India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
‘తండేల్’ చిత్రం కోసం హీరో నాగచైతన్య అన్నీ వదిలేశారని నిర్మాత బన్నీ వాసు అన్నారు. నాగార్జున అబ్బాయిని అనే ఫీలింగ్ లేకుండా రాజు అనే పాత్ర కోసం సాధారణ స్థాయికి వెళ్లారని చెప్పారు. కామన్ మ్యాన్‌కు కనెక్ట్ అయ్యేందుకు వారిలాగే ఉంటున్నారని చెప్పారు. ఇది వరకూ చైతన్య వేరని ఇప్పుడు వేరని పేర్కొన్నారు. కాగా చందూ మొండేటి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తున్నారు.
TG: సీఎం రేవంత్ రెడ్డితో ప్రపంచ బ్యాంకు దక్షిణాసియా ఉపాధ్యక్షుడు మార్టిన్ రైజర్ బృందం సమావేశమైంది. మౌలిక వసతులు అభివృద్ధి, విద్య, వైద్యం, సాగు నీటి రంగాల్లో ప్రాజెక్టులను అత్యుత్తమ ప్రమాణాలతో నిలిపేలా ఆర్థిక సహకారం అందించాలని వారిని కోరారు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో ప్రభుత్వ ప్రాధాన్యతలను బృందం కొనియాడింది. ప్రభుత్వానికి సహకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొంది.
TG: మతమార్పిడి చేసుకున్న నాయకులు పాలించడం వల్ల తిరుమలలో ఈ పరిస్థితి నెలకొందని బీజేపీ నేత మాధవీలత సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూ ఘటన మాటల్లో చెప్పలేని దౌర్భాగ్య పరిస్థితి అని అన్నారు. ప్రసాదంలో జంతు కొవ్వు ఉపయోగించడమంటే పాపాన్ని అంట కట్టుకోవడమేనన్నారు. ఈ విషయంలో నిజం తేలే వరకు వదలిపెట్టనని తేల్చి చెప్పారు.
కేరళలోని కాసరగోడ్‌లో కొన్ని వర్గాల్లో ఓ విచిత్ర ఆచారం ఉంది. పెళ్లికాకుండానే చనిపోయిన యువతీయువకులకు వారి కుటుంబీకులు పెళ్లి చేస్తారు. అయితే వారిద్దరి స్థానంలో బొమ్మల్ని ఉంచుతారు. వివాహ ఆహ్వానం నుంచి మొదలు అన్ని తతంగాలూ నిజమైన పెళ్లిలాగే జరుపుతారు. పెళ్లైన తర్వాత ఇరు కుటుంబాలు చుట్టాలుగా కొనసాగుతాయి. పెళ్లి ఘట్టం లేకుండా కన్నుమూసిన తమ బిడ్డల ఆత్మలు ఈ విధంగా శాంతిస్తాయనేది వారి నమ్మకం.
AP: రాజకీయాలకు అతీతంగా తెలుగు చిత్ర సీమకు మంచి జరగాలని చంద్రబాబు కూటమి నాయకత్వం కోరుకుంటుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. దేవర సినిమాకు టికెట్ల పెంపుపై ఆయన స్పందించారు. గత వైసీపీ ప్రభుత్వంలో సినీ నిర్మాతలు, నటులు పడిన కష్టాలు తనకు వ్యక్తిగతంగా తెలుసని చెప్పారు. తామెప్పుడూ సినీ పరిశ్రమను వైసీపీ నేతల్లా ఇబ్బందులకు గురిచేయబోమని పేర్కొన్నారు. దేవర విడుదలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
తమ ఛైర్మన్ మాధబికి సంబంధించిన వివరాలను బహిర్గతం చేయడానికి సెబీ నిరాకరించింది. ఆస్తులు, ఈక్విటీలపై మాధబీ సమర్పించిన డిక్లరేషన్లను బహిర్గతం చేయడం ఆమె వ్యక్తిగత భద్రతను ప్రమాదంలో పడేసినట్టే అవుతుందని RTI దరఖాస్తుకు సమాధానం ఇచ్చింది. కాంఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కారణంగా ఆమె తప్పుకున్న కేసుల వివరాలు అందుబాటులో లేవని, వాటిని క్రోడీకరించడానికి అధిక సమయం పడుతుందని తెలిపింది.
పాండాలను చూసేందుకు వచ్చే సందర్శకులను చైనాలో కొన్ని జూలు మోసం చేస్తున్నాయి. తాజాగా షాన్వీ జూలో కుక్కలకు పాండాల్లా రంగులు వేస్తున్నారని ఆరోపిస్తూ ఓ సందర్శకుడు వీడియో తీసి నెట్లో పెట్టారు. తొలుత అవి పాండా డాగ్స్ అనే జాతి అంటూ బుకాయించిన జూ నిర్వాహకులు, తర్వాత ఆరోపణలు నిజమని ఒప్పుకొన్నారు. దీంతో సందర్శకుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. తమ డబ్బులు వెనక్కివ్వాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు.
జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించడమే తమ మొదటి ప్రాధాన్యమని కాంగ్రెస్ తెలిపింది. జమ్మూలో ఆ పార్టీ అధ్యక్షుడు ఖర్గే మాట్లాడుతూ JKకు కాంగ్రెస్ ఇచ్చిన ఏడు హామీల్లో రాష్ట్ర హోదా మొదటి ప్రాధాన్యమన్నారు. అలాగే ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తామని ఆయన తెలిపారు. జమ్మూకశ్మీర్‌కు బీజేపీ చేసిందేమీ లేదని, ఉద్యోగాల పేరుతో యువతను వంచించిందని ఖర్గే విమర్శించారు.
AP: తిరుమల వేంకటేశ్వరుడి లడ్డూ ప్రసాదాల పవిత్రతను పునరుద్ధరించినట్లు టీటీడీ తెలిపింది. నందిని డెయిరీ నెయ్యితో తాజాగా లడ్డూలు తయారు చేసినట్లు పేర్కొంది. భక్తుల్లో ఉన్న అపోహలు తొలగించేందుకు ల్యాబ్ రిపోర్టులు కూడా ట్వీట్ చేసింది. కాగా గతంలో వాడిన నెయ్యిలో S వ్యాల్యూ 100కు 19 పాయింట్లు మాత్రమే ఉండగా, ప్రస్తుతం వాడిన నెయ్యిలో S వ్యాల్యూ 100కు 97 పాయింట్లు ఉండడం విశేషం.
తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందన్న వ్యవహారంపై టాలీవుడ్ హీరో నిఖిల్ స్పందించారు. ‘గత కొన్నేళ్లుగా ఈ వ్యవహారం జరిగిందని తెలిసి షాకయ్యా. ఇది ఏ ఒక్కరికో కాదు. ప్రతి భారతీయుడి విశ్వాసానికి జరిగిన అవమానం. ఈ పని చేసిన వారిని శిక్షించాలి. దోషులను న్యాయస్థానం ముందుకు తీసుకురావాలి’ అని ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్, అమిత్‌షాలను ఆయన ట్యాగ్ చేశారు.
Sorry, no posts matched your criteria.