News March 24, 2024

వాట్ ఏ బౌలింగ్.. 10 ఓవర్లలో 5 మెయిడిన్

image

ఆస్ట్రేలియా మహిళా ఆల్ రౌండర్ సోఫీ మొలినెక్స్‌ అద్భుత ప్రదర్శన చేశారు. బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డేలో ఆమె 10 ఓవర్ల బౌలింగ్ చేసి కేవలం 10 పరుగులే ఇచ్చారు. అందులో 5 మెయిడిన్ ఓవర్లు ఉండగా 3 వికెట్లు తీశారు. మొత్తం 60 బంతులు వేయగా.. అందులో 53 డాట్ బాల్స్ ఉండటం విశేషం. ఇక ఆసీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేసి హడలెత్తించడంతో బంగ్లా 97 పరుగులకే ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా 23.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది.

News March 24, 2024

31న ఇండియా కూటమి మెగా మార్చ్

image

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ఈ నెల 31న దేశ రాజధానిలోని రామ్‌లీలా మైదాన్‌లో మెగా మార్చ్ నిర్వహించనున్నట్లు ఇండియా కూటమి వెల్లడించింది. ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ మాట్లాడుతూ.. ‘విపక్షాలను నిర్మూలించేందుకు, నాయకులను భయపెట్టేందుకు ప్రధాని మోదీ దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుంటున్నారు. ఝార్ఖండ్‌లో హేమంత్ సోరెన్, బిహార్‌లో తేజస్వీ యాదవ్‌పై కూడా తప్పుడు కేసులు పెట్టారు’ అని మండిపడ్డారు.

News March 24, 2024

ప్రజల ఆస్తులకు రక్షణ కల్పిస్తాం: పవన్ కళ్యాణ్

image

AP: అధికారులు మోసం చేశారంటూ YSR జిల్లాలో కుటుంబం <<12908035>>ఆత్మహత్య<<>> చేసుకున్న ఘటనపై సమగ్ర విచారణ చేయాలని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ‘YCP నేతల భూకబ్జాలకు పేదలు బలైపోతున్నారు. ప్రజల ఆస్తులను హస్తగతం చేసుకునేందుకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను ప్రభుత్వం తీసుకొచ్చింది. రాబోయే ఉమ్మడి ప్రభుత్వంలో ప్రజల ఆస్తులకు రక్షణ కల్పిస్తాం. భూదందాలకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు.

News March 24, 2024

ఈ ప్లేయర్లకు శాలరీ హైక్

image

ఐపీఎల్ ఆడుతున్న పలువురు టీమ్ఇండియా యంగ్ ప్లేయర్లకు బీసీసీఐ శుభవార్త చెప్పింది. రింకూ సింగ్, జితేశ్ శర్మ, సాయి సుదర్శన్, రజత్ పాటీదార్‌లకు ఐపీఎల్‌లో శాలరీని పెంచింది. రూ.55 లక్షలకే గత సీజన్‌ ఆడిన రింకూ సింగ్ ఈ ఏడాది రూ.కోటి అందుకోనున్నారు. జితేశ్ శర్మ, సాయి సుదర్శన్, రజత్ పాటీదార్‌ల శాలరీ కూడా రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షలకు పెరగనుంది. ఈ మొత్తాన్ని ఆయా ఫ్రాంచైజీలు చెల్లించనున్నాయి.

News March 24, 2024

APPLY: 1377 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

image

కేంద్ర విద్యాశాఖ పరిధిలోని నవోదయ విద్యాలయ సమితిలో నాన్ టీచింగ్ విభాగంలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. పలు విభాగాల్లో మొత్తం 1377 పోస్టుల ఖాళీలున్నాయి. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, డిగ్రీ చదివిన వారు అర్హులు. అభ్యర్థులు ఏప్రిల్ 30వ తేదీలోపు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. వయో పరిమితి, పోస్టుల వివరాల కోసం ఈ <>లింక్‌<<>>పై క్లిక్ చేయండి. వెబ్‌సైట్: https://nvs.ntaonline.in/

News March 24, 2024

పవన్ మెజార్టీ లక్షకు తగ్గదు: ఉదయ్

image

AP: పిఠాపురంలో సీఎం జగన్ వచ్చి పోటీ చేసినా పవన్ కళ్యాణ్ మెజార్టీ లక్షకు మెజార్టీ తగ్గదని జనసేన కాకినాడ ఎంపీ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ అన్నారు. ‘ఇప్పటికే పవన్‌ను ఓడించడానికి ముగ్గురు సీనియర్ నేతలను దింపారు. మూడు వేల మందిని పంపినా సరే పవన్‌ను ఓడించలేరు. మేం చేస్కోవాల్సిన గ్రౌండ్ వర్క్ అంతా చేసుకుంటున్నాం’ అని చెప్పుకొచ్చారు.

News March 24, 2024

ఫోన్ ట్యాపింగ్‌పై విచారణ చేయిస్తాం: కోటంరెడ్డి

image

AP: సోషల్ మీడియా ద్వారా వైసీపీ ఇతర పార్టీల నేతలను వేధిస్తోందని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి విమర్శించారు. ఇందుకోసం రూ.కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. విపక్ష నేతల ఫోన్లను రాష్ట్ర ప్రభుత్వం ట్యాపింగ్ చేయిస్తోందని ఆరోపించారు. చంద్రబాబు సీఎం అయ్యాక ఈ అంశంపై విచారణ తప్పదని హెచ్చరించారు. ఏడాది కిందటే తాను ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని బయటపెట్టానని గుర్తు చేశారు.

News March 24, 2024

బీజేపీ ఎంపీ అభ్యర్థులు వీరేనా?

image

AP: రాష్ట్రంలో బీజేపీ పోటీ చేసే ఆరు ఎంపీ స్థానాలకు అభ్యర్థులు ఖరారైనట్లు సమాచారం. రాజంపేట నుంచి మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, అరకు-కొత్తపల్లి గీత, రాజమండ్రి-దగ్గుబాటి పురందీశ్వరి, అనకాపల్లి-సీఎం రమేశ్, తిరుపతి-డా.వరప్రసాద్, నరసాపురం నుంచి శ్రీనివాస వర్మ బరిలో నిలవనున్నట్లు జాతీయ మీడియాలో వార్తలొస్తున్నాయి. దీనిపై బీజేపీ అధిష్ఠానం త్వరలోనే అఫీషియల్ ప్రకటన చేసే అవకాశముంది.

News March 24, 2024

బీజేపీలో చేరిన వాయుసేన మాజీ చీఫ్

image

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ మాజీ చీఫ్ RKS బధౌరియా బీజేపీలో చేరారు. బీజేపీ జనరల్ సెక్రటరీ వినోద్ తావ్డే ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ‘నాలుగు దశాబ్దాలుగా ఎయిర్‌ఫోర్స్‌లో సేవ చేశాను. కానీ మోదీ లీడర్‌షిప్‌లో గడిచిన ఎనిమిదేళ్లు నా సర్వీస్‌లో ఉత్తమం. బీజేపీ ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయాలు సాయుధ బలగాల్లో కొత్త విశ్వాసాన్ని నింపాయి’ అని బధౌరియా అన్నారు.

News March 24, 2024

అయోధ్య రాముడి LATEST PHOTOS

image

హోలీ పండుగ సందర్భంగా అయోధ్య బాలరాముడిని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ప్రాణప్రతిష్ఠ తర్వాత వచ్చిన తొలి హోలీ పండుగ కావడంతో వివిధ రకాల పూలు, ఆభరణాలతో అలంకరించిన రాముడి దివ్యరూపం భక్తులను ఆకట్టుకుంటోంది. దీనికి సంబంధించిన ఫొటోలను శ్రీ రామ్ జన్మభూమి తీర్థ్ క్షేత్ర సోషల్ మీడియాలో పంచుకుంది.