News September 22, 2024

2025 క్వాడ్ సమ్మిట్‌ ఆతిథ్యానికి భారత్ సిద్ధం: మోదీ

image

క్వాడ్ సమ్మిట్‌-2025కు ఆతిథ్యమిచ్చేందుకు భారత్ సిద్ధమని PM మోదీ అన్నారు. విల్మింగ్టన్‌ క్వాడ్ సమ్మిట్‌లో విదేశీ అధినేతలతో కలిసి పాల్గొన్నారు. 2021 నుంచి క్వాడ్ ఎంతో పురోగతిని సాధించిందని, ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల్లో క్వాడ్ అవసరం ఎంతో ఉందన్నారు. ప్రజాస్వామ్య విలువల ప్రాతిపదికన దేశాలు కలిసి పనిచేయడం మానవాళికి ఎంతో ముఖ్యమన్నారు. కాగా క్వాడ్‌లో ఇండియా, US, జపాన్, ఆస్ట్రేలియా సభ్యదేశాలుగా ఉన్నాయి.

News September 22, 2024

మళ్లీ నిరాశ పరచిన ‘దేవర’ టీమ్

image

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ సినిమా నుంచి సెకండ్ ట్రైలర్ విడుదల వాయిదా పడింది. ముందుగా చెప్పినట్లు 11.07 గంటలకు విడుదల చేయట్లేదని మేకర్స్ ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందారు. మొన్న ‘ఆయుధ పూజ’ సాంగ్‌కి కూడా ఇలానే చేశారని, రిలీజ్ ట్రైలర్‌పై ఎన్నో ఆశలు పెట్టుకుంటే మళ్లీ మా ఆశలపై నీళ్లు చల్లారంటూ మండిపడుతున్నారు. ఎక్కువ లేట్ చేయకుండా విడుదల చేయాలని కోరుతున్నారు. మీ కామెంట్?

News September 22, 2024

రేపు అంగప్రదక్షిణం టికెట్లు విడుదల

image

AP: తిరుమల శ్రీవారి అంగప్రదక్షిణం టికెట్లు రేపు విడుదల కానున్నాయి. 2024 డిసెంబర్ టోకెన్లు సెప్టెంబర్ 23న ఉదయం 10గంటలకు అందుబాటులోకి వస్తాయి. టికెట్ల కోసం ttdevasthanams.ap.gov.inలో చూడవచ్చు.

News September 22, 2024

ట్రాఫిక్ సిగ్నల్స్ జంప్, ర్యాష్ డ్రైవింగ్.. ఆర్టీసీపై విమర్శలు

image

ఆర్టీసీ బస్సు డ్రైవర్లు ర్యాష్‌గా డ్రైవింగ్ చేస్తున్నారని, ట్రాఫిక్ సిగ్నల్స్‌ను పట్టించుకోవట్లేదని విమర్శలొస్తున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని మెట్టుగూడ మెట్రో స్టేషన్ వద్ద రెడ్ సిగ్నల్ పడినప్పటికీ లోకల్ బస్ పట్టించుకోకుండా వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన ఫొటోతో ఓ నెటిజన్ పోలీసు, ఆర్టీసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇటీవలే మాదాపూర్‌లో ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో ఓ యువతి మరణించిన విషయం తెలిసిందే.

News September 22, 2024

మహిళను 30 ముక్కలుగా నరికి..

image

కర్ణాటకలోని బెంగళూరులో దారుణం జరిగింది. ఓ ఇంట్లో 29 ఏళ్ల మహిళను హత్య చేసి 30 ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో దాచారు. 4-5 రోజుల క్రితం ఈ మర్డర్ జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఝార్ఖండ్‌కు చెందిన మహాలక్ష్మి (29) భర్త హేమంత్‌తో విడిపోయి ఒంటరిగా ఉంటోందని పోలీసులు తెలిపారు. అయితే కొన్ని రోజులుగా ఆమెను పికప్, డ్రాప్ చేసేందుకు ఓ యువకుడు వచ్చే వాడని, అతడే ఈ హత్య చేసి ఉండొచ్చని ఏసీపీ తెలిపారు.

News September 22, 2024

స్మృతి ఇరానీకి ఢిల్లీ BJP పగ్గాలు?

image

వచ్చే ఏడాది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో BJP వ్యూహాలకు పదునుపెడుతోంది. AAP కన్వీనర్ కేజ్రీవాల్ CM పదవి నుంచి తప్పుకొని ఆతిశీకి బాధ్యతలు అప్పగించగా BJP తమ ఫైర్ బ్రాండ్ స్మృతి ఇరానీని తెరపైకి తెచ్చే ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఢిల్లీలో సభ్యత్వ నమోదును ఆమె చూసుకుంటున్నారు. ఆమెనే CM అభ్యర్థనే ప్రచారం కూడా ఉంది. సౌత్ ఢిల్లీలో ఇల్లు కొనడం చూస్తే స్మృతి ఢిల్లీలో పాగా వేయడం ఖాయంగానే కనిపిస్తోంది.

News September 22, 2024

తిరుమల నెయ్యి వివాదం.. పోలీసులకు ‘అమూల్’ ఫిర్యాదు

image

తిరుమలకు లడ్డూ ప్రసాద తయారీకి తాము కల్తీ నెయ్యిని పంపినట్లు కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని గుజరాత్‌లో అమూల్ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొంది. దీనిపై పోలీసులు FIR నమోదు చేశారు. తాము ఇప్పటివరకు టీటీడీకి ఆవు నెయ్యి సప్లై చేయలేదని అమూల్ స్పష్టం చేసింది.

News September 22, 2024

చరిత్ర సృష్టించిన భారత్

image

చెస్ ఒలింపియాడ్‌-2024లో భారత్ తన మొట్టమొదటి బంగారు పతకాన్ని గెలుచుకుంది. టోర్నీలో తొలిసారి పసిడి పతకాన్ని గెలిచి చరిత్ర సృష్టించింది. ఓపెన్ సెక్షన్‌లో భారత్‌ మరో రౌండ్‌ మిగిలుండగానే 19 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. అమెరికా ప్లేయర్‌ ఫాబియానో కరువానను దొమ్మరాజు గుకేశ్‌ ఓడించారు. ఈయన నవంబర్‌లో జరిగే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో తలపడనున్నారు. కాగా 2020లో రష్యాతో కలిసి భారత్ సంయుక్త విజేతగా నిలిచింది.

News September 22, 2024

ఏఆర్ డెయిరీలో కేంద్రం తనిఖీలు

image

AP: తిరుమలకు గతంలో ఆవు నెయ్యిని సరఫరా చేసిన ఏఆర్ డెయిరీలో కేంద్ర ఆహార భద్రతా విభాగం ఉన్నతాధికారులు తనిఖీలు చేశారు. తమిళనాడులోని దిండుగల్ ప్లాంటులో సుమారు రెండు గంటల పాటు తనిఖీలు చేసి నెయ్యి, వెన్న, పెరుగు శాంపిల్స్ సేకరించారు. కాగా ఈ సంస్థ తిరుమలకు పంపిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని, బ్లాక్ లిస్టులో పెట్టామని టీటీడీ ఈవో చెప్పడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే.

News September 22, 2024

నేడు సీఎం చంద్రబాబుతో టీటీడీ అధికారుల భేటీ

image

AP: టీటీడీ అధికారులు ఇవాళ సీఎం చంద్రబాబుతో సమావేశం కానున్నారు. లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ఈవో శ్యామలరావు సీఎంకు నివేదిక ఇవ్వనున్నారు. ఆగమ సలహా మండలి సూచనలను ఆయనకు వివరించనున్నారు. రిపోర్ట్ అందిన తర్వాత ఈ వ్యవహారంపై ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. టీటీడీ ప్రాథమిక రిపోర్టు ఇప్పటికే ప్రభుత్వానికి అందింది.