News September 20, 2024

బాంబే హైకోర్టులో కేంద్రానికి చుక్కెదురు.. ఐటీ రూల్స్ సవరణలు కొట్టివేత

image

IT రూల్స్‌కి కేంద్రం చేసిన స‌వ‌ర‌ణ‌ల‌ను బాంబే హైకోర్టు కొట్టివేసింది. సోష‌ల్ మీడియా వేదిక‌ల‌పై ప్ర‌భుత్వ వ్య‌వ‌హారాల‌కు సంబంధించి వ‌చ్చే న‌కిలీ, త‌ప్పుడు వార్త‌ల‌కు అడ్డుక‌ట్ట‌వేయ‌డానికి ఫ్యాక్ట్ చెక్ యూనిట్‌ను ఏర్పాటు చేసుకొనేలా కేంద్రం IT చ‌ట్టానికి స‌వ‌ర‌ణ‌లు చేసింది. అయితే ఇది ఆర్టిక‌ల్ 14 (స‌మాన‌త్వం), 19(స్వేచ్ఛ‌) హ‌క్కుల‌ను ఉల్లంఘించ‌డ‌మేన‌ని జస్టిస్ అతుల్ చందూర్కర్ బెంచ్ అభిప్రాయ‌ప‌డింది.

News September 20, 2024

రేపు గవర్నర్‌ను కలవనున్న వైఎస్ షర్మిల

image

ఏపీ గవర్నర్‌ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రేపు కలవనున్నారు. తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ విచారణకు ఆదేశించేలా చర్యలు తీసుకోవాలని వినతిపత్రం ఇవ్వనున్నారు.

News September 20, 2024

వైవీ, ధర్మారెడ్డిపై హిందూ సంఘాల ఫిర్యాదు

image

AP: TTD మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మాజీ EO ధర్మారెడ్డిపై గుంటూరులోని అరండల్ పేట పోలీస్ స్టేషన్‌లో హిందూ సంఘాలు ఫిర్యాదు చేశాయి. ‘వైవీ, ధర్మారెడ్డి కలిసి తిరుమల లడ్డూను జంతువుల నూనెతో తయారు చేయించి అపవిత్రం చేశారు. తాము తీవ్ర మనస్తాపానికి గురయ్యాం. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. మాజీ CM జగన్‌కు తెలియకుండా ఇది జరగదు. అందుకే ఆయన కూడా ప్రజలకు క్షమాపణ చెప్పాలి’ అని ఆ సంఘాలు డిమాండ్ చేశాయి.

News September 20, 2024

తిరుమలలో లడ్డూ ప్రసాదం ఎప్పుడు మొదలైందంటే..

image

భక్తులు అమృతంగా భావించే తిరుమల లడ్డూ పంపిణీ ఎప్పటి నుంచి ప్రారంభమైంది? దీనిపై భిన్న కథనాలున్నాయి. అయితే 1803 నుంచి బూందీ ప్రసాద వితరణ ప్రారంభమైందనేది చరిత్రకారుల అంచనా. ఆ తర్వాత అనేక మార్పులతో 1940 నాటికి ఇప్పుడున్న లడ్డూగా స్థిరపడిందని చెబుతున్నారు. అంతకంటే ముందు తిరుప్పొంగం, సుఖీయం, 1455లో అప్పం, వడ(1460), అత్తిరసం(1468), మనోహరపడి(1547) ప్రసాదాలను భక్తులకు అందించేవారని తెలుస్తోంది.

News September 20, 2024

ALERT.. ఈ జిల్లాల్లో వర్షాలు

image

తెలంగాణలో మళ్లీ వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు ఉదయం వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30-40కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగతా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

News September 20, 2024

రేపు పండితులతో సీఎం చంద్రబాబు సమావేశం

image

AP: తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడటంపై శాస్త్రాల పరంగా తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం ఫోకస్ చేసింది. రేపు ఆగమ, వైదిక పరిషత్‌లతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. ఆలయ శుద్ధి అవసరమా? తదితర అంశాలపై పండితులు ఇచ్చే సూచనలు, సలహాలతో తదుపరి చర్యలు తీసుకోనున్నారు.

News September 20, 2024

పంచామృతంలో ఏఆర్ డెయిరీ నెయ్యి వాడట్లేదు: TN ప్రభుత్వం

image

AP: తిరుమలకు నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డెయిరీపై తమిళనాడు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పళని సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలోని పంచామృతంలో ఏఆర్ డెయిరీ నెయ్యి వాడుతున్నారన్న ప్రచారం అవాస్తవమని తెలిపింది. ఆవిన్ నెయ్యి వాడుతున్నట్లు వెల్లడించింది. కాగా ఇప్పటికే ఏఆర్ డెయిరీపై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.

News September 20, 2024

జీతాలు పెంపు.. ఆరోగ్య మిత్రల సమ్మె విరమణ

image

TG: కొన్ని రోజులుగా చేస్తున్న సమ్మె విరమిస్తున్నట్లు ఆరోగ్య మిత్రలు వెల్లడించారు. మంత్రి దామోదర రాజనర్సింహతో జరిపిన చర్చలు ఫలించాయి. క్యాడర్ మార్పు, వేతనం రూ.15,600 నుంచి రూ.19,500కు పెంచేందుకు ప్రభుత్వం అంగీకరించింది. దీంతో సమ్మె విరమిస్తూ వారు లేఖ విడుదల చేశారు. రేపటి నుంచి యథావిధిగా ఆరోగ్య శ్రీ సేవల విధుల్లో పాల్గొంటామని ప్రకటించారు. మంత్రి దామోదరకు ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు.

News September 20, 2024

భక్తుల మనోభావాలతో చెలగాటం ఆడొద్దు: పవన్

image

AP: తిరుమల లడ్డూ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ‘తిరుమల లడ్డూ నాణ్యత, రుచిపై భక్తులు ఫిర్యాదులు చేశారు. దీంతో నెయ్యి శాంపిల్స్ ల్యాబ్‌కు పంపించాం. యానిమల్ ఫ్యాట్, ఫిష్ ఆయిల్ వాడినట్లు రిపోర్టుల్లో తేలింది. జంతువుల నూనెను వాడి ఆలయ పవిత్రతను దెబ్బ తీశారు. తక్కువ ధరకు నెయ్యి వస్తుందని ఎలా కొంటారు? భక్తుల మనోభావాలతో చెలగాటం ఆడొద్దు’ అని ఆయన మండిపడ్డారు.

News September 20, 2024

రోహిత్ వైఫల్యం.. ఇది నాలుగోసారి మాత్రమే!

image

టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ తొలి టెస్టులో మళ్లీ విఫలమయ్యారు. రెండు ఇన్నింగ్స్‌లోనూ తక్కువ స్కోర్లకే పేస్‌కు చిక్కారు. కానీ ఒకే టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లో రోహిత్ రెండంకెల స్కోరు దాటకపోవడం ఇది నాలుగోసారి మాత్రమే. ఇంతకు ముందు 2015లో శ్రీలంక, 2015, 2023లో సౌతాఫ్రికాతో జరిగిన టెస్టుల్లో శర్మ సింగిల్ డిజిట్లకే పెవిలియన్ చేరారు. వచ్చే టెస్టులో అయినా ఆయన పుంజుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.