News December 20, 2024

కాంబ్లీ కన్నా అశ్విన్‌కు రెట్టింపు పెన్షన్ ఎందుకంటే..

image

మాజీ క్రికెటర్లకు BCCI అందిస్తున్న పెన్షన్‌పై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. కాంబ్లీకి ₹30K/M వస్తుండగా అశ్విన్‌కు ₹60K/M అందుతాయి. ఇద్దరూ టీమ్‌ఇండియాకే ఆడినా కేటగిరీ వేరవ్వడమే ఇందుకు కారణం. కాంబ్లీ 17 టెస్టులే ఆడటంతో BCCI అతడిని ఫస్ట్‌క్లాస్ విభాగంలో చేర్చింది. 106 టెస్టులాడిన యాష్ టెస్టు విభాగంలో ఉన్నారు. అందుకే రెట్టింపు పెన్షన్ అందుకుంటారు. BCCI 2022లో రివైజ్ చేయకుంటే ఇందులో సగమే వచ్చేది.

News December 20, 2024

అమెజాన్‌ అడవిలో 27 కొత్త జీవజాతుల గుర్తింపు

image

పెరూలోని అమెజాన్ అడవిలో సైంటిస్టులు కొత్తగా 27 రకాల జీవజాతుల్ని గుర్తించారు. 2022లో ఈ అడవుల్లో వారు చేసిన పరిశోధనల ఫలితాల్ని తాజాగా వెల్లడించారు. గుర్తించిన వాటిలో చిట్టెలుకలు, ఉడతలు, చేపలు, ఉభయచర జీవులు, సీతాకోకచిలుకల జాతులు ఉన్నాయన్నారు. మరో 48 జాతుల్ని కూడా గుర్తించినా వాటిపై మరింత అధ్యయనం చేయాల్సి ఉందని తెలిపారు. గిరిజనులు నివసించే ఆల్టో మాయో ప్రాంతంలో ఇవన్నీ కనిపించినట్లు వివరించారు.

News December 20, 2024

అందరితో చర్చించి ధరణిని రద్దు చేశాం: రేవంత్

image

TG: ధరణి పోర్టల్‌తో రైతుల సమాచారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేశారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ‘గాదె శ్రీధర్ రాజు ద్వారా డేటాను విదేశాలకు పంపించారు. వాళ్లు ఒక్క క్లిక్ కొడితే మన సమాచారమంతా నాశనం అవుతుంది. ఇక్కడి సర్వర్లు క్రాష్ అవుతాయి. అందుకే మేం అధికారంలోకి రాగానే ఎంతో మంది నిపుణులు, మేధావులు, రైతునేతలతో చర్చించి ధరణిని రద్దు చేశాం’ అని సీఎం వెల్లడించారు.

News December 20, 2024

జనవరి 12న బీసీసీఐ కార్యదర్శి ఎంపిక

image

జై షా ఐసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడంతో బీసీసీఐ కార్యదర్శి పదవి ఖాళీగా ఉన్న విషయం తెలిసిందే. వచ్చే నెల 12న ఈ పదవితోపాటు ట్రెజరర్‌ను బీసీసీఐ నియమించనుంది. ఈ పదవి కోసం దేవజిత్ సైకియా, అనిల్ పటేల్, రోహన్ జైట్లీతోపాటు మరికొందరు పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అస్సాంకు చెందిన సైకియా బోర్డు తాత్కాలిక కార్యదర్శిగా విధులు నిర్వహిస్తుండగా, కోశాధికారి స్థానం ఖాళీగా ఉంది.

News December 20, 2024

స్పాన్సర్ వెనక్కి వెళ్లకుండా ఉండేందుకు చెల్లింపులు: కేటీఆర్ లాయర్

image

TG: ఈ-కార్ రేసు సీజన్-10 నిర్వహణలో స్పాన్సర్ వెనక్కి తగ్గారని, ఆ ఇబ్బందుల నివారణకే ప్రభుత్వం HMDA ద్వారా చెల్లింపులు చేసిందని కేటీఆర్ తరఫు లాయర్ సుందరం వాదించారు. సీజన్-9 వల్ల దాదాపు రూ.700 కోట్ల లాభం వచ్చిందని చెప్పారు. అవినీతి నిరోధక చట్టం కింద పెట్టిన సెక్షన్లు ఈ కేసుకు వర్తించవని, ప్రాథమిక విచారణ లేకుండా కేసు పెట్టారని హైకోర్టులో పేర్కొన్నారు.

News December 20, 2024

బజాజ్ చేతక్ కొత్త బండి వచ్చేసింది

image

బజాజ్ తమ చేతక్ విద్యుత్ స్కూటర్‌లో కొత్త వేరియంట్లను ఈరోజు లాంచ్ చేసింది. వీటిలో 3502 వేరియెంట్ ఎక్స్‌షోరూమ్ ధర రూ.1.20 లక్షలుగా, 3501 వేరియెంట్ ధర రూ.1.27 లక్షలుగా ఉంది. డిజిటల్ క్లస్టర్, ఐదంగుళాల డిస్‌ప్లే, మ్యాప్స్, కాల్స్, మ్యూజిక్ కంట్రోల్, డాక్యుమెంట్ స్టోరేజీ, చోరీ అలెర్ట్, 35 లీటర్ బూట్ స్పేస్, 3.5 kwh బ్యాటరీ ప్యాక్‌, 73 kmph టాప్ స్పీడ్, 125 కి.మీ మైలేజీ దీని ప్రత్యేకతలు.

News December 20, 2024

ధరణితో రైతులకు భూములు దూరం: CM

image

తెలంగాణలో ప్రజల ఆత్మగౌరవం నిలబెట్టేదే భూమి అని CM రేవంత్ అన్నారు. భూభారతిపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా మాట్లాడారు. ‘భూమిలేని పేదలకు ఇందిరా సర్కార్ భూమిచ్చింది. ఆక్రమణలు తొలగించి రైతుల హక్కులు కాపాడేందుకు గత ప్రభుత్వాలు చట్టాలు తెచ్చాయి. కానీ BRS ప్రభుత్వం తెచ్చిన ధరణి మాత్రం అన్నదాతలను తమ భూములకు దూరం చేసింది. యువరాజు(KTR)కు అత్యంత సన్నిహితులైన వారికి దీని పోర్టల్‌ను అప్పగించారు’ అని ఆరోపించారు.

News December 20, 2024

పీసీ యాక్ట్ వర్తించదు.. HCలో కేటీఆర్ న్యాయవాది వాదనలు

image

TG: ఈ-కార్ రేసు కేసులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. KTRపై పెట్టిన పీసీ యాక్ట్ వర్తించదని, ఆయన లబ్ధి పొందినట్లు FIRలో లేదని కేటీఆర్ తరఫు న్యాయవాది సుందరం వాదించారు. రాజకీయ కక్షలో భాగంగానే కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. మరోవైపు ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు.

News December 20, 2024

బీఆర్ఎస్ అహంభావంతో వ్యవహరిస్తోంది: CM

image

TG: అసెంబ్లీలో బీఆర్ఎస్ అహంభావంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. భూభారతిపై చర్చ సందర్భంగా మాట్లాడిన ఆయన అమర్యాదతో సభాపతిపైనే పేపర్లు చింపి విసిరేశారని చెప్పారు. వారిపై చర్యలు తీసుకొనే పరిస్థితులు వచ్చినా స్పీకర్ ఓపికతో వ్యవహరించారని తెలిపారు. ప్రతిపక్షం సహనం కోల్పోయిందని సీఎం వ్యాఖ్యానించారు.

News December 20, 2024

మందిర్-మ‌సీదు వివాదాలు ఇక చాలు: భాగ‌వ‌త్‌

image

మందిర్-మ‌సీదు పేరుతో రోజుకో చోట వివాదాలు రేప‌డం ఇక ఎంత‌మాత్ర‌మూ కొన‌సాగ‌నివ్వ‌కూడ‌దని RSS చీఫ్ మోహ‌న్ భాగ‌వ‌త్ పున‌రుద్ఘాటించారు. రామ మందిరం నిర్మాణం త‌రువాత కొంద‌రు ఇలాంటి అంశాల‌ను లేవ‌నెత్తి లీడ‌ర్లు అవుదామ‌నుకుంటున్నార‌ని, ఇది ఆమోద‌యోగ్యం కాద‌ని స్పష్టం చేశారు. హిందువుల‌కు విశ్వాసం ఉన్నందున రామ మందిర నిర్మాణం జ‌రిగింద‌న్నారు. అందరం కలిసికట్టుగా జీవించగలమనే సందేశాన్ని భారత్ చాటాలన్నారు.