India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల కానున్నాయి. WAY2NEWS యాప్‌లో వేగంగా, సులభంగా రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. మిగతా ప్లాట్‌ఫాంల తరహాలో విసిగించే యాడ్స్, లోడింగ్ సమస్యలు మన యాప్‌లో ఉండవు. యాప్ ఓపెన్ చేయగానే కనిపించే ప్రత్యేక స్క్రీన్‌లో హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేస్తే చాలు. ఫలితాలను ఇతరులకూ ఈజీగా షేర్ చేసుకోవచ్చు.
* GHMC కమిషనర్‌గా ఆమ్రపాలి
* ట్రాన్స్‌కో సీఎండీగా రొనాల్డ్ రాస్
* ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీగా సందీప్ కుమార్
* దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా శైలజా రామయ్యర్
* కమర్షియల్ ట్యాక్స్ ప్రిన్సిపల్ సెక్రటరీగా రిజ్వీ
* GHMC EVDM కమిషనర్‌గా ఏవీ రంగనాథ్
* HMDA కమిషనర్‌గా సర్ఫరాజ్ అహ్మద్
* కరీంనగర్ కలెక్టర్‌గా పమేలా సత్పతి
>>మొత్తం 44 మంది IAS ఆఫీసర్లు బదిలీ అయ్యారు.
టీ20WC 2024లో వరుస విజయాలతో సౌతాఫ్రికా సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచుల్లోనూ జయభేరి మోగించింది. దీంతో ఒక టీ20 WC ఎడిషన్‌లో అత్యధిక మ్యాచులు గెలిచిన జట్టుగా నిలిచింది. గ్రూప్ దశలో శ్రీలంకపై 6 వికెట్లు, నెదర్లాండ్స్‌పై 4W, బంగ్లాదేశ్‌పై 4 రన్స్, నేపాల్‌పై 1 రన్, సూపర్-8లో USAపై 18 పరుగులు, ఇంగ్లండ్‌పై 7 రన్స్, వెస్టిండీస్‌పై 3 వికెట్ల తేడాతో గెలుపొందింది.
AP: జులై 1 నుంచి పెంచిన పెన్షన్లు అమలు చేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. దీంతో వృద్ధులు, వితంతువులకు ప్రతినెలా వచ్చే పెన్షన్ రూ.3వేల నుంచి రూ.4వేలకు పెరిగింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏప్రిల్ నుంచి పెన్షన్ బకాయిలను ప్రభుత్వం చెల్లించనుంది. జులై 1న ఒకేసారి 65 లక్షల మంది ఇంటి వద్దే రూ.7,000 పెన్షన్ అందుకోనున్నారు. ఆ తర్వాత ఆగస్టు 1 నుంచి యథావిధిగా నెలకు రూ.4వేలు పెన్షన్ వస్తుంది.
తమిళనాడు బిజినెస్‌మెన్ శరవణన్ తన 50వ ఏట ‘ది లెజెండ్’ సినిమాతో హీరోగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తన రెండో సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ దురై సెంథిల్‌కుమార్‌తో చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఫొటోలను సెంథిల్ ట్విటర్‌లో పంచుకున్నారు. దీనికోసం శరవణన్ పూర్తిగా తన లుక్‌ను మార్చేశారు. న్యూ లుక్‌లో ఆయన అదిరిపోయారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, కాంగ్రెస్ MP జైరామ్ రమేశ్ మధ్య Xలో మాటల యుద్ధం నడుస్తోంది. 18వ లోక్‌సభకు స్వాగతిస్తూ రిజిజు ట్వీట్ చేయగా ‘మాటల కంటే చేతలు గట్టిగా మాట్లాడుతాయి. ఆచరణలో చూపండి’ అని రమేశ్ స్పందించారు. ‘కచ్చితంగా. మీరు తెలివైనవారు. మీరు సహకరించాలి’ అని రిజిజు బదులిచ్చారు. దానికి ‘మీరు నాకిచ్చిన సర్టిఫికెట్ NTA గ్రేడింగ్‌లా ఉండదని ఆశిస్తున్నా’ అని జైరామ్ అన్నారు.
క్వాంట్ మ్యూచువల్ ఫండ్‌లో ఫ్రంట్ రన్నింగ్ జరిగినట్లు సెబీ అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో ముంబై, HYDలోని ఆ సంస్థ కార్యాలయాల్లో సోదాలు చేపట్టింది. డీలర్లు, సంబంధిత వ్యక్తులను ప్రశ్నించినట్లు సమాచారం. సెబీ ఎంక్వైరీ చేసినట్లు సంస్థ సైతం ఇన్వెస్టర్లకు మెయిల్స్ ద్వారా తెలిపింది. మ్యూచువల్ ఫండ్ల కొనుగోళ్లు/విక్రయాల గురించి ముందస్తుగా తెలుసుకుని స్టాక్స్ క్రయవిక్రయాలు చేయడాన్ని ఫ్రంట్ రన్నింగ్ అని అంటారు.
AP: విద్య, ఐటీశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా లోకేశ్ మెగా డీఎస్సీ విధివిధానాలపై తొలి సంతకం చేశారు. ఆ ఫైల్‌ను కేబినెట్‌కు పంపారు. మంత్రివర్గంలో డీఎస్సీపై చర్చించి, విధివిధానాలపై నిర్ణయం తీసుకోనున్నారు. 16,347 టీచర్ పోస్టుల భర్తీపై సీఎం చంద్రబాబు తొలి సంతకం చేసిన విషయం తెలిసిందే. డిసెంబర్ లోపు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించింది.
ఏపీలో గనులు-భూగర్భ శాఖ, ఎక్సైజ్ శాఖలో త్వరలో కొత్త పాలసీలను తీసుకొస్తామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఇవాళ ఈ రెండు శాఖల మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రంలోని ఖనిజ సంపదను గత ప్రభుత్వంలోని నాయకులు సొంత అవసరాలకు వాడుకున్నారని ఆరోపించారు. ఎక్సైజ్ శాఖను భ్రష్టు పట్టించారని విమర్శించారు. గత ఐదేళ్లలో జరిగిన అక్రమాలను బయటకు తీసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
విపక్షాలు బాధ్యతగా వ్యవహరించాలని 18వ లోక్‌సభ తొలిరోజు సమావేశం సందర్భంగా ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. సభ్యులందరినీ కలుపుకొని ‘2047 వికసిత్ భారత్’ లక్ష్యం దిశగా సాగుతామని, ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు విపక్షాలూ సహకరించాలని కోరారు. దేశ చరిత్రలో ఎమర్జెన్సీ ఒక మచ్చ అని, అటువంటి పొరపాటు పునరావృతం కాకూడదని ఆయన అన్నారు. రాజ్యాంగానికి గౌరవం ఇచ్చి నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు.
Sorry, no posts matched your criteria.