India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పాకిస్థాన్‌పై విజయం తర్వాత టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎంజాయ్ చేస్తున్నారు. తన ఫ్యామిలీతో కలిసి విహారయాత్ర చేస్తున్నారు. భార్య రితికా, కూతురు సమైరాతో ఉన్న ఫొటోను హిట్‌మ్యాన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ పిక్ వైరల్‌గా మారింది. కాగా భారత్ తన తర్వాతి మ్యాచ్ రేపు యూఎస్‌ఏతో ఆడనుంది. ఈ మ్యాచ్ కూడా న్యూయార్క్‌లోని నసావు స్టేడియంలో జరగనుంది.
AP: ఎన్నికల ముందు రాజీనామా చేసిన వాలంటీర్ల పరిస్థితి ప్రస్తుతం రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది. YCP అభ్యర్థుల తరఫున ప్రచారం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 1,08,273 మంది రాజీనామా చేశారు. మళ్లీ YCP అధికారంలోకి రాకపోవడంతో వారి పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. వాలంటీర్లకు నెలకు రూ.10 వేల జీతం ఇస్తామని ప్రచారంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ రాజీనామా చేసినవారికి తిరిగి ఉద్యోగం రాకపోవచ్చు.
TG: ఇటీవల కొత్తగా ఐదు మద్యం కంపెనీలకు ఇచ్చిన అనుమతులను రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ తాత్కాలికంగా నిలిపివేసినట్టు సమాచారం. ఈ కొత్త కంపెనీలు 27 రకాల బీర్లను ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నాయి. అయితే ఆ ఉత్పత్తుల నాణ్యతపై అనుమానాలు తలెత్తాయి. సోషల్ మీడియాలో ట్రోల్స్, మద్యం ప్రియుల నుంచి వస్తున్న వ్యతిరేకత కారణంగా పర్మిషన్లకు బ్రేక్ వేసినట్లు తెలుస్తోంది.
NDAలో కీలకమైన టీడీపీకి ప్రాధాన్యమైన శాఖలు దక్కలేదని పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రామ్మోహన్ నాయుడుకు కేబినెట్ హోదా కల్గిన విమానయాన శాఖ కేటాయించినా ఏపీకి అంతగా ప్రయోజనం ఉండదంటున్నారు. అర్బన్ డెవలప్‌మెంట్ ఇస్తే అమరావతి అభివృద్ధి వేగవంతం అయ్యే అవకాశం ఉండేదని అభిప్రాయపడుతున్నారు. అయితే మంత్రి పదవుల కన్నా కేంద్రనిధులపైనే టీడీపీ ఫోకస్ పెట్టినట్లు జాతీయ మీడియాలో వార్తలొస్తున్నాయి.
AP: కొత్తగా ఎన్నికైన MLAలతో ఈనెల 17 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యే అవకాశముంది. ఏకాదశి కావడంతో ఆ రోజు మంచిదని కొత్త ప్రభుత్వానికి పలువురు పండితులు సూచించినట్లు సమాచారం. 4 రోజుల పాటు కొనసాగే మొదటి సెషన్‌లో తొలిరోజు MLAల ప్రమాణ స్వీకారం, రెండోరోజు స్పీకర్ ఎన్నిక ఉండనుంది. ఇక ఈ భేటీలోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉపసంహరణ బిల్లును ప్రభుత్వం ఆమోదించనున్నట్లు తెలుస్తోంది.
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా లాహోర్ వేదికగా భారత్ తమ అన్ని మ్యాచ్‌లు ఆడాలని PCB కోరింది. ఈ మైదానాన్ని హోంగ్రౌండ్‌గా చేసుకుని ఆడాలని విజ్ఞప్తి చేసింది. ఆ జట్టుకు ఇక్కడ పటిష్ఠ భద్రత ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. పాక్ వినతిపై BCCI ఇంకా స్పందించనట్లు తెలుస్తోంది. వచ్చే ఫిబ్రవరి నుంచి ఈ ట్రోఫీ ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఈ టోర్నీలో జరిగే మ్యాచ్‌లన్నింటినీ దుబాయ్‌లో ఆడాలని భారత్ భావిస్తోంది.
AP: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేసేందుకు చంద్రబాబు నిర్ణయించుకున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం CM హోదాలో ఈ చట్టం రద్దుపైనే సంతకం చేయనున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను రెవెన్యూ శాఖ సిద్ధం చేస్తోంది. మంత్రివర్గ సమావేశం ఆమోదం అనంతరం శాసనసభలో చట్టం ఉపసంహరణ బిల్లు ప్రవేశపెట్టనున్నారు. గత ప్రభుత్వం ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. అధికారంలోకి రాగానే దీనిని రద్దు చేస్తామని TDP ప్రకటించింది.
T20WCలో అత్యల్ప స్కోరు(114)ను డిఫెండ్ చేసుకున్న జట్టుగా సౌతాఫ్రికా చరిత్ర సృష్టించింది. నిన్న బంగ్లాపై గెలుపుతో ఈ ఘనత సాధ్యమైంది. ఆ తర్వాతి స్థానాల్లో శ్రీలంక-120(vsకివీస్), ఇండియా-120(vsపాక్), అఫ్గాన్-124(vsవిండీస్), న్యూజిలాండ్-127(vs ఇండియా) ఉన్నాయి. అలాగే పొట్టి ఫార్మాట్‌లో బంగ్లాపై వరుసగా అత్యధిక మ్యాచ్‌లు(9) గెలిచిన రెండో జట్టుగా ప్రొటీస్ నిలిచింది. కివీస్ 10 గెలుపులతో తొలిస్థానంలో ఉంది.
AP: కాసేపట్లో ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశం ప్రారంభం కానుంది. ఈ భేటీలో చంద్రబాబును సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ప్రతిపాదించే అవకాశం ఉంది. ఆయన ప్రతిపాదనను బీజేపీ ఎమ్మెల్యేలు బలపర్చనున్నట్లు సమాచారం. అనంతరం ఏకగ్రీవ తీర్మానాన్ని కూటమి నేతలంతా గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు పంపనున్నారు. దీంతో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కూటమికి ఆయన ఆహ్వానం పంపనున్నారు. రేపు కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది.
AP: ప్రభుత్వం మారడంతో ‘జగనన్న విద్యాకానుక’ కింద అందించే ఉచిత పుస్తకాలు, యూనిఫామ్‌లతో కూడిన కిట్స్ సంగతేంటనే ప్రశ్న తలెత్తింది. అయితే వీటిని యథావిధిగా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్కూళ్లు ప్రారంభమయ్యే జూన్ 13 నుంచే పంపిణీ ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసింది. అటు గత ప్రభుత్వంలో విద్యాకానుకలో భారీగా అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో వాటిపై విచారణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Sorry, no posts matched your criteria.