India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: గన్నవరం TDP ఆఫీస్‌పై దాడి కేసులో YCP నేత వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఇదే విధంగా మరికొందరి అరెస్టుకు కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని నాని, అగ్రిగోల్డ్ కేసులో జోగి రమేశ్, గుడివాడ TDP ఆఫీస్ కేసులో కొడాలి నానితోపాటు దేవినేని అవినాశ్, వెలంపల్లి శ్రీనివాస్‌ను కూడా జైలుకు పంపేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

భారత్‌కు అత్యంత అధునాతన F-35 ఫైటర్ జెట్లను అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఇకపై ఇండియాకు మిలిటరీ ఉత్పత్తుల విక్రయాలు పెంచుతామని చెప్పారు. తమ దేశంలోని చమురు, గ్యాస్‌ను భారత్ అధిక మొత్తంలో కొనుగోలు చేస్తుందని పేర్కొన్నారు. ముంబై ఉగ్రదాడి నిందితుడు తహవూర్ రాణాతో పాటు మరింత మంది నిందితులను ఇండియాకు అప్పగిస్తామన్నారు.

‘లైలా’ సినిమాకు వైసీపీ ఫ్యాన్స్ షాక్ ఇస్తున్నారు. సినిమా రిలీజ్ కాకముందే నిన్న రాత్రి నుంచి #DisasterLaila అంటూ ట్రెండ్ చేస్తున్నారు. ఇటీవల నటుడు పృథ్వీరాజ్ ‘గొర్రెల’ వ్యాఖ్యలతో హర్ట్ అయిన YCP అభిమానులు #BoycottLaila అని లక్షలాది పోస్టులు చేశారు. అనంతరం విశ్వక్సేన్ మిడిల్ ఫింగర్ చూపిస్తూ ఓ పోస్ట్ పెట్టడంతో #DisasterLaila ట్రెండ్ చేస్తున్నారు. అది రాజకీయాలకు సంబంధం లేదని హీరో చెప్పినా తగ్గట్లేదు.

AP: మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీని పోలీసులు 5 రోజుల కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. విజయవాడ కోర్టు అర్ధరాత్రి తర్వాత ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించగా, సబ్ జైలుకు తరలించారు. దీంతో ఆయన 27 వరకు రిమాండ్ ఖైదీగా ఉండనున్నారు. మరోవైపు వంశీ తరఫు న్యాయవాదులు ఇవాళ బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. వంశీని నిన్న హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

పాక్, ISI పంచన చేరిన బంగ్లాకు ఇక చుక్కలు కనిపించడం గ్యారంటీ అని రక్షణరంగ నిపుణులు అంటున్నారు. ఈ అంశంలో <<15455758>>తాము<<>> కలగజేసుకోబోమని, అది మోదీ చూసుకుంటారని ట్రంప్ చెప్పడమే దీనికి ఉదాహరణగా చెప్తున్నారు. యూనస్ అంటే ట్రంప్‌కు అస్సలు పడదు. తనను ఓడించేందుకు డెమోక్రాట్లకు ఫండింగ్ ఇవ్వడమే ఇందుకు కారణం. పైగా ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చరు. ఇప్పటికే కరెంటు, US AID, ఆహారం లేక బంగ్లా విలవిల్లాడుతోంది.

AP: ఈ ఏడాది ఆస్ట్రేలియా నుంచి వలస పక్షులు కొల్లేరు సరస్సుతో పాటు ఇతర జలాశయాల్లోకి పెద్ద సంఖ్యలో వచ్చాయి. వాటి విసర్జన, ముక్కు నుంచి వచ్చే ద్రవం నీటిలో పడితే బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాప్తి చెందుతుంది. కొంగలు ఈ జలాశయాల్లో తిరిగి కోళ్ల ఫారాల వద్దకు వెళ్లడంతో వైరస్ వ్యాపిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. బర్డ్ ఫ్లూకు వ్యాక్సిన్ లేదు. కోళ్ల ఫారాల వద్ద పరిశుభ్రత, బయో సెక్యూరిటీ పాటించడమే మార్గం.

AP: బాయ్ ఫ్రెండ్ తన నంబర్ బ్లాక్ చేశాడని ఓ యువతి 100కు కాల్ చేసిన ఘటన అనంతపురం జిల్లా గుత్తిలో జరిగింది. ‘అతను నాతో మాట్లాడట్లేదు. నంబర్ బ్లాక్ చేశాడు. మీరు వాడితో మాట్లాడి నా నంబర్ అన్‌బ్లాక్ చేయించండి’ అని ఫోన్ రాగా.. గుత్తి PS బ్లూ కోల్ట్స్ పోలీసులు ఆమెను సంప్రదించారు. అయితే, తన ఇంటికి రావొద్దని నంబర్ అన్‌బ్లాక్ చేయిస్తే చాలని యువతి చెప్పింది. దీంతో PSకు వచ్చి కంప్లైంట్ చేయాలని వారు సూచించారు.

ఇరాన్ అణు స్థావరాలపై మరోసారి దాడి చేసేందుకు ఇజ్రాయెల్ సన్నాహాలు చేస్తున్నట్లు అమెరికా పత్రిక వాషింగ్టన్ పోస్ట్ ఓ కథనం ప్రచురించింది. ఈ ఏడాది మధ్యలో ఈ దాడులు జరపొచ్చని పేర్కొంది. ఇందుకు మద్దతు ఇవ్వాలని అమెరికాను ఇజ్రాయెల్ కోరినట్లు వెల్లడించింది. దీనిపై యూఎస్ త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిపింది. ఇరాన్‌లోని ఫాద్వా, నతాంజ్ అణుస్థావరాలపై దాడులు జరగొచ్చని పేర్కొంది.

ప్రధాని మోదీ ఫ్రాన్స్, అమెరికా పర్యటన ముగిసింది. దీంతో ఆయన భారత్‌కు తిరుగు పయనమయ్యారు. ఈనెల 10న ఫ్రాన్స్ వెళ్లిన ఆయన రెండు రోజులు అక్కడ పర్యటించారు. ఆ దేశ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మేక్రాన్‌తో భేటీ అయ్యారు. అనంతరం మోదీ అమెరికా వెళ్లారు. 12, 13 తేదీల్లో పర్యటించి అధ్యక్షుడు ట్రంప్ సహా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, తులసీ గబ్బార్డ్, ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామి తదితరులతో సమావేశమయ్యారు.

AP: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. టోకెన్లు లేని వారికి శ్రీవారి సర్వ దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. అలాగే వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేంకటేశ్వరుడి దర్శనానికి వేచి ఉన్నారు. నిన్న స్వామిని 60,203 మంది దర్శించుకోగా, వారిలో 21,793 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.77కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.
Sorry, no posts matched your criteria.