India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ట్విటర్ (X)లో హ్యాష్‌ట్యాగ్‌లు తీసేయాలని భావిస్తున్నట్లు ఆ సంస్థ సీఈఓ ఎలాన్ మస్క్ తెలిపారు. సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ అవసరం లేదని చెప్పారు. నెటిజన్లు కూడా దీనిని ఉపయోగించడం ఆపేయాలని సూచించారు. ఇది చాలా ఎబ్బెట్టుగా కనిపిస్తోందని అసహనం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా బ్రిటన్‌కు చెందిన ‘రీ ఫామ్’ అనే రాజకీయ పార్టీకి మస్క్ దాదాపు రూ.849 కోట్లు విరాళం ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ స్పేస్ స్టేషన్ నుంచి భూమిపైకి రావడం మరింత ఆలస్యం కానుందని నాసా ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చి చివర్లో అంతరిక్షానికి పంపే క్రూ-10లో వారు తిరిగొస్తారని వెల్లడించింది. షెడ్యూల్ ప్రకారం నిక్ హాగ్, గుర్బునోవ్ వెళ్లాల్సిన మిషన్ వచ్చే FEBలోనే ప్రయోగించాల్సి ఉండగా పలు కారణాల వల్ల MARలో నిర్వహిస్తామంది. వారితో పాటే సునీత, విల్మోర్ రిటర్న్ అవుతారని తెలిపింది.

జమిలి ఎన్నికలపై జేపీసీ ఏర్పాటైంది. ఈ కమిటీలో లోక్‌సభ నుంచి 21, రాజ్యసభ నుంచి 10 మంది MPలు ఉన్నారు. పీపీ చౌదరి, సీఎం రమేశ్, హరీశ్ బాలయోగి, బాలశౌరి, బన్సూరి రమేశ్, పురుషోత్తం రూపాలా, అనురాగ్ ఠాకూర్, విష్ణు దయాల్, భర్తృహరి, సంబిత్ పాత్ర, అనిల్ బలూని, విష్ణు శర్మ, ప్రియాంకా గాంధీ, మనీశ్ తివారీ, సుఖ్‌దేవ్ భగత్, ధర్మేంద్ర యాదవ్, కళ్యాణ్ బెనర్జీ, సెల్వగణపతి, సుప్రియా సూలే, శ్రీకాంత్ షిండే, చందన్ చౌహాన్.

పుల్వామా అమరవీరుడు విజయ్ సోరెంగ్ కుమారుడు రాహుల్ సోరెంగ్ హరియాణా అండర్-16 జట్టుకు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తెలిపారు. ‘రిమెంబర్ ద నేమ్.. రాహుల్ సోరెంగ్’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. కాగా 2019 నుంచి సెహ్వాగ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో రాహుల్ ఉచితంగా చదువుకుంటున్నారు. అదే సమయంలో క్రికెట్‌లోనూ శిక్షణ తీసుకుంటున్నారు. త్వరలో ఆయన విజయ్ మర్చంట్ ట్రోఫీలో ఆడనున్నారు.

ఈ నెల 21, 22 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోదీ కువైట్‌లో పర్యటిస్తారు. ఆ దేశ ఆహ్వానం మేరకు ఆయన అక్కడ పర్యటించనున్నారు. కువైట్ ఉన్నతాధికారులు, ప్రవాస భారతీయులతో ఆయన భేటీ అవుతారు. కాగా కువైట్‌ను చివరిసారి 1981లో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ సందర్శించారు. మళ్లీ 43 ఏళ్ల తర్వాత మోదీ అక్కడికి వెళ్తున్నారు. కువైట్‌లో దాదాపు 10 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు.

భోజనం చేసిన వెంటనే సోంపు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇందులో ఉండే అనెథోల్ జీర్ణాశయ ఎంజైమ్‌ల ఉత్పత్తికి సహకరిస్తుంది. ఎసిడిటీ నుంచి ఉపశమనం కలుగుతుంది. సోంపులో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్-సి, పొటాషియం, మెగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి. ఈ పోషకాలన్నీ శరీరానికి అందుతాయి. అలాగే నోటి నుంచి దుర్వాసన రాకుండా సోంపు నివారిస్తుంది. ఇది చర్మం పొడిబారకుండా చేయడంతో పాటు దద్దుర్లు రాకుండా చేస్తుంది.

భారత్-చైనా సంబంధాలు మరింత బలోపేతమయ్యే దిశగా సాగుతున్నాయి. బీజింగ్ లో ఆ దేశ విదేశాంగ ప్రతినిధితో అజిత్ దోవల్ భేటీ అయ్యారు. సరిహద్దు సమస్యల పరిష్కారానికి 6 ఒప్పందాలపై సంతకాలు చేశారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి సరిహద్దుల్లో శాంతిపూర్వకంగా ఉండాలని నిర్ణయించారు. టిబెట్‌లోని కైలాష్ మానసరోవర్ యాత్రను ప్రమోట్ చేయడంతో పాటు నాథులా బోర్డర్ ట్రేడ్, క్రాస్ బోర్డర్ రివర్ కోపరేషన్‌పై సయోధ్య కుదిరింది.

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ఉత్తర దిశగా ప్రయాణిస్తోందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో వచ్చే 48 గంటలు భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. రేపు కాకినాడ, విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. గంటకు 35-45కి.మీ వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.

CM రేవంత్ తెలంగాణను భ్రష్టు పట్టిస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫైరయ్యారు. అదానీ విషయంలో మాట్లాడే నైతిక హక్కు ఆయనకు లేదని, రూ.వంద కోట్లతో స్కిల్ యూనివర్సిటీ అభివృద్ధికి ఒప్పందం చేసుకున్నప్పుడు గుర్తు లేదా? అని ప్రశ్నించారు. రేవంత్ అయినా, రాహుల్ అయినా అదానీ అవినీతిపై ఒక్క సాక్ష్యమైనా చూపిస్తారా? అని సవాల్ విసిరారు. కాంగ్రెస్ సర్కార్ ఏడాదిలోనే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందన్నారు.

జమిలి ఎన్నికలపై దేశవ్యాప్త చర్చ జరుగుతున్న వేళ ఓ IRAS అధికారి చేసిన ట్విటర్ పోస్ట్ వైరలవుతోంది. ‘ఒకే దేశం- ఒకే పన్ను, ఒకే దేశం – ఒకే ఎన్నికలు తర్వాత మద్యం ప్రియుల నుంచి ఈ డిమాండ్ వస్తోంది. దయచేసి ఆలోచించండి’ అని ఆయన ట్వీట్ చేశారు. అందులో గోవాలో రూ.320లు ఉన్న వైన్ బాటిల్ కర్ణాటకలో రూ.920గా ఉంది. దీనిపై కూడా వన్ నేషన్- వన్ రేట్ అని డిమాండ్ చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.