News March 22, 2024

BREAKING: కేజ్రీవాల్ అనూహ్య నిర్ణయం

image

లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈడీ అరెస్టును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు. రౌస్ అవెన్యూ కోర్టులో రిమాండ్ పిటిషన్‌పై విచారణ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తరఫు లాయర్లు సుప్రీంకు తెలిపారు. కాగా నిన్న కేజ్రీవాల్‌ వేసిన పిటిషన్‌ను విచారించేందుకు ఇవాళ అత్యున్నత ధర్మాసనం స్పెషల్ బెంచిని ఏర్పాటు చేసింది.

News March 22, 2024

పెరగనున్న కియా కార్ల ధరలు

image

ఏప్రిల్ 1 నుంచి తమ కార్ల ధరలను 3% వరకు పెంచనున్నట్లు కియా ఇండియా ప్రకటించింది. సెల్టోస్, సొనెట్, కారెన్స్ వంటి పలు పాపులర్ మోడళ్ల ధరలను వేరియంట్ ఆధారంగా పెంచబోతున్నట్లు తెలిపింది. ముడి పదార్థాల ధరలు, సరఫరా సంబంధిత ఖర్చులు పెరగడమే ఇందుకు కారణమని పేర్కొంది. ఇండియాలో అమ్మకాలు ప్రారంభించినప్పటి నుంచి ఓవర్సీస్, డొమెస్టిక్ మార్కెట్‌లో ఈ కంపెనీ ఇప్పటివరకు 1.16 మిలియన్ కార్లను విక్రయించింది.

News March 22, 2024

అందుకోసం మూడేళ్లు పనిచేసినా సాధ్యం కాలేదు: యాపిల్

image

యాపిల్ వాచ్‌లు ఆండ్రాయిడ్‌తో పనిచేయవు. ఇది గుత్తాధిపత్యమే అంటూ ఓ సంస్థ USలో దావా వేసింది. ‘ఎవరైనా ఐఫోన్ నుంచి ఆండ్రాయిడ్‌కు మారాలనుకుంటే, వారు తమ యాపిల్ వాచ్‌ను వదిలివేసి ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌వాచ్‌ని కొనుగోలు చేయాలి. ఇది యూజర్లపై విపరీతమైన భారాన్ని వేస్తోంది’ అని వాదించింది. అయితే ఆండ్రాయిడ్‌తోనూ పనిచేసేలా రూపొందించేందుకు తాము మూడేళ్లు ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదని యాపిల్ వెల్లడించింది.

News March 22, 2024

భోజ్‌శాలలో ASI సర్వే

image

మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో ఉన్న భోజ్‌శాల/కమల్ మౌలా మసీదులో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ASI) సర్వే చేపట్టింది. కోర్టు ఆదేశాల మేరకు 12 మంది సభ్యులతో కూడిన ASI బృందం సర్వే చేస్తోంది. వాగ్దేవి దేవత ఆలయమని హిందువులు విశ్వసించే ఈ భోజ్‌శాల కాంప్లెక్స్‌పై సర్వే నిర్వహించి ఆరు వారాల్లోగా నివేదిక సమర్పించాలని మధ్యప్రదేశ్ హైకోర్టు మార్చి 11న ఆదేశాలు జారీ చేసింది.

News March 22, 2024

కోయంబత్తూరు నుంచి అన్నామలై పోటీకి కారణాలేంటి?

image

లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడు BJP చీఫ్ అన్నామలై గెలుపు ఖాయమని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఆయన పోటీ చేస్తున్న కోయంబత్తూరులో ఉత్తరాది నుండి వలస వచ్చిన వారు ఎక్కువగా ఉండటం, ఇదే ప్రాంతానికి చెందిన ఆధ్యాత్మిక గురువు సద్గురు ఆశీస్సులు అన్నామలైకు ఉండటం పార్టీకి కలిసొస్తుందని అంటున్నారు. ఇటీవల ఇక్కడ PM పర్యటించడం, 1998 బాంబు బ్లాస్ట్‌లో చనిపోయిన వారిని గుర్తుచేసుకోవడం కూడా ప్లస్ అవ్వొచ్చని భావిస్తున్నారు.

News March 22, 2024

‘దేవర’ షూట్‌లో NTR.. లుక్ వైరల్

image

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ‘దేవర’ సినిమా షూటింగ్ గోవాలో జరుగుతోంది. ఈ సందర్భంగా షూటింగ్ సెట్‌లో ఉన్న ఎన్టీఆర్ ఫొటోను మేకర్స్ షేర్ చేశారు. రెండ్రోజులుగా ఓ సాంగ్ షూట్ జరుగుతుండగా.. ఈరోజు ఉదయమే ఎన్టీఆర్‌కు సంబంధించిన వీడియో నెట్టింట్లో ప్రత్యక్షమైంది. రింగుల జుట్టుతో మెరున్ షర్టు ధరించిన తారక్ లుక్ ఆకట్టుకుంటోందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

News March 22, 2024

మీకు ఫ్రాడ్ కాల్, మెసేజ్ వచ్చాయా?

image

ఇటీవల ఫ్రాడ్ ఫోన్ కాల్స్, మెసేజ్‌లు ఎక్కువగా వస్తున్నాయి. ఇలాంటి వాటిపై కేంద్ర టెలికం శాఖ చక్షు పోర్టల్ ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తోంది. ఏ రూపంలో కాల్ వచ్చింది? కేటగిరీ, తేదీ, టైం, స్క్రీన్‌షాట్ సహా పలు అంశాలతో ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు చేసేందుకు ఇక్కడ <>క్లిక్<<>> చేయండి. మీరూ ఇలాంటి ఫ్రాడ్స్ కాల్స్, మెసేజ్‌ల బారినపడ్డారా? కామెంట్ చేయండి.

News March 22, 2024

పోటీలో ఉన్న తండ్రీ కొడుకులు వీరే..

image

AP: వచ్చే ఎన్నికల్లో తండ్రీకొడుకులు పోటీ చేయనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం, లోకేశ్ మంగళగిరి బరిలో ఉన్నారు. మైదుకూరు TDP అభ్యర్థిగా పుట్టా సుధాకర్ యాదవ్, ఆయన కొడుకు పుట్టా మహేశ్ యాదవ్ ఏలూరు ఎంపీ స్థానానికి పోటీ చేయనున్నారు. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అల్లుడే మహేశ్. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తణుకు, ఆయన కుమారుడు సునీల్ యాదవ్ ఏలూరు YCP ఎంపీ అభ్యర్థిగా అదృష్టం పరీక్షించుకోనున్నారు.

News March 22, 2024

కాంగ్రెస్‌లోకి కేకే & HYD మేయర్?

image

BRS సీనియర్ నేత మాజీ ఎంపీ కే కేశవరావు, HYD మేయర్ విజయలక్ష్మీ BRSకు గుడ్‌బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్‌లో చేరేందుకు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షీతో వీరు చర్చలు జరుపుతున్నట్లు రాజకీయ వర్గాల సమాచారం. త్వరలోనే సీఎం రేవంత్‌ని కలిసి పార్టీ మార్పుపై చర్చించి తమ నిర్ణయాన్ని ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది. కే కేశవరావు ఇంటికి మున్షీ వచ్చినట్లు సమాచారం.

News March 22, 2024

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

image

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు నిన్న <<12896936>>రికార్డు<<>> స్థాయిలో పెరగగా, ఇవాళ అదే స్థాయిలో తగ్గాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.450 తగ్గి రూ.61,350కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.490 తగ్గడంతో రూ.66,930 పలుకుతోంది. కేజీ వెండి ఏకంగా రూ.2,000 తగ్గి రూ.79,500కు చేరింది.