహన్ బాబు అన్నారు. అతని ప్రవర్తనతో తన మనసు ఆవేదనతో కుంగిపోయిందని చెప్పారు. మనోజ్ తనను కొట్టలేదని, ఇద్దరి మధ్య ఘర్షణ జరిగిందని పేర్కొన్నారు. భార్య మాటలు విని తన కుమారుడు తాగుడుకు అలవాటయ్యాడన్నారు. ‘మనోజ్‌కు జన్మనివ్వడమే నేను చేసిన పాపమా?’ అని మోహన్ బాబు అన్నారు. ఆస్తులు ఎలా పంచాలి అన్నది తన ఇష్టమని స్పష్టం చేశారు.
TG: జల్‌పల్లిలో హైటెన్షన్ నెలకొంది. మీడియాపై మంచు మోహన్ బాబు దాడి చేయగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు చర్యలకు దిగారు. వెంటనే ఆయన నివాసాన్ని ఆధీనంలోకి తీసుకున్నారు. మరోవైపు మోహన్ బాబు, విష్ణు గన్స్ సీజ్ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.
దిగ్గజ కన్నడ నటుడు దివంగత రాజ్‌కుమార్‌ను వీరప్పన్ చెర నుంచి విడిపించడంలో అప్పటి కర్ణాటక CM <<14836897>>SM కృష్ణ<<>> కీలకపాత్ర పోషించారు. 1999లో CM పదవి చేపట్టిన కృష్ణకు 2000లో కిడ్నాప్ వ్యవహారం సవాల్ విసిరింది. 102 రోజులు బంధీగా ఉన్న రాజ్‌కుమార్‌ను విడిపించడానికి బలగాలు, మధ్యవర్తులు, తమిళనాడు ప్రభుత్వంతో నిత్యం సంప్రదింపులు జరిపారు. సురక్షితంగా ఆయన్ను విడిపించి మన్ననలు పొందారు.
AP: వెలగపూడి సచివాలయంలో డిసెంబర్ 11, 12 తేదీల్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు జరగనుంది. విజన్-2047 డాక్యుమెంట్, కొత్త పాలసీలు, రానున్న నాలుగున్నరేళ్లు ఏ విధమైన లక్ష్యాలతో ముందుకెళ్లాలన్న అంశాలపై 26 జిల్లాల కలెక్టర్లు, 40శాఖల అధిపతుల అభిప్రాయాన్ని సీఎం తెలుసుకోనున్నారు. RTGS, వ్యవసాయం, వాట్సాప్ గవర్నెన్స్, పట్టణాభివృద్ధి, CRDA, శాంతి భద్రతలు, హార్టీకల్చర్ సహా పలు అంశాలపై చర్చిస్తారు.
Sorry, no posts matched your criteria.