India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఫిన్ టెక్ సంస్థ పేటీఎం FY24ను నష్టాలతో ముగించింది. చివరి త్రైమాసికంలో ఏకంగా రూ.550 కోట్ల నష్టం వాటిల్లింది. అంతకుముందు ఏడాది క్యూ4 ఫలితాల్లో ఈ నష్టం రూ.169కోట్లకే పరిమితమైంది. మరోవైపు ఆపరేషన్స్ ద్వారా వచ్చే రెవెన్యూ (రూ.2,267కోట్లు) సైతం అంతకుముందు ఏడాదితో (రూ.2334 కోట్లు) పోలిస్తే 3శాతం తగ్గిపోయింది. యూపీఐ చెల్లింపులు, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై RBI ఆంక్షలు క్యూ4 ఫలితాలపై ప్రభావం చూపించాయి.
ఐఎండీ ప్రకారం ఈరోజు ఉ.8 గంటలకు <<13291673>>అల్పపీడనం<<>> ఏర్పడిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఉత్తర తమిళనాడు-దక్షిణ కోస్తా తీరాలకు ఆనుకుని నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం ఈశాన్య దిశగా కదులుతోందని పేర్కొంది. శుక్రవారం ఉదయానికి ఇది మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇది తుఫానుగా మారే అంశంపై నేటి సాయంత్రానికి స్పష్టత రానుంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తోన్న ‘పుష్ప-2’ నుంచి సెకండ్ సింగిల్‌కి సంబంధించిన అప్డేట్ వచ్చింది. పుష్పరాజ్‌తో శ్రీవల్లి స్టెప్పులేసే సాంగ్ అనౌన్స్‌మెంట్ వీడియోను రేపు 11.07 గంటలకు రిలీజ్ చేయనున్నారు. ఆగస్టు 15న ‘పుష్ప-2’ రిలీజ్ కానుంది. బన్నీ సరసన రష్మిక నటిస్తుండగా.. DSP మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ‘పుష్ప.. పుష్ప’ సాంగ్ యూట్యూబ్‌లో సంచలనం సృష్టించింది.
లోక్‌సభ ఎన్నికల ఆరో దశ పోలింగ్ ఈనెల 25న 57 పార్లమెంట్ నియోజకవర్గాల్లో జరగనుంది. అయితే, బిహార్‌లో ఎన్నికల ప్రచారం, ఓటర్ల నాడి తెలుసుకునేందుకు వెళ్లిన ఓ జర్నలిస్టు తీసిన ఫొటో సోషల్ మీడియాలో వైరలవుతోంది. అక్కడి ప్రజలు యథేచ్ఛగా తుపాకీతో రోడ్లపై తిరుగుతుండటం ఆందోళనకు గురిచేసింది. ప్రజలు ఇలా ఉంటే బిహార్ ఎప్పుడు అభివృద్ధి చెందుతుందని నెటిజన్లు మండిపడుతున్నారు.
TG: జోగిపేటలో విత్తనాల కోసం రైతులు పాస్‌బుక్‌లు క్యూలైన్‌లో పెట్టిన ఘటనపై KTR స్పందించారు. ‘6 దశాబ్దాల కన్నీటి దృశ్యాలు 6 నెలల కాంగ్రెస్ పాలనలో ఆవిష్కృతమయ్యాయి. పదేళ్లుగా కనిపించని కరెంట్ కోతలు, నీరు లేక ఎండిన పంటలు, బోసిన చెరువులు, అప్పులు కట్టాలని రైతులకు నోటీసులు, అన్నదాతల ఆత్మహత్యలు చూస్తున్నాం. కాంగ్రెస్ తప్పులు-రైతుల తిప్పలు ఆగడం లేదు. ఈ పాలనలో ఇలాంటివి ఇంకెన్ని చూడాలో?’ అని ఎద్దేవా చేశారు.
TG: చేపలు పట్టే వృత్తి వివాదంపై 3 నెలల్లోగా కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. బెస్త/గాండ్ల/గంగపుత్ర-ముదిరాజ్/ముత్రాస్/తెనుగోళ్లు సంఘాల మధ్య విభేదాలకు పరిష్కారం చూపాలని స్పష్టం చేసింది. మత్స్యకారుల సహకార సంఘాలు బెస్త/భోయ్/గంగపుత్ర/గాండ్ల వారికి మాత్రమే చెందుతాయని.. ముదిరాజ్/ముత్రాస్/తెనుగోళ్లకు సభ్యత్వం లేదంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది.
ఐపీఎల్‌లో కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అరుదైన ఘనత సాధించారు. ఐపీఎల్ చరిత్రలో రెండు జట్లను ఫైనల్‌కు చేర్చిన తొలి కెప్టెన్‌గా అయ్యర్ చరిత్ర సృష్టించారు. 2020లో ఢిల్లీ క్యాపిటల్స్, 2024లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఆయన ఫైనల్‌కు తీసుకెళ్లారు. టోర్నీ చరిత్రలో మరే కెప్టెన్ రెండు జట్లను ఫైనల్‌కు చేర్చలేదు. కాగా ఈ సీజన్‌లో అయ్యర్ నిలకడగా రాణించారు. ఇప్పటివరకు ఆయన 345 పరుగులు సాధించారు.
సాహసోపేతమైన ఎవరెస్ట్‌ను సునాయాసంగా అధిరోహిస్తున్న ‘ఎవరెస్ట్ మ్యాన్’ కామీ రితా మరో సరికొత్త రికార్డ్ నెలకొల్పారు. ఈనెల 12న ఎవరెస్ట్ ఎక్కిన ఈయన తాజాగా ఈరోజు ఉదయం 7.49 గం.కు మరోసారి ఎవరెస్ట్ చేరుకున్నారు. దీంతో 30సార్లు ఎవరెస్ట్ అధిరోహించిన వ్యక్తిగా నిలిచారు. నేపాల్‌లోని థామేకు చెందిన కామీ (54) సీనియర్ గైడ్‌గా సేవలు అందిస్తున్నారు. కే2, చో ఓయు, లోట్సే, మనాస్లు వంటి పర్వతాలను సైతం ఈయన అధిరోహించారు.
శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనేను టీమ్ ఇండియా హెడ్ కోచ్‌గా నియమించేందుకు BCCI ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయనతో బీసీసీఐ చర్చలు జరిపినట్లు సమాచారం. మరోవైపు గౌతమ్ గంభీర్, స్టీఫెన్ ఫ్లెమింగ్, వీవీఎస్ లక్ష్మణ్, హర్భజన్ సింగ్ కూడా కోచ్ రేసులో ఉన్నారు. కాగా టీ20 WC వరకు రాహుల్ ద్రవిడ్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఆలోగా కొత్త కోచ్‌ను నియమించాలని బీసీసీఐ తీవ్రంగా శ్రమిస్తోంది.
తనకిదే చివరి IPL అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ధోనీ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘క్రికెటర్‌గా కొనసాగాలంటే కఠోర ప్రాక్టీస్, వీలైనంత ఫిట్‌గా ఉండాలి. వయసుకు ఎవరూ మినహాయింపు ఇవ్వరు. నేను ఏడాదంతా క్రికెట్ ఆడట్లేదు. IPLకు వచ్చేసరికి ఫిట్‌గా ఉండాలి. యువ ప్లేయర్లతో తలపడాలి. ప్రొఫెషనల్ ఆట అంత తేలికేం కాదు. ఆడాలంటే ఫిట్‌గా ఉండక తప్పదు. ఆహార అలవాట్లను మార్చుకోవాలి. సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి’ అని తెలిపారు.
Sorry, no posts matched your criteria.