India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: సింగరేణిలో అన్‌ఫిట్ పేరుతో కొంతమంది అక్రమార్కులు అమాయకులైన కార్మికులను మోసం చేస్తున్నారని, ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని CMD బలరాం తెలిపారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సంస్థకు నష్టం కలిగించేలా పనులు చేసే వారి సమాచారాన్ని విజిలెన్స్ విభాగానికి 9491144104కు కాల్ లేదా సంస్థకు మెయిల్ చేసి చెప్పాలని సూచించారు. కచ్చితమైన సమాచారం ఇచ్చిన వారికి రూ.10వేల నజరానా ఇస్తామని ప్రకటించారు.
జమిలి ఎన్నికలను కేంద్రం ఆమోదించడంతో ఎన్నికలు ఎప్పుడొస్తాయనే ప్రశ్న నెలకొంది. ఈ విధానం 2029 నుంచి అమల్లోకి రానుందని సమాచారం. అప్పుడు లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించాల్సి ఉంటుంది. అయితే దేశంలోని 17 రాష్ట్రాల్లో 2026, 2027లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. 2029లో జమిలి ఎన్నికలు నిర్వహిస్తే ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు రెండు, మూడేళ్లే అధికారంలో ఉంటాయి.
TG: క్లాస్ రూమ్‌లోకి సెల్‌ఫోన్ తీసుకెళ్లొద్దనే ఆదేశాలున్నా కొందరు టీచర్ల తీరు మారట్లేదు. ఇటీవల కలెక్టర్ల ఆకస్మిక తనిఖీల్లో పలువురు ఉపాధ్యాయులు సెల్‌ఫోన్‌లోనే సమయం గడుపుతూ కనిపించారు. దీంతో విద్యాశాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. తరగతి గదిలోకి ఫోన్ తీసుకెళ్లొద్దని, అత్యవసరమైతే HM అనుమతి తీసుకోవాలని పేర్కొంది. నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
AP: కౌలు రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భూయజమాని సంతకం లేకుండానే వచ్చే రబీ నాటికి కౌలు కార్డులను ఇవ్వాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించింది. దీనివల్ల కౌలు రైతులకు బ్యాంకుల ద్వారా పంట రుణాలు ఇప్పించడం, ప్రభుత్వ సబ్సిడీలు, పరిహారాలు అందించడం మరింత సులువవుతుంది. అదే సమయంలో రైతుల భూమి హక్కులకు నష్టం కలగకుండా చర్యలు తీసుకోనుంది. వారిలో ఉన్న అపోహలు తొలగించనుంది.
జమిలి ఎన్నికలతో తమకు నష్టం కలుగుతుందని పలు ప్రాంతీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దేశభద్రత, విదేశాంగ విధానం లాంటి జాతీయ అంశాల ఆధారంగా ప్రజలు అసెంబ్లీకీ ఓటు వేసే అవకాశం ఉందంటున్నాయి. స్థానిక సమస్యలు మరుగున పడటంతో పాటు ప్రాంతీయ పార్టీలు నష్టపోయి, జాతీయ పార్టీలకు మేలు కలుగుతుందని చెబుతున్నాయి. జమిలి ఎన్నికలు నిర్వహిస్తే 77% మంది ప్రజలు ఒకే పార్టీని ఎన్నుకునే అవకాశముందని ఓ సర్వేలో తేలింది.
తెల్లటి పలువరస కోసం చాలామంది ఎక్కువ సేపు బ్రష్ చేసుకుంటుంటారు. మరి కొంతమంది బలంగా తోముతారు. ఇవేవీ మంచివి కావంటున్నారు వైద్య నిపుణులు. ఇలా బ్రష్ చేస్తే పంటిపై ఉండే ఎనామిల్ పొర తొలగిపోతుంది. పళ్లు సెన్సిటివ్‌గా మారి జివ్వుమని లాగుతుంటాయి. అందుకే కేవలం 2, 3 నిమిషాల్లోనే బ్రషింగ్ ముగించాలని వైద్యులు చెబుతున్నారు. ఇక నిద్ర లేచాక, నిద్రపోయే ముందు బ్రష్ చేస్తే పళ్లు ఆరోగ్యంగా ఉంటాయని సూచిస్తున్నారు.
AP: టెట్ అభ్యర్థులకు ఇవాళ్టి నుంచి ఆన్‌లైన్‌లో నమూనా టెస్టులు అందుబాటులోకి రానున్నాయి. https://cse.ap.gov.in/లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. దీనివల్ల OCT 3 నుంచి జరిగే పరీక్షలను ఇబ్బంది లేకుండా రాసే వీలుంటుంది. ఈ నెల 22 నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈసారి TETకు 4.27లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. 16,347 టీచర్ పోస్టులతో మెగా DSC నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే.
AP: శ్రీవారి ప్రసాదంలో నెయ్యికి బదులుగా జంతువుల నూనె వాడారని CM చంద్రబాబు చేసిన ఆరోపణలపై YCP ఘాటుగా స్పందించింది. ఈ విషయంలో తన కుటుంబం దైవ ప్రమాణానికి సిద్ధమని, CBN సిద్ధమా? అని TTD మాజీ ఛైర్మన్ సుబ్బారెడ్డి చేసిన <<14135822>>పోస్టును<<>> రీట్వీట్ చేసింది. ‘చంద్రబాబు, లోకేశ్, వారి కుటుంబం ప్రమాణం చేయడానికి రెడీగా ఉన్నారా? మేం సవాల్ చేస్తున్నాం’ అని రాసుకొచ్చింది. CM ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారని మండిపడింది.
TG: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దసరా పండుగ నాటికి అన్నదాతల ఖాతాల్లో డబ్బులు జమ చేయనుందని సమాచారం. రేపు క్యాబినెట్‌లో చర్చించిన తర్వాత విధివిధానాలపై అధికారిక ప్రకటన వెలువడనుంది. ఎకరాకు రూ.7,500 చొప్పున రెండు విడతల్లో రూ.15,000లను ఇవ్వాల్సి ఉంది. 1.53 కోట్ల ఎకరాలకు రూ.11,475 కోట్లు వ్యయమవుతుందని అంచనా.
శర్వానంద్-అనన్య, జై-అంజలి నటించిన ‘జర్నీ’ మూవీ మరోసారి థియేటర్లలో అలరించనుంది. ఈ నెల 21న రీరిలీజ్ చేయనున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. శరవణన్ డైరెక్షన్‌లో తమిళంలో ‘ఎంగేయుమ్ ఎప్పోదుమ్’ పేరుతో తెరకెక్కిన ఈ సినిమా 2011 సెప్టెంబర్‌లో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. అదే ఏడాది డిసెంబర్‌లో తెలుగులో రిలీజ్ చేయగా, ఇక్కడా హిట్టయ్యింది.
Sorry, no posts matched your criteria.