News June 24, 2024

శ్రీవారి దర్శనానికి 18గంటల సమయం

image

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. భక్తులు 31 కంపార్ట్‌మెంట్లలో వేచి చూస్తున్నారు. శ్రీవారిని నిన్న 81,455మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 31,251మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. రూ3.67కోట్ల హుండీ ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు.

News June 24, 2024

వర్షం ఎఫెక్ట్.. మ్యాచ్ 17ఓవర్లకు కుదింపు

image

T20WCలో భాగంగా వెస్టిండీస్‌VSసౌతాఫ్రికా సూపర్8 మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో అంపైర్లు మ్యాచ్‌ను 17 ఓవర్లకు కుదించారు. DLS ప్రకారం సౌతాఫ్రికా టార్గెట్ 123 రన్స్‌గా మారింది. విండీస్ బౌలర్లలో ఇద్దరు 4 ఓవర్లు, ముగ్గురు 3 ఓవర్ల చొప్పున వేసుకోవచ్చు. కాగా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 135/8 చేయగా ఛేదనలో సౌతాఫ్రికా 2 ఓవర్లు ముగిసేసరికి 15/2 చేసింది.

News June 24, 2024

మంచిరోజులొస్తాయి.. భయపడొద్దు: వైఎస్ జగన్

image

AP: పులివెందులలో తనను కలిసిన వైసీపీ శ్రేణులకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ధైర్యం చెప్పారు. మళ్లీ మంచిరోజులొస్తాయని వారితో అన్నారు. ‘నేను మళ్లీ ప్రజల్లోకి వస్తా. అందరికీ అండగా ఉంటా. రాబోయే రోజులు మనవే’ అని భరోసా ఇచ్చారు. కాగా.. పులివెందుల పట్టణాభివృద్ధి సంస్థ నుంచి కాంట్రాక్టర్లకు రూ.100 కోట్లకు పైగా బిల్లులు పెండింగ్ ఉంటే తనకెందుకు చెప్పలేదంటూ సన్నిహితులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

News June 24, 2024

KCRతో గంగుల భేటీ.. పార్టీ మార్పు ప్రచారానికి చెక్?

image

TG: కరీంనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కాంగ్రెస్‌లో చేరనున్నట్లు వార్తలు వస్తున్న వేళ కీలక పరిణామం జరిగింది. నిన్న KCRతో గంగుల, 29 మంది కార్పొరేటర్లు భేటీ అయ్యారు. కరీంనగర్ జిల్లాలో బలమైన నేతగా ఉన్న కమలాకర్ BRSను వీడితే పార్టీకి నష్టమని భావించి కేసీఆరే.. ఆయన్ను ఫామ్‌హౌస్‌కు ఆహ్వానించినట్లు సమాచారం. భవిష్యత్ అంతా BRSదేనని, ఎవరూ పార్టీ మారొద్దని గులాబీ దళపతి సూచించినట్లు తెలుస్తోంది.

News June 24, 2024

చరిత్ర పునరావృతమవుతుంది: కేటీఆర్

image

TG: అధికారంలో ఉన్న వ్యక్తుల కంటే ప్రజల శక్తి ఎప్పుడూ బలంగానే ఉంటుందని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ <<13498328>>ఎమ్మెల్యేలు<<>> కాంగ్రెస్‌లో చేరడంపై X వేదికగా స్పందించారు. ‘2004-06లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేకసార్లు ఎమ్మెల్యేల ఫిరాయింపులను ఎదుర్కొన్నాం. ఆ తర్వాత తెలంగాణ ప్రజలు దీటుగా స్పందించారు. చివరికి కాంగ్రెస్ తల వంచాల్సి వచ్చింది. మరోసారి చరిత్ర పునరావృతమవుతుంది’ అని పేర్కొన్నారు.

News June 24, 2024

చంద్రన్న బీమా రూ.10లక్షలకు పెంపు

image

AP: చంద్రన్న బీమా పరిహారాన్ని రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతున్నట్లు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రకటించారు. త్వరలో పాత్రికేయులు, న్యాయవాదుల్ని కూడా ఈ బీమా కిందకు తీసుకొస్తామన్నారు. YCP ప్రభుత్వం పథకం పేరు మార్చడమే కాక ఎంతోమందికి పరిహారాన్ని ఆపిందని విమర్శించారు. కార్మికులు కార్మికశాఖలో రూ.15 కట్టి ఈ పథకంలో చేరొచ్చు. ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10 లక్షల పరిహారం అందుతుంది.

News June 24, 2024

నేటి నుంచి మరుగుదొడ్లపై సర్వే

image

TG: వ్యక్తిగత మరుగుదొడ్లపై సర్వే చేయించాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రంలో 100% మరుగుదొడ్లు ఉన్నాయా లేదా నిర్ధారించనుంది. లేని వారికి మంజూరు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఉత్తమ పంచాయతీలకు పురస్కారాల కోసం ప్రభుత్వం ఏటా మరుగుదొడ్లపై సమాచారం సేకరిస్తోంది. దీనిలో 100% ఉన్నట్లు గణాంకాలు నమోదవుతున్నాయి. మరోవైపు ప్రతి ఇంటికి మంచినీటి నల్లా కనెక్షన్‌‌పై సర్వే జరుగుతోంది.

News June 24, 2024

హజ్‌ యాత్రలో మృత్యుఘోష.. 1300 మంది మృతి!

image

ఈ ఏడాది హజ్ యాత్రలో దాదాపు 1300 మంది మరణించినట్లు తెలుస్తోంది. వీరిలో 130 మందికిపైగా భారతీయులు ఉన్నట్లు సమాచారం. వడగాల్పులు, అధిక ఉష్ణోగ్రతలు తట్టుకోలేక వీరంతా ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎక్కువగా ఈజిప్టుకు చెందినవారే కావడం గమనార్హం. కాగా ఈసారి యాత్రలో 18లక్షల మంది పాల్గొన్నట్లు అంచనా. సౌదీ అరేబియాలో రికార్డు స్థాయిలో 51డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

News June 24, 2024

వారికి మాత్రమే రూ.2,500 ఆర్థికసాయం?

image

TG: ‘మహిళలకు రూ.2,500 ఆర్థికసాయం’ పథకాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి పెన్షన్, ఎలాంటి ఆర్థిక సాయం పొందని మహిళలకు(కొత్త వారికి) మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేయనున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి విధివిధానాలు ఖరారు చేయాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారట. కొత్త రేషన్ కార్డుల జారీ తర్వాతే ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.

News June 24, 2024

‘దిశ’ ఇక నుంచి Women Safety App

image

AP: మహిళల భద్రత కోసం జగన్ ప్రభుత్వం తెచ్చిన ‘దిశ’ యాప్ పేరును చంద్రబాబు ప్రభుత్వం Women Safety Appగా మార్చింది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 2020 ఫిబ్రవరిలో దీన్ని ప్రారంభించగా, ఇప్పటివరకు 50 లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. యువతులు, మహిళలు ఆపదలో ఉంటే ఈ యాప్‌లోని ఫీచర్లు పోలీసులు, కుటుంబసభ్యులకు తక్షణమే సమాచారం అందిస్తాయి.