News March 24, 2024

రెండో పెళ్లి ప్రచారం.. స్పందించిన హీరోయిన్ మీనా

image

హీరో ధనుష్‌ను తాను 2వ పెళ్లి చేసుకోనున్నట్లు జరుగుతున్న ప్రచారంపై హీరోయిన్ మీనా స్పందించారు. ‘డబ్బు కోసం ఏమైనా రాస్తారా? సోషల్ మీడియా దిగజారిపోతుంది. వాస్తవాలు తెలుసుకుని రాస్తే.. అందరికీ మంచిది. నాలా ఒంటరిగా జీవించే మహిళలు చాలామంది ఉన్నారు. నా పేరెంట్స్, కుమార్తె భవిష్యత్తు గురించి కూడా ఆలోచించండి. ప్రస్తుతానికి 2వ పెళ్లి ఆలోచన లేదు. వస్తే నేను స్వయంగా వెల్లడిస్తా’ అని ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.

News March 24, 2024

కానిస్టేబుల్ అభ్యర్థులకు BIG ALERT

image

TG: ఏప్రిల్ 1 నుంచి కానిస్టేబుల్ అభ్యర్థులకు TSSP <>శిక్షణ<<>> ప్రారంభించనుంది. సెలక్ట్ అయినవారు మార్చి 31న ఉదయం 9 గంటల్లోపు ఆయా బెటాలియన్లలో రిపోర్ట్ చేయాలని TSLPRB సూచించింది. ఏప్రిల్ 10వ తేదీలోపు ఇండక్షన్ శిక్షణ ప్రారంభం అవుతుందని తెలిపింది. అభ్యర్థులకు 9 నెలల శిక్షణ ఉంటుందని పేర్కొంది. ట్రైనింగ్‌లో మొత్తం 15 సెలవులు ఉంటాయని, అనుమతి లేకుండా 7 రోజుల కంటే ఎక్కువ సెలవులు పెడితే శిక్షణ నుంచి తప్పిస్తామంది.

News March 24, 2024

తమిళిసైకి ఆమెతోనే ప్రధాన పోటీ?

image

చెన్నై సౌత్ స్థానం నుంచి BJP MP అభ్యర్థిగా పోటీ చేస్తున్న తమిళిసైకి సిట్టింగ్ MP, DMK అభ్యర్థి తమిళచ్చి తంగపాండియన్ ప్రధాన ప్రత్యర్థిగా ఉండనున్నారు. వీరిద్దరి మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. మంత్రి తెన్నరసు సోదరిగా బలమైన రాజకీయ నేపథ్యం ఉండటం, అధికార పార్టీ అభ్యర్థి కావడం తమిళచ్చికి కలిసొస్తుందని చెబుతున్నారు. ఆమెపై గెలవడం సులువు కాదని, చాలా కష్టపడాల్సి ఉంటుందని అంటున్నారు.

News March 24, 2024

జనసేన గ్లాసు గుర్తు ఆకారంలో పెళ్లి పత్రిక

image

AP: పవన్ కళ్యాణ్ అభిమాని ఒకరు జనసేన పార్టీ గుర్తు ‘గాజు గ్లాసు’ ఆకారంలో పెళ్లి పత్రికను ముద్రించుకున్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం మెట్టవలస గ్రామానికి చెందిన అడబాల నాగేశ్వరరావు పవన్‌పై తనకున్న అభిమానాన్ని ఇలా చాటుకున్నాడు. ఆ శుభలేఖపై పవన్ కళ్యాణ్, చిరంజీవి ఫొటోలను ప్రింట్ చేయించాడు. దీంతో ఈ వెడ్డింగ్ కార్డు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

News March 24, 2024

ట్రేడ్ చేసిన రోజే అకౌంట్లలోకి డబ్బులు

image

ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో షేర్లు కొనుగోలు చేస్తే మరుసటి రోజు(T+1) సెటిల్‌మెంట్ జరుగుతోంది. ఇకపై ట్రేడ్ జరిగిన రోజే(T+0) సాయంత్రం 4.30లోపు సెటిల్‌మెంట్ చేసేందుకు సెబీ సిద్ధమవుతోంది. ఈ నెల 28న కొత్త బీటా వర్షన్‌ను ఆవిష్కరించనుంది. 6 నెలలపాటు కేవలం 25 షేర్లు, పరిమిత సంఖ్యలో బ్రోకర్లకు ఈ సదుపాయాన్ని పరీక్షిస్తుంది. ఫలితాలను బట్టి పూర్తిస్థాయిలో అమల్లోకి తీసుకురానుంది.

News March 24, 2024

ప్రైవేటు స్కూళ్లలో ఉచిత ప్రవేశాలకు గడువు పొడిగింపు

image

AP: పేద పిల్లలకు ప్రైవేటు, అన్‌ఎయిడెడ్ స్కూళ్లలో ఒకటో తరగతిలో ఉచిత ప్రవేశాలకు దరఖాస్తు గడువును ఈ నెల 31 వరకు అధికారులు పొడిగించారు. నిన్నటికి 47,082 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న వారు సమీపంలోని సచివాలయం, మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మరిన్ని వివరాల కోసం 18004258599 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

News March 24, 2024

ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగ్గురికి నోటీసులు

image

TG: రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ముగ్గురు వ్యక్తులకు పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌తో పాటు ఓ ఛానల్ ఎండీకి నోటీసులు ఇచ్చారు. మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు అరెస్టు అయిన తర్వాత వీరు విదేశాలకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.

News March 24, 2024

HYDలో ఆఫీస్ స్పేస్‌కు భారీ డిమాండ్

image

దేశంలోని 6 ప్రధాన నగరాల్లో ఆఫీస్ స్పేస్‌కు డిమాండ్ జనవరి-మార్చి త్రైమాసికంలో 35 శాతం పెరిగే అవకాశం ఉందని ‘కొలియర్స్ ఇండియా’ అంచనా వేసింది. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై, చెన్నై, పుణెలో 1.36 కోట్ల చదరపు అడుగుల స్థలం లీజుకు వెళ్లనుందని చెప్పింది. HYDలో వృద్ధి ఎక్కువగా ఉంటుందని తెలిపింది. గత ఏడాది జనవరి-మార్చిలో 13 లక్షల చ.అ. స్థలం లీజుకు వెళ్లగా, ఈ ఏడాది 29 లక్షల చ.అ.లకు పెరగొచ్చని పేర్కొంది.

News March 24, 2024

70 శాతం మంది పిల్లలకు డిజిటల్ అడిక్షన్ ముప్పు

image

స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్ల వినియోగం పిల్లల్లో పెరిగిపోతోంది. 5-16 ఏళ్ల పిల్లల్లో 60 శాతం మంది డిజిటల్ అడిక్షన్‌ బారిన పడే అవకాశం ఉన్నట్లు స్మార్ట్ పేరెంట్ సొల్యూషన్ కంపెనీ అధ్యయనంలో తేలింది. 70-80 శాతం మంది చిన్నారులు నిర్దేశిత స్క్రీన్ సమయాన్ని మించి ఉపయోగిస్తున్నారు. వీరిని కంట్రోల్ చేయడానికి 85 శాతం మంది పేరెంట్స్ ఇబ్బందులు పడుతున్నారు. కేవలం 10 శాతం మంది మాత్రమే నియంత్రించగలుగుతున్నారు.

News March 24, 2024

మాజీ సైనికులకు బీబీనగర్ ఎయిమ్స్‌లో నగదు రహిత వైద్యం

image

దేశ రక్షణ కోసం పోరాడిన తెలుగు రాష్ట్రాల్లోని మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యులకు నగదు రహిత వైద్యం అందించేందుకు హైదరాబాద్‌లోని బీబీనగర్ ఎయిమ్స్ ముందుకొచ్చింది. తాజాగా ఎక్స్ సర్వీస్‌మెన్ కంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్‌(ECHS)తో ఒప్పందం చేసుకుంది. ఇకపై నగదు అవసరం లేకుండా అన్నిరకాల వైద్య పరీక్షలు, ఆపరేషన్లను చేయనుంది. దీంతో దాదాపు 90వేల మందికి లబ్ధి చేకూరనుంది.