News June 16, 2024

చంద్రబాబు బూట్లను కొడాలి నాని పాలిష్ చేస్తున్నట్లుగా ఫ్లెక్సీలు

image

AP: గుంటూరులో మాజీ మంత్రి కొడాలి నాని ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. సీఎం చంద్రబాబు బూట్లను కొడాలి నాని పాలిష్ చేస్తున్నట్లుగా ఉన్న ఫొటోలతో ఫ్లెక్సీలు వెలిశాయి. నాని ఎక్కడున్నా బయటకు రావాలి అంటూ టీడీపీ నేత కనపర్తి శ్రీనివాసరావు ఆ ఫ్లెక్సీలు వేయించారు. కాగా ఎన్నికల ముందు కుప్పంలో చంద్రబాబు గెలిస్తే రాజకీయ సన్యాసం చేసి ఆయన బూట్లు తుడుస్తానని నాని ప్రకటించినట్లు సమాచారం.

News June 16, 2024

ఫాదర్స్ డే.. చిరంజీవి పోస్ట్ వైరల్!

image

ఫాదర్స్ డే సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. తన తండ్రి వెంకట్రావుతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేస్తూ ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా తన తండ్రి అల్లు అరవింద్‌తో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేస్తూ ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.

News June 16, 2024

భారత్‌తో కలిసి పనిచేస్తాం: కెనడా ప్రధాని

image

పలు కీలక అంశాలపై భారత్‌తో కలిసి పనిచేసేందుకు కట్టుబడి ఉన్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రకటించారు. ఇటీవల ముగిసిన జీ7 సదస్సులో ఆయన ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ‘భారత్-కెనడా మధ్య ఉన్న సున్నితమైన అంశాల గురించి నేను ప్రస్తావించను. కానీ రెండు దేశాలు కలిసి పనిచేయడానికి కట్టుబడి ఉన్నాయి’ అని తెలిపారు. ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య తర్వాతి నుంచి ఇరు దేశాల మధ్య బంధం క్షీణించిన సంగతి తెలిసిందే.

News June 16, 2024

ఫాదర్స్‌ డే స్పెషల్.. క్లీంకారతో రామ్‌చరణ్ (PHOTO)

image

రామ్‌చరణ్-ఉపాసనల ముద్దుల తనయ క్లీంకార ఎలా ఉంటుందో చూద్దామని మెగాఫ్యాన్స్ చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఈరోజు క్లీంకారకు చెందిన ఓ ఫొటో బయటకి వచ్చింది. చిన్నారిని ఆమె తండ్రి రామ్‌చరణ్ ఎత్తుకుని లాలిస్తున్నట్లుగా ఉన్న ఆ ఫొటో ఫాదర్స్ డే సందర్భంగా నెట్టింట చక్కర్లు కొడుతోంది. తమ బిడ్డతో చెర్రీ, ఉపాసన దంపతులు నడిచివెళ్తున్న ఫొటో సైతం నిన్న వైరల్ అయిన సంగతి తెలిసిందే.

News June 16, 2024

పవన్‌కు సాయి దుర్గ తేజ్ సర్ప్రైజ్ గిఫ్ట్!

image

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఆయన మేనల్లుడు సాయి దుర్గ తేజ్ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. స్టార్ వార్స్ లెగో సెట్‌ను ఆయనకు కానుకగా అందించారు. మరోవైపు పవన్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలవడంతో సాయి తేజ్ నిన్న తిరుమల శ్రీవారి మెట్లు ఎక్కి మొక్కు తీర్చుకున్నారు. కాగా పవన్‌కు చిరంజీవి భార్య సురేఖ కూడా ఓ పెన్నును బహుమతిగా ఇచ్చారు. దాని విలువ ఏకంగా రూ.2.50 లక్షలు అని టాక్.

News June 16, 2024

ఆరోగ్యశ్రీలో అవకతవకలపై శ్వేతపత్రం విడుదల చేస్తాం: మంత్రి సత్యకుమార్

image

AP: గత ప్రభుత్వం వైద్య రంగాన్ని నిర్లక్ష్యం చేసిందని వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ విమర్శించారు. ఆరోగ్యశ్రీలో అవకతవకలు జరిగాయని, నిధుల దుర్వినియోగంపై శ్వేతపత్రం విడుదల చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ‘ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తాం. ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు, మెడికల్ ఎక్విప్‌మెంట్ అందుబాటులో ఉండేలా చూస్తాం. క్యాన్సర్ రహిత ఏపీ దిశగా అడుగులు వేస్తాం’ అని పేర్కొన్నారు.

News June 16, 2024

లోక్‌సభ స్పీకర్‌ అభ్యర్థి ఎంపికపై NDAలో భిన్న స్వరాలు?

image

లోక్‌సభ స్పీకర్ పదవి NDAలో భాగమైన ఏ పార్టీకి దక్కుతుందనే దానిపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో JDU, TDP నేతల నుంచి భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. స్పీకర్ అభ్యర్థిగా BJP ఎవరిని నామినేట్ చేస్తే వారికే మద్దతు ఇస్తామని JDU నేత కేసీ త్యాగి వ్యాఖ్యానించగా, మిత్రపక్షాలన్నీ సమావేశమై అభ్యర్థిని నిర్ణయిస్తాయని TDP నేత పట్టాభిరామ్ తెలిపారు. మరోవైపు JDU/TDPకి ఈ పదవిని ఇవ్వాలని ఇండియా కూటమి నేతలు అంటున్నారు.

News June 16, 2024

ఐస్‌క్రీమ్‌లో జెర్రి

image

ఇటీవల మహారాష్ట్రలో ఐస్‌క్రీమ్‌లో తెగిపడిన మనిషి వేలు కనిపించిన ఘటన మరవకముందే మరో ఘటన వెలుగుచూసింది. యూపీలోని నోయిడాకు చెందిన దీపాదేవి తన కొడుకు కోసం బ్లింకిట్‌లో అమూల్ ఐస్‌క్రీమ్ ఆర్డర్ చేశారు. తీరా బాక్స్ ఓపెన్ చేసి చూడగా అందులో జెర్రి కనిపించడంతో షాక్ అయ్యారు. వెంటనే బ్లింకిట్‌కు ఫిర్యాదు చేయగా ఐస్‌క్రీమ్ ధర రూ.195ను ఆమెకు రీఫండ్ చేసింది. విషయాన్ని అమూల్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపింది.

News June 16, 2024

యశ్ ‘టాక్సిక్‌’లో ముగ్గురు హీరోయిన్లు వీరేనా?

image

కన్నడ స్టార్ హీరో యశ్ నటించనున్న ‘టాక్సిక్‌’ మూవీపై ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు నటించనున్నట్లు తెలుస్తోంది. కియారా అద్వానీ, హ్యూమా ఖురేషి, నయనతార నటించనున్నట్లు సమాచారం. కరీనా కపూర్ స్థానంలో నయనతారను తీసుకున్నట్లు టాక్. త్వరలో ఈ సినిమా షూటింగ్ లండన్‌లో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. గీతూ మోహన్‌దాస్ తెరకెక్కించనున్న ఈ మూవీ 2025 ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది.

News June 16, 2024

బక్రీద్‌కు జంతువధ నిషేధం అర్థరహితం: హైకోర్టు

image

మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలో విశాల్‌గఢ్ కోట వద్ద బక్రీద్‌కు జంతువధను ఆ రాష్ట్ర సర్కారు నిషేధించడాన్ని బాంబే హైకోర్టు తప్పుబట్టింది. ఆ నిర్ణయం అర్థరహితమైనదని తేల్చిచెప్పింది. కోట రక్షిత కట్టడాల జాబితాలోకి వస్తుందని ప్రభుత్వం తరఫు లాయర్లు వాదించగా.. మరి ఇన్నేళ్లూ ఏం చేశారంటూ ప్రశ్నించింది. ముస్లింలు బహిరంగంగా కాక.. ప్రైవేటు భూముల్లో యథేచ్ఛగా పండుగ చేసుకోవచ్చని తీర్పునిచ్చింది.