News October 2, 2024

మంత్రులతో 317 జీవో బాధితుల చర్చలు

image

TG: 317 జీవో రద్దు చేయాలని గాంధీభవన్ ఎదుట ఆందోళన చేస్తున్న బాధితులతో మంత్రులు అక్కడే చర్చలు జరుపుతున్నారు. పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చర్చల్లో పాల్గొన్నారు. ఈ జీవోతో పడుతున్న ఇబ్బందులను ఆందోళనకారులు మంత్రులకు వివరిస్తున్నారు.

News October 2, 2024

ప్రముఖ నటుడు మృతి

image

హాలీవుడ్ నటుడు జాన్ అమోస్(84) కన్నుమూశారు. ఆయన మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఇతర నటులు చేసిన పోస్టులతో ఆగస్టు 21న ఆయన చనిపోయిన విషయం బయటకొచ్చింది. 1971లో సినిమాల్లోకి వచ్చిన ఆయన రూట్స్, గుడ్ టైమ్స్ సిరీస్‌లతో స్టార్‌గా మారారు. కమింగ్ టు అమెరికా, లాక్ అప్, డై హార్డ్ 2 అనే సినిమాలు, 100కి పైగా సీరియల్స్, సిరీస్‌లలో నటించారు. 2023లో వచ్చిన ది లాస్ట్ రైఫిల్ మ్యాన్ ఆయన చివరి సినిమా.

News October 2, 2024

సనాతన ధర్మం అంటూనే అన్ని వైన్ షాపులా?: MP గురుమూర్తి

image

APలోనే అత్యధికంగా తిరుపతి జిల్లాకు 227 వైన్ షాపులు కేటాయించడంపై స్థానిక YCP MP గురుమూర్తి మండిపడ్డారు. ‘గౌరవనీయులైన సీఎం, డిప్యూటీ సీఎం గారు.. సనాతన ధర్మ పరిరక్షకులమని చెప్పుకుంటూ తిరుపతి జిల్లాకు ఇన్ని షాపులు కేటాయించడం బాధాకరం. మేము దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి చర్యలు సనాతన ధర్మరక్షణలో ఎట్టి పరిస్థితుల్లో భాగం కాజాలవు. తిరుపతి ప్రజలు ప్రతీ విషయం గమనిస్తున్నారు’ అని Xలో రాసుకొచ్చారు.

News October 2, 2024

గాంధీ, శాస్త్రి చెప్పిన వ్యాఖ్యలను గుర్తుచేసుకున్న ప్రకాశ్ రాజ్

image

జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి సందర్భంగా నటుడు ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు. వీరిద్దరూ చేసిన వ్యాఖ్యలను గుర్తుచేసుకున్నారు. ‘మీరు మైనారిటీలో ఒకరైనప్పటికీ నిజాన్ని మార్చలేరు’ అన్న గాంధీ కోట్‌ను, ‘మన దేశంలో ఆలయాలు, మసీదులు, చర్చిలున్నాయి. కానీ, ఎప్పుడూ వీటిని రాజకీయాల్లోకి తీసుకురాము. ఇండియాకు, పాక్‌కు మధ్య ఉన్న తేడా ఇదే’ అని శాస్త్రి చేసిన వ్యాఖ్యలను షేర్ చేశారు.

News October 2, 2024

ఆలయాల్లో సాయిబాబా విగ్రహాల తొలగింపు

image

యూపీ వారణాసిలోని పలు ఆలయాల నుంచి సాయిబాబా విగ్రహాలను తొలగించడం వివాదానికి దారితీసింది. ‘సనాతన్ రక్షక్ దళ్’ చేపట్టిన ప్రచారంలో భాగంగా 10 మందిరాల్లో నిన్న బాబా విగ్రహాలను తొలగించి, ఆలయాల బయట పెట్టారు. సరైన పరిజ్ఞానం లేకుండా సాయిబాబాను ఆరాధిస్తున్నామని, శాస్త్రాల్లో ఎక్కడా బాబా ఆరాధన గురించి చెప్పలేదన్నారు. బాబా ధర్మ గురువే కావొచ్చు కానీ దేవుడు కాదని అయోధ్యలోని హనుమాన్ గఢీ ఆలయ మహంతు అభిప్రాయపడ్డారు.

News October 2, 2024

రేపటి నుంచి టెట్

image

AP: ఈ నెల 3 నుంచి 21 వరకు టెట్-2024 పరీక్షలు జరగనున్నాయి. మొదటి సెషన్ ఉ.9.30 నుంచి మ.12 వరకు, రెండో సెషన్ మ.2.30 నుంచి సా.5 వరకు ఉంటుంది. హాల్ టికెట్లలో తప్పులు ఉంటే సరైన ఆధారాలు చూయించి సెంటర్ దగ్గరున్న నామినల్ రోల్స్‌లో సరిచేసుకోవాలని అధికారులు సూచించారు. ఇప్పటివరకు హాల్ టికెట్లు తీసుకోని వారు https://aptet.apcfss.in/కు వెళ్లి డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు.

News October 2, 2024

సుప్రీం వ్యాఖ్యలతోనైనా ప్రభుత్వం కళ్లు తెరవాలి: అవినాశ్ రెడ్డి

image

AP: రాజకీయాల కోసమే తిరుమల లడ్డూ వివాదాన్ని తీసుకొచ్చారని ఎంపీ అవినాశ్ రెడ్డి విమర్శించారు. ‘కల్తీ నెయ్యి వాడలేదని EO ప్రకటించారు. వాడారని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వంలోని పెద్దలకే సయోధ్య లేదు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో అయినా ప్రభుత్వం కళ్లు తెరవాలి. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పింది. YCP నాయకులను కేసులతో వేధిస్తున్నారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని గుర్తు పెట్టుకోవాలి’ అని హెచ్చరించారు.

News October 2, 2024

వివాదంలో ‘యానిమల్’ హీరోయిన్

image

యానిమల్ సినిమాతో స్టార్ డమ్ సొంతం చేసుకున్న హీరోయిన్ తృప్తి దిమ్రి వివాదంలో చిక్కుకున్నారు. జైపూర్‌కు చెందిన మహిళా వ్యాపారవేత్తలు FICCI FLO ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈవెంట్‌కు వస్తానని తృప్తి రూ.5.5 లక్షలు తీసుకున్నారని సమాచారం. నిన్న ఈవెంట్‌కు ఆమె రాకపోవడంతో మోసం చేశారంటూ నిర్వాహకులు ఆమె ఫొటోపై పెయింట్ వేసి నిరసన తెలిపారు. ఆమె సినిమాలను బ్యాన్ చేస్తామని, లీగల్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు.

News October 2, 2024

GOOD NEWS.. జీతాల పెంపుపై ప్రకటన

image

TG: 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి విద్యుత్ ఉద్యోగులకు డిస్కమ్‌లు భారీగా జీతాలు పెంచనున్నాయి. 20శాతం ఫిట్‌మెంట్ అమలు చేస్తామని ప్రకటించాయి. 2022లో వేతన సవరణ జరగ్గా 7శాతం ఫిట్‌మెంట్ ఇచ్చాయి. గత పదేళ్లలో మూడు సార్లు వేతన సవరణ జరగ్గా వేతనాలు 180శాతానికి పైగా పెరిగినట్లు తెలుస్తోంది. ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల ఖర్చు ఏటా 7శాతం పెరుగుతుండటంపై ERC వివరణ కోరగా, డిస్కంలు ఈ మేరకు ప్రకటించాయి.

News October 2, 2024

కన్న తండ్రులే నరరూప రాక్షసులై..

image

AP: కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రులే కామపిశాచులై అఘాయిత్యాలకు పాల్పడ్డ ఘటనలు నెల్లూరు(D)లో జరిగాయి. అల్లూరు(M)లో ఓ గ్రామానికి చెందిన దంపతులకు ముగ్గురు కుమార్తెలు. మద్యం మత్తులో ఉన్న తండ్రి తలుపు గడి పెట్టి పెద్దకూతురి(12)పై అత్యాచారానికి ఒడిగట్టాడు. నిస్సహాయ స్థితిలో ఆ తల్లి ఇంటి బయటే పిల్లలతో రోదిస్తూ కూర్చుంది. చేజర్ల(M)లో బాలికపై తండ్రే అత్యాచారం చేశాడు. నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.