India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తాను దర్శకత్వం వహించిన RRR సినిమా కన్నా ఇటీవల వచ్చిన డాక్యుమెంటరీనే ఎమోషనల్‌గా ఉందని రాజమౌళి ట్వీట్ చేశారు. 20TB డేటా నుంచి సరైన మెటెరియల్‌ను తీసిన వాల్ అండ్ ట్రెండ్స్ టీమ్ వర్క్‌ను ప్రశంసించారు. ఎడిటర్ శిరీష, వంశీ పనితీరును మెచ్చుకున్నారు. ఈ టీమ్ వర్క్ పట్ల గర్వంగా ఉందని, ఇలాగే కొనసాగించాలని ఆకాంక్షించారు. RRR సినిమా షూటింగ్ సీన్స్‌తో రూపొందించిన బిహైండ్ అండ్ బియాండ్ ఓటీటీలోకి వచ్చేసింది.

BSNL సంస్కరణలు రెండో దశకు చేరుకున్నాయి. 19000 (35%) ఉద్యోగులే లక్ష్యంగా రెండోసారి VRS అమలుకు టెలికం శాఖ సిద్ధమవుతోంది. ఇప్పటికే ఆర్థికశాఖ అనుమతి కోరినట్టు సమాచారం. ఇందుకు రూ.15000 కోట్లు అవసరమవుతాయి. BSNL ఆదాయంలో 38% అంటే రూ.7500 కోట్లు జీతాలకే వెళ్లిపోతోంది. దీనిని రూ.5000 కోట్లకు తగ్గించాలన్నది ప్లాన్. ప్రస్తుతం కంపెనీకి 55వేల ఉద్యోగులున్నారు. తొలి విడత VRSకు మంచి స్పందనే లభించడం గమనార్హం.

ఆస్ట్రేలియా సిరీస్‌లో నితీశ్ కుమార్ రెడ్డిపై మాజీ సెలక్టర్ ఎమ్మెస్కే విమర్శలకు నెటిజన్లు కౌంటర్ ఇస్తున్నారు. బాక్సింగ్ డే టెస్టులో గిల్‌ను పక్కన పెట్టి పూర్తి బౌలర్/బ్యాటర్ కానీ NKRపై నమ్మకం ఉంచడం ఏంటని MSK విమర్శించారు. అయితే ఇవాళ నితీశ్ ప్రదర్శనతో MSKకు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారని నెటిజన్లు అంటున్నారు. సీనియర్లు విఫలమైన చోట NKR పరువు నిలబెట్టారని, ఎవరినీ తక్కువ చేయొద్దని హితవు పలుకుతున్నారు.

AP: నవంబర్ నెలలో తిరుమల శ్రీవారిని 20.35 లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. అదే సమయంలో హుండీ కానుకలు రూ.111.3 కోట్లు వచ్చినట్లు వెల్లడించారు. 7.31 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు చెప్పారు. నెల రోజుల్లో 97.01 లక్షల లడ్డూలు విక్రయించగా 19.74 లక్షల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించినట్లు పేర్కొన్నారు.

మన్మోహన్ సింగ్ ప్రత్యేక స్మారకం కోసం PM మోదీని ఖర్గే కోరడాన్ని ప్రణబ్ ముఖర్జీ కుమార్తె షర్మిష్ఠ విమర్శించారు. పార్టీకి సేవలందించి, రాష్ట్రపతిగా పనిచేసిన తన తండ్రి చనిపోతే వాళ్లు స్మారకమే అడగలేదన్నారు. కనీసం CWC మీటింగ్ పెట్టి సంతాపం ప్రకటించలేదని ఆరోపించారు. ఇవన్నీ ప్రధానులకే అని ఒకరు చెప్పగా KR నారాయణన్‌కు CWC సంతాపం ప్రకటించడాన్ని తన తండ్రి డైరీస్ ద్వారా తెలుసుకున్నానని గట్టిగా కౌంటర్ ఇచ్చారు.

సంక్రాంతికి HYD నుంచి APకి వెళ్లే వారి కోసం 2,400 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు APSRTC ప్రకటించింది. JAN 9 నుంచి 13 మధ్య ఇవి అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీలే ఉంటాయని, అదనపు ఛార్జీలు వసూలు చేయబోమని పేర్కొంది. MGBSలో రద్దీని తగ్గించేందుకు JAN 10-12 మధ్య కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ఒంగోలు, మాచర్ల వైపు వెళ్లే బస్సులను CBS గౌలిగూడ నుంచి నడిపిస్తామంది.

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్వతీపురం పర్యటనలో నకిలీ ఐపీఎస్ అధికారి కలకలం రేపాడు. పోలీసు అధికారిలా యూనిఫాంతో హడావుడి చేయగా అనుమానం వచ్చిన కొందరు అతనిపై ఫిర్యాదు చేశారు. అతడిని విజయనగరం జిల్లాకు చెందిన సూర్యప్రకాశ్‌గా గుర్తించారు. పోలీసులు అతడి కోసం గాలింపు చేపట్టారు. ఈ ఘటనపై హోంమంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. నకిలీ ఐపీఎస్‌పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

వెస్ట్రన్ కంట్రీస్ ఆంక్షలు, డాలర్ ఆయుధీకరణను అడ్డుకొనేందుకు రష్యా దీటైన పథకమే వేసింది. ఒకప్పుడు వ్యతిరేకించిన డిజిటల్ కరెన్సీనే అనుకూలంగా మలుచుకుంది. ఇతర దేశాలు, గ్లోబల్ కంపెనీలకు బిట్‌కాయిన్ల ద్వారా చెల్లింపులు చేపట్టింది. వీటి మైనింగ్, పేమెంట్లకు మద్దతుగా పుతిన్ చట్టాలు తీసుకొచ్చారు. డీసెంట్రలైజ్డ్ కరెన్సీ కావడమే BTC ప్లస్‌పాయింట్. యుద్ధం చేస్తున్నా రష్యా మెరుగైన GDP సాధించడానికి ఇదే కారణం.

కేన్స్ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై ‘గ్రాండ్ పిక్స్’ అవార్డును పొందిన ‘ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్’ మూవీ OTTలోకి రానుంది. పాయల్ కపాడియా తెరకెక్కించిన ఈ ఫీచర్ ఫిల్మ్ డిస్నీ+హాట్‌స్టార్‌లో JAN 3 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ముంబై నర్సింగ్ హోమ్‌లో పనిచేసే ఇద్దరు నర్సుల కథే ఈ చిత్రం. కశ్రుతి, దివ్య ప్రధాన పాత్రల్లో నటించారు. US మాజీ అధ్యక్షుడు ఒబామా మెచ్చిన ఈ మూవీ గోల్డెన్ గ్లోబ్ నామినేషన్స్‌నూ పొందింది.

బాక్సింగ్ డే టెస్టులో మూడో రోజు వర్షం కారణంగా ఆట నిలిచిపోయింది. ఆట నిలిచే సమయానికి భారత జట్టు 7 వికెట్లు కోల్పోయి 326 పరుగులు చేసింది. నితీశ్(85*), సుందర్(40*) క్రీజులో ఉన్నారు. ఇవాళ తొలి సెషన్‌లో టీమ్ ఇండియా రెండు వికెట్లు కోల్పోగా, రెండో సెషన్‌లో నితీశ్-సుందర్ 105 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మ్యాచ్ నిలిచిపోవడంతో అంపైర్లు టీ బ్రేక్ ప్రకటించారు.
Sorry, no posts matched your criteria.