News September 18, 2024

ఏపీ, తెలంగాణకు ట్రైనీ ఐపీఎస్‌ల కేటాయింపు

image

తెలుగు రాష్ట్రాలకు ఎనిమిది మంది ట్రైనీ ఐపీఎస్‌లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఆంధ్రప్రదేశ్‌కు దీక్ష(హరియాణా), బొడ్డు హేమంత్(ఏపీ), మనీషా వంగల రెడ్డి(ఏపీ), సుష్మిత(తమిళనాడు), తెలంగాణకు మనన్ భట్(జమ్ముూకశ్మీర్), రుత్విక్ సాయి(TG), సాయి కిరణ్(TG), యాదవ్ వసుంధర(UP)ను కేంద్రం కేటాయించింది.

News September 18, 2024

BREAKING: జానీ మాస్టర్‌పై పోక్సో కేసు

image

TG: జానీ మాస్టర్‌పై నార్సింగి పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. మైనర్‌గా ఉన్నప్పటి నుంచి లైంగికంగా ఇబ్బందిపెట్టారన్న ఫిర్యాదుతో దాన్ని పోక్సో కేసుగా మార్చారు. తొలుత బాధితురాలు రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేయగా, అక్కడ అత్యాచారం కేసుపై FIR నమోదైంది. ఆ తర్వాత దాన్ని నార్సింగి పీఎస్‌కు బదిలీ చేశారు.

News September 18, 2024

ముగిసిన క్యాబినెట్ భేటీ

image

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ముగిసింది. 4 గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో పలు కీలక విషయాలపై చర్చించినట్లు తెలుస్తోంది.

News September 18, 2024

Income Tax చట్టంలో పెను మార్పులు?

image

ఇన్‌కం ట్యాక్స్ చట్టాన్ని సింప్లిఫై చేయడంపై ఫైనాన్స్ మినిస్ట్రీ దృష్టి సారించింది. బడ్జెట్‌కు ముందే, 2025 జనవరిలోపు ఫాస్ట్‌ట్రాక్ రివ్యూ చేపట్టాలని చీఫ్ కమిషనర్ వీకే గుప్తా కమిటీని కోరినట్టు NDTV తెలిపింది. కాలం చెల్లిన క్లాజులు, సెక్షన్లు, సబ్ సెక్షన్లు 120 వరకు తొలగిస్తారని సమాచారం. టెలికం, సెజ్, క్యాపిటల్ గెయిన్స్ డిడక్షన్లూ ఇందులో ఉంటాయి. అవసరమైతే లా మినిస్ట్రీ సాయం తీసుకుంటారని తెలిసింది.

News September 18, 2024

కేంద్రం సంచలన నిర్ణయం

image

వన్ నేషన్-వన్ ఎలక్షన్‌ (జమిలి ఎన్నికలు)కు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రామ్‌నాథ్ కోవింద్‌ ప్యానెల్ నివేదికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. అది చట్టంగా మారితే లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించాల్సి ఉంటుంది. తద్వారా ప్రజాధనం ఆదా అవడంతో పాటు ప్రభుత్వాలు వేగంగా నిర్ణయాలు తీసుకునేందుకు వీలవుతుంది.

News September 18, 2024

కాసేపట్లో TN డిప్యూటీ సీఎంగా ఉదయనిధి.. వార్తలపై ఆయనేమన్నారంటే

image

తనను తమిళనాడు DyCMగా నియమిస్తున్నారన్న వార్తలు అవాస్తవాలేనని ఉదయనిధి స్టాలిన్ అన్నారు. ‘మీరిది సీఎంను అడగండి. దీనిపై నిర్ణయం తీసుకొనే పూర్తి హక్కులు ఆయనకే ఉన్నాయి’ అని మీడియాకు చెప్పారు. మరికొన్ని గంటల్లో DyCMగా తనను నియమిస్తున్నారన్న వార్తలపై ఆయన ఇలా స్పందించారు. అమెరికా పర్యటనకు ముందే ఎంకే స్టాలిన్ తన కుమారుడికి ఆ పదవి అప్పగిస్తారంటూ ఊహాగానాలు వచ్చాయి. సీనియర్ల వల్లే ఆలస్యమవుతోందని వినికిడి.

News September 18, 2024

కలెక్షన్లలో ‘స్త్రీ-2’ రికార్డు

image

బాలీవుడ్‌ నటీనటులు రాజ్‌కుమార్‌ రావ్‌, శ్రద్ధా కపూర్‌ ప్రధాన పాత్రల్లో నటించగా దర్శకుడు అమర్‌ కౌశిక్‌ తెరకెక్కించిన హారర్‌ కామెడీ ‘స్త్రీ-2’ రికార్డులు సృష్టిస్తోంది. ఆగస్టు 15న రిలీజైన ఈ సినిమా రూ.586 కోట్లు కలెక్ట్ చేసినట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. షారుఖ్ ఖాన్ ‘జవాన్’ లైఫ్ టైమ్ కలెక్షన్లను క్రాస్ చేయడంతో ‘స్త్రీ-2’ ప్రస్తుతం అత్యధిక కలెక్షన్లు సాధించిన హిందీ చిత్రంగా నిలిచినట్లు తెలిపాయి.

News September 18, 2024

ఏపీలోనూ హైడ్రా ఏర్పాటు చేయాలి: CPI నారాయణ

image

AP: వరద బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయాన్ని పెంచాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కోరారు. వరదలతో నష్టపోయిన విద్యార్థులకు ప్రత్యేక సాయం అందించాలన్నారు. విజయవాడలో సంభవించిన వరదలను కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించేలా ప్రధాని మోదీపై సీఎం చంద్రబాబు ఒత్తిడి తేవాలన్నారు. బుడమేరును ఆధునీకరించాలని డిమాండ్ చేశారు. ఏపీలోనూ హైడ్రా లాంటి వ్యవస్థ ఏర్పాటు చేయాలని సూచించారు.

News September 18, 2024

పాలకులు మారినా విధానాలు కొనసాగుతాయి: సీఎం రేవంత్

image

TG: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఓపెన్ ఎకానమీకి శ్రీకారం చుట్టి గొప్ప ఆర్థిక విధానాలను తీసుకొచ్చారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పాలకులు మారినా విధానాలు అలాగే కొనసాగుతాయని చెప్పారు. 1995-2004 మధ్య చంద్రబాబు ఐటీ విప్లవాన్ని తీసుకొస్తే, వైఎస్ఆర్ దానిని కొనసాగించారన్నారు. పాలసీ డాక్యుమెంట్ లేకుండా రాష్ట్ర అభివృద్ధి సాధ్యం కాదని తెలిపారు. సంస్కరణల వల్లే ఐటీ, ఫార్మా రంగాల్లో నం.1గా ఉన్నామన్నారు.

News September 18, 2024

WOW.. పంచెకట్టులో బాలయ్య

image

నందమూరి బాలకృష్ణ కొత్త లుక్‌లో కనిపించారు. బాబీ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ‘NBK109’ సినిమా షూటింగ్‌ స్పాట్‌కు ‘పైలం పిలగా’ చిత్రయూనిట్ వెళ్లింది. ఈనెల 20వ తేదీన ఈ మూవీ రిలీజ్ కానుండగా ప్రమోషన్స్ కోసం ట్రైలర్‌ను బాలయ్యకు చూపించారు. ఈ సందర్భంగా పంచెకట్టులో హ్యాండ్సమ్‌గా బాలయ్య కనిపించారు. బాలయ్య రోజురోజుకూ యూత్‌గా మారుతున్నారని ఆయన అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.