India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ప్రైవేట్ బ్యాంకుల్లో ఉద్యోగుల సంఖ్య తగ్గుతున్నట్లు RBI వెల్లడించింది. 2023-24లో 25శాతం ఉద్యోగులు తగ్గడం వల్ల బ్యాంకుల నిర్వహణలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. 2023-24లో బ్యాంకింగ్ వ్యవస్థ పరిణామాలు, ప్రగతిపై రూపొందించిన తాజా నివేదికలో ఈ విషయం వెల్లడించింది.

స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 180 పాయింట్లు నష్టపోయి 78,500 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 50 పాయింట్ల నష్టంతో 23,760 వద్ద ట్రేడ్ అవుతోంది. అదానీ పోర్ట్స్, జొమాటో, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్ టెల్, ఐటీసీ టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి. ఇన్ఫీ, మారుతీ, ఎంఅండ్ఎం, హెచ్‌సీఎల్, నెస్లే ఇండియా నష్టాల్లో కొనసాగుతున్నాయి.

TG: రుణమాఫీ పూర్తైన రైతులకు జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. పలువురు రైతులకు రుణాలు అందకపోవడంతో ఈ ఆదేశాలు జారీ చేశారు. రానున్న సంవత్సరంలో DCCBలు మంచి పనితీరు కనబరచాలని ఆకాంక్షించారు. గతంలో పలు DCCBల్లో తప్పులు జరిగాయని, అవి జరగకుండా చూసుకోవాలన్నారు. టెస్కాబ్-2025 క్యాలెండర్‌ను ఆవిష్కరించిన సందర్భంగా రుణమాఫీ, బ్యాంకుల పనితీరుపై సమీక్షించారు.

అన్నా యూనివర్సిటీలో <<14983140>>విద్యార్థినిపై అత్యాచార<<>> ఘటనపై TVK పార్టీ చీఫ్, హీరో విజయ్ రాష్ట్ర ప్రజలకు లేఖ రాశారు. రాష్ట్రంలో మహిళలపై లైంగికదాడులు, శాంతిభద్రతల వైఫల్యం చూస్తూ చెప్పుకోలేని బాధ అనుభవిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయమై DMKకు విన్నవించినా ప్రయోజనం లేకపోయిందన్నారు. సురక్షితమైన తమిళనాడును సృష్టించడమే దీనికి పరిష్కారమన్నారు. DMK వల్ల రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేదని పేర్కొన్నారు.

TG: సంధ్య థియేటర్లో తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‌పై నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. పిటిషన్‌పై పోలీసులు కౌంటర్ దాఖలు చేయనున్నారు. తొక్కిసలాట కేసులో అరెస్టైన AA నాలుగు వారాల మధ్యంతర బెయిల్‌పై బయట ఉన్నారు. మరోవైపు JAN 10న రిమాండ్ పొడగింపుపై విచారణ జరగనుంది.

AP: అల్లూరి జిల్లా జి.మాడుగుల మండలంలో దారుణం జరిగింది. ఈ నెల 25న ఆశ్రమ పాఠశాల నుంచి అదృశ్యమైన ఓ బాలికపై ముగ్గురు దుండగులు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. 28న ఆమె ఆచూకీని పోలీసులు గుర్తించారు. తనకు మాయమాటలు చెప్పి ముగ్గురు అఘాయిత్యం చేశారని ఆమె పోలీసులకు చెప్పింది. ఆమెను తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు ఒక నిందితుడిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ఇద్దరి కోసం గాలిస్తున్నారు.

AP: తిరుపతి, కడప, విజయవాడ, విశాఖ జిల్లాల్లో స్ట్రీ ఫుడ్ హబ్స్ తీసుకొస్తున్నట్లు కేంద్రమంత్రి ప్రతాప్‌రావ్ జాదవ్ వెల్లడించారు. ప్రజలకు క్వాలిటీ ఆహారం అందించేలా దేశంలో 100 హబ్స్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపిందన్నారు. స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ ఆన్‌లైన్‌లో ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పిస్తోందన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ <

AP: గోదావరి-బనకచర్ల(కర్నూలు) ప్రాజెక్టును పట్టాలెక్కించాలని నిర్ణయించిన ప్రభుత్వం టెండర్లు పిలిచేందుకు సిద్ధమైంది. దాదాపు రూ.70- 80వేల కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టనుండగా కేంద్రం ఆమోదం కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. పోలవరంతో పాటు ఈ ప్రాజెక్టూ APకి కీలకంగా మారనుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీని నిర్మాణంతో రాయలసీమ, ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు ప్రయోజనం చేకూరనుంది.

మహేశ్ బాబు ‘1-నేనొక్కడినే’ మూవీ ఫలితంతో సినిమాలు ఆపేద్దామనుకున్నానని దర్శకుడు సుకుమార్ అన్నారు. యూఎస్‌లో ఆ సినిమాకు కలెక్షన్లు రాకపోయి ఉంటే సినిమాలు మానేసేవాడినని సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘గేమ్ ఛేంజర్’ గ్లోబల్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడారు. US ఆడియన్స్ వల్ల ఇలా ఉన్నానంటూ వారికి థాంక్స్ చెప్పారు. ఆ సినిమా తర్వాత లెక్కల మాస్టారు తీసిన రంగస్థలం, పుష్ప, పుష్ప-2 సినిమాలు ఆయనను టాక్ ఆఫ్ ది నేషన్‌గా మార్చాయి.

TG: డబ్బుల కోసం కక్కుర్తి పడి ఎంతోమందిని బలి తీసుకుంటున్న బెట్టింగ్ యాప్స్‌ను ప్రచారం చేయొద్దని సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లకు RTC MD సజ్జనార్ సూచించారు. రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావొచ్చని యువత ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బానిసలై జీవితాలు నాశనం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. సొంత లాభం కోసం ప్రజా శ్రేయస్సును విస్మరించడం సమంజసమేనా అని ప్రశ్నించారు. సంఘ విద్రోహశక్తులకు దూరంగా ఉండాలని హితవు పలికారు.
Sorry, no posts matched your criteria.