India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తాను హక్కులు పొందిన ‘నవ యుగ నాయగన్ వేల్ పారి’ నవల నుంచి కొన్ని సీన్లను వాడుకోవడం తనను ఇబ్బంది పెట్టినట్లు దర్శకుడు శంకర్ ట్వీట్ చేశారు. ఇటీవల విడుదలైన ఓ సినిమా ట్రైలర్‌లో ముఖ్యమైన సీన్‌ను గమనించానని తెలిపారు. దయచేసి నవలలోని సన్నివేశాలు సినిమాల్లో, వెబ్ సిరీస్‌ల్లో వాడొద్దని కోరారు. ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. దీంతో ఆయన ఏ సినిమాను ఉద్దేశించి అన్నారో అని చర్చ మొదలైంది.
AP: అల్లూరి జిల్లా మారేడుమిల్లి సమీపంలోని జలతరంగిణి జలపాతంలో ముగ్గురు మెడికల్ విద్యార్థులు గల్లంతయ్యారు. తొలుత ఐదుగురు విద్యార్థులు కొట్టుకుపోగా, స్థానికులు ఇద్దరిని కాపాడారు. మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారిలో ఇద్దరు యువతులు, ఒక యువకుడు ఉన్నారు. ఏలూరులోని ఓ మెడికల్ కాలేజీ నుంచి 14 మందికిపైగా వైద్య విద్యార్థులు ఇవాళ టూర్‌కు వచ్చారు.
బంగ్లాతో జరిగిన టెస్టులో భారత మాజీ కెప్టెన్ ధోనీ సెంచరీల సంఖ్యను రిషభ్ పంత్ సమం చేశారు. తనను ఆయనతో పోల్చవద్దని మ్యాచ్ అనంతరం ఇంటర్వ్యూలో విజ్ఞప్తి చేశారు. ‘ధోనీ భాయ్ జట్టైన సీఎస్కే హోం గ్రౌండ్‌లో సెంచరీ చేయడం సంతోషంగా ఉంది. నా ఆలోచనా శైలి వేరుగా ఉంటుంది. దాన్ని బట్టే నిర్ణయం తీసుకుంటుంటాను. చుట్టూ ఏం జరుగుతుందన్నది పట్టించుకోకుండా నా ఆటపైనే దృష్టి పెట్టడం నాకు అలవాటు’ అని తెలిపారు.
భారతదేశంతో సహా ప్రపంచంలోని కొన్ని దేశాల్లో ఈ రోజు(ఆదివారం) పగలు, రాత్రి వేళలు దాదాపు సమానంగా ఉండనున్నాయి. ఈ రోజు సాయంత్రం 6:13 గంటలకు సెప్టెంబర్ ఈక్వినాక్స్ చోటుచేసుకోనుంది. అంటే, సూర్యుడు ఉత్తరార్ధ గోళం నుంచి భూమధ్య రేఖను దాటుతూ దక్షిణార్ధ గోళం వైపు కదులుతాడు. ఫలితంగా భారత్ సహా ప్రపంచంలోని చాలా ప్రాంతాలలో పగలు-రాత్రి వేళలు దాదాపు సమానంగా ఉంటాయి. ఏటా Mar, Sep నెలల్లో ఇలా జరుగుతుంది.
‘దేవర’ ఈ నెల 27న విడుదల కానున్న సంగతి తెలిసిందే. అభిమానుల్లో సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాల్ని మూవీ టీమ్ మరింతగా పెంచుతోంది. తాజాగా ఆ సినిమా సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ దేవర గురించి ట్వీట్ చేశారు. మూవీ బ్లాక్‌బస్టర్ అన్న అర్థం వచ్చేలా మూడు కప్పులు, చప్పట్ల ఎమోజీలు పెట్టి దేవర అని హాష్ ట్యాగ్ ఇచ్చారు. దీంతో తమ హీరో హిట్ కొట్టేసినట్లే అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
TG: రాష్ట్రంలో అసలు ప్రతిపక్షం ఉందా అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడో లేదో తెలియడం లేదన్నారు. అమృత్ టెండర్లపై <<14158364>>కేటీఆర్<<>> నిరాధార ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. రూ.8,888 కోట్ల అక్రమాలకు ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని, అందుకే KTR ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
తెలంగాణలో రానున్న నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు ఉదయం వరకు కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. మిగతా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయంది.
TG: పథకాల అమలు, పార్టీ వ్యవహారాలు, స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధత ఇతర అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం మొదలైంది. మాదాపూర్‌లోని హోటల్‌లో జరగుతున్న ఈ భేటీకి కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఇటీవల బీఆర్ఎస్‌లోనే ఉన్నట్లు ప్రకటించిన అరికెపూడి గాంధీ ఈ సమావేశానికి హాజరవ్వడం చర్చనీయాంశంగా మారింది.
బాలీవుడ్ సినిమా ‘స్త్రీ 2’ కలెక్షన్లపరంగా చరిత్ర సృష్టించనుంది. ఈరోజు గడిస్తే హిందీలో రూ.600 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించిన తొలి సినిమాగా నిలవనుందని ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ తెలిపారు. చివరిగా బాహుబలి-2 హిందీలో రూ.500 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించింది. ‘స్త్రీ’కి కొనసాగింపుగా వచ్చిన ‘స్త్రీ2’ దాన్ని దాటేసింది. విడుదలై 6 వారాలైనా ఇంకా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
పరీక్షల సందర్భంగా విద్యార్థులు చదివింది కంగారులో మర్చిపోకుండా ఉండేందుకు ప్రిపరేషన్ మూడ్ నుంచి ఎగ్జామ్ మూడ్‌లోకి మారాలి. స్కోరింగ్ టాపిక్స్‌పై అధికంగా దృష్టిసారించాలి. విభిన్న కోణాల్లో ప్రశ్నలకు జవాబులు ఇవ్వడం, లాజికల్‌గా సమాధానాలు ఇచ్చేందుకు లాంగ్ ఫార్మాట్‌లో రాయడం ప్రాక్టీస్ చేయాలి. సోషల్ మీడియాపై ధ్యాస తగ్గించి తగిన విశ్రాంతి తీసుకొనేలా ప్లాన్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.