India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఏపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు. ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తుండటంపై అభినందనలు తెలిపారు. రెండు రాష్ట్రాల విభజన హామీలు, సమస్యలు పరిష్కరించుకుందామని CBNను కోరారు. తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని ఆకాంక్షించారు. కాగా, ప్రమాణస్వీకారానికి చంద్రబాబు పిలిస్తే వెళ్తానని నిన్న రేవంత్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
AP: అమలాపురం మాజీ MP, తొలి దళిత లోక్‌సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి తనయుడు హరీశ్ పార్లమెంట్ గడప తొక్కనున్నారు. అమలాపురం నుంచి ఆయన భారీ మెజార్టీతో నెగ్గారు. తన ప్రత్యర్థి రాపాక వరప్రసాద్(YCP)పై 3,42,196 ఓట్ల మెజార్టీ సాధించి విజయ దుందుభి మోగించారు. గత ఎన్నికల్లో ఆయన TDP తరఫున ఇక్కడి నుంచే పోటీ చేసి ఓడిపోయారు. బాలయోగి మరణానంతరం 2002లో జరిగిన ఉప ఎన్నికలో హరీశ్ తల్లి విజయకుమారి అమలాపురం MPగా గెలిచారు.
NDA కూటమిలో భాగమైన టీడీపీ ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తున్నట్లు NDTV తెలిపింది. దాంతో పాటు స్పీకర్ పదవి, రెండు కేబినెట్ బెర్తులు అడుగుతోందని పేర్కొంది. అటు జేడీయూ రైల్వేతో పాటు వ్యవసాయశాఖను కోరుతోందట. ఇక హోం, ఆర్థిక, రక్షణ, విదేశీ వ్యవహారాల లాంటి కీలక మంత్రిత్వ శాఖలను బీజేపీనే అట్టిపెట్టుకుంటుందని NDTV వివరించింది.
వన్డే WC ఫైనల్లో ఓటమి తర్వాత నాలుగైదు రోజుల పాటు షాక్ నుంచి తేరుకోలేకపోయానని టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ‘ఫైనల్ జరిగిన తర్వాత రోజు నిద్ర లేచా. ఆ రాత్రి మనం ఓడిపోయినట్లు కల వచ్చింది. మరుసటి రోజు ఫైనల్ అనుకొని నిజంగా ఇలాగే జరుగుతుందా అని నా భార్య రితికాను అడిగా. కాసేపటికే తేరుకొని మనం ఓడిపోయామని గ్రహించా’ అని వెల్లడించారు.
NDA కూటమిలో ఉన్న JDU కీలక డిమాండ్‌ను బీజేపీ ముందు ఉంచినట్లు తెలుస్తోంది. అగ్నిపథ్/అగ్నివీర్ స్కీమ్ అమలును పున: సమీక్షించాలని కోరినట్లు సమాచారం. కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ ఓటమికి ఈ నిర్ణయం ఓ కారణమై ఉండొచ్చని అభిప్రాయపడింది. అలాగే ఒకే దేశం ఒకే ఎన్నిక(ONOP), యూనిఫాం సివిల్ కోడ్(UCC)ను సపోర్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఈ సూచనపై కొత్త ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
AP: వైసీపీ నేతలు ఇవాళ సాయంత్రం గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌తో సమావేశం కానున్నారు. కౌంటింగ్ తర్వాత వైసీపీ సానుభూతిపరులు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై ఫిర్యాదు చేయనున్నారు. ప్రభుత్వం ఏర్పాటు కాకముందే TDP ముఠాలు స్వైరవిహారం చేస్తున్నాయని, గవర్నర్ జోక్యం చేసుకోవాలని <<13390762>>జగన్<<>> ఇప్పటికే ట్వీట్ చేశారు.
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్టైన టాలీవుడ్ నటి హేమ ‘మా’ సభ్యత్వం రద్దు చేశారు. ప్రాథమిక సభ్యత్వం తొలగిస్తూ MAA(మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) అధ్యక్షుడు మంచు విష్ణు నిర్ణయం తీసుకున్నారు. రేవ్ పార్టీ కేసులో ఆమెకు ‘మా’ పంపిన నోటీసులపై హేమ స్పందించలేదని సమాచారం. వివరణ ఇచ్చేంతవరకు ఆమెపై సస్పెన్షన్ కొనసాగనుంది.
AP: ఎన్నికల హామీలన్నీ కూటమి ప్రభుత్వం నెరవేర్చాలని ఆశిస్తున్నట్లు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ‘ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నాం. మా ప్రభుత్వం చేసిన సంక్షేమం, అభివృద్ధి కన్నా ప్రజలు ఇంకా ఎక్కువ కావాలని కోరుకున్నట్లుంది. మా విధానం ప్రజలకు నచ్చకపోయి ఉండవచ్చు. రాష్ట్రంలో నిలిచిపోయిన అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించాలి.’ అని ఆయన పేర్కొన్నారు.
ఏపీలో టీచర్ల బదిలీకి బ్రేక్ పడింది. ఎన్నికలకు ముందు బొత్స మంత్రిగా ఉన్నప్పుడు సిఫార్సుల ఒత్తిళ్లతో ఈ బదిలీలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఎలాంటి బదిలీలు చేయవద్దంటూ విద్యాశాఖ కమిషనర్ సురేశ్ అన్ని జిల్లాల DEOలకు ఆదేశాలు జారీ చేశారు.
AP: సీఎస్ జవహర్ రెడ్డి సెలవుపై వెళ్లారు. సాయంత్రంలోగా కొత్త సీఎస్‌ను నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం. వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారని ఆరోపణలు ఎదుర్కొన్న జవహర్ రెడ్డిని పక్కన పెట్టాలని కొత్త ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. సెలవుపై వెళ్లాలని ఆయనకు సంకేతాలు పంపడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్ కూడా సెలవు పెట్టారు.
Sorry, no posts matched your criteria.