India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: దాదాపు 1,600 మంది మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. 3నెలల ముందస్తు నోటీసు ఇచ్చాకే తొలగించాలని కోర్టు తీర్పు ఉన్నప్పటికీ పట్టించుకోలేదని MPHAలు వాపోతున్నారు. వీరి అర్హతలపై 2002లో న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలయ్యాయి. హైకోర్టు ఉత్తర్వుల మేరకు వీరిని తొలగించాల్సి ఉండగా 2013లో GO1207 కింద తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. ఈ GO చెల్లదని తాజాగా తీర్పు వెలువడింది.

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నేటి నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది. అడిలైడ్‌లో జరిగే ఈ డే అండ్ నైట్ మ్యాచ్‌ను పింక్ బాల్‌తో ఆడతారు. ఉదయం 9.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. స్టార్ స్పోర్ట్స్ ఛానల్, డిస్నీ+హాట్‌స్టార్‌లో లైవ్ చూడవచ్చు. తొలి టెస్టు గెలిచిన జోష్‌లో టీమ్ ఇండియా రెండో టెస్టుకు సిద్ధమైంది. మరోవైపు ఆసీస్ ఈ మ్యాచ్‌లో గెలిచి ఆధిక్యం సమం చేయాలని భావిస్తోంది.

గోల్డెన్ టెంపుల్‌లో తనపై జరిగిన హత్యాయత్నం నుంచి కాపాడిన ASIలు జస్వీర్ సింగ్, హిరా సింగ్‌లకు జీవితాంతం రుణపడి ఉంటానని SAD Ex చీఫ్ సుఖ్‌బీర్ సింగ్ బాదల్ పేర్కొన్నారు. మతపరమైన శిక్ష అనుభవిస్తున్న ఆయనపై బుధవారం ఓ వ్యక్తి కాల్పులకు తెగబడిన విషయం విదితమే. జీవితాన్ని పణంగా పెట్టి ఒకరి ప్రాణాన్ని కాపాడడం అసాధారణ చర్య అన్నారు. ఆ పోలీసులను హత్తుకున్న ఫోటోలను బాదల్ పంచుకున్నారు.

‘హీరామండీ’లో సన్నివేశాలు బాగా పండటం కోసం దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తనను పస్తులుంచారని నటి అదితీ రావు హైదరీ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘కొన్ని సీన్లలో నేను రెచ్చగొట్టే స్పీచ్ ఇవ్వాల్సి ఉంటుంది. వాటికోసం చాలా కష్టపడాల్సి వచ్చేది. దీంతో భన్సాలీ నన్ను రోజంతా ఆకలితో ఉంచేవారు. ఆకలి, కోపంతో ఆ సీన్లు బాగా చేయగలిగాను’ అని పేర్కొన్నారు. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన హీరామండీ మంచి విజయం సాధించింది.

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్లు జస్ప్రీత్ బుమ్రా, శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా వారికి విషెష్ చెబుతున్నారు. కాగా బుమ్రా, జడేజా ప్రస్తుతం ఆస్ట్రేలియా టూర్‌లో ఉన్నారు. ఈ టూర్‌కు అయ్యర్ ఎంపిక కాలేదు. అయ్యర్ ఇటీవల మంచి ఫామ్ కనబరుస్తున్నారు. కాగా టీమ్ ఇండియా మాజీ క్రికెటర్లు కరుణ్ నాయర్, ఆర్పీ సింగ్ బర్త్ డేలు ఇవాళే కావడం విశేషం.

తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి శరవేగంగా భారత క్రికెట్ జట్టులో స్థానం దక్కించుకున్న సంగతి తెలిసిందే. అతడిపై BCCI స్పెషల్ వీడియో రూపొందించింది. అందులో KL రాహుల్‌ను నితీశ్ ప్రత్యేకంగా కొనియాడారు. ‘నాకు సమస్య ఉంటే వెంటనే KL భాయ్‌తో మాట్లాడతాను. ఆయన నుంచి ఎప్పుడూ గుడ్ వైబ్స్ ఉంటాయి. తను ఏ సలహా ఇచ్చినా నాకు వర్కవుట్ అయింది. తొలి టెస్టులో బ్యాటింగ్‌లో ఆయన సూచనలు పనిచేశాయి’ అని వెల్లడించారు.

AP: సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సెటైరికల్ ట్వీట్ చేశారు. చరిత్రలో అత్యంత అపఖ్యాతి పాలైన వెన్నుపోటుదారుల్లో చంద్రబాబు ఒకరని ఎద్దేవా చేశారు. మార్కస్ బ్రూటస్ (జాలియస్ సీజర్), మిర్ జాఫర్ (బెంగాల్), జూడాస్ (జీసస్), రాజా జయ్‌చంద్ (రాజా పృథ్వీరాజ్)ను వెన్నుపోటు పొడిస్తే చంద్రబాబు ఎన్టీఆర్‌ను పొడిచారని ఆయన పేర్కొన్నారు.

తాను మరొకరి ట్యూన్స్ కాపీ చేసేరకం కాదని మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ అన్నారు. అలా చేస్తే ఇతరుల అవకాశాలను మనం లాక్కోడవమే అవుతుందని ఓ ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. ‘ప్రతి ఆర్టిస్ట్ ఎథిక్స్‌తో పని చేయాలి. ఇతరుల అవకాశాలను లాక్కోవడానికి ఎంతకైనా దిగజారుతున్నారు. మనుషుల్లో నైతికత తగ్గిపోతోంది’ అని ఆయన పేర్కొన్నారు. కాగా దేవి మ్యూజిక్ అందించిన ‘పుష్ప 2’ మూవీ నిన్న రిలీజైన సంగతి తెలిసిందే.

ప్రపంచంలోనే అత్యుత్తుమ నగరాల జాబితాను యూరోమానిటర్ సంస్థ తాజాగా విడుదల చేసింది. భారత్ నుంచి కేవలం ఢిల్లీ(74వ స్థానం) మాత్రమే అందులో చోటు దక్కించుకుంది. వరుసగా నాలుగో ఏడాది కూడా అగ్రస్థానాన్ని పారిస్ దక్కించుకుంది. రెండో ప్లేస్‌లో మాడ్రిడ్, మూడో ర్యాంకులో టోక్యో ఉన్నాయి. ఈ ర్యాంకుల్ని నిర్ణయించేందుకు మొత్తం 55 వివిధ అంశాల్ని పరిగణనలోకి తీసుకున్నట్లు యూరోమానిటర్ వివరించింది.

ఉత్తర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రద్దు చేశారు. రాష్ట్ర, జిల్లా, నగర, బ్లాక్ కమిటీలన్నీ రద్దు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. పార్టీని బలపరిచేందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే కొత్త కమిటీలను ప్రకటించే అవకాశం ఉంది.
Sorry, no posts matched your criteria.