India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తమిళనాడులోని రామనాథపురానికి చెందిన E.సంతోశ్ మద్యం మత్తులో ఓ కానిస్టేబుల్ బైక్ దొంగిలించి నేరుగా అల్వార్‌పేటలోని సీఎం స్టాలిన్ ఇంటికి వెళ్లారు. అయితే.. సీఎం నివాసం వద్ద అతడిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీస్ స్టిక్కర్ చూసి ఆరా తీయగా బైక్ దొంగిలించినట్లు తేలడంతో అదుపులోకి తీసుకున్నారు. కాగా.. రాష్ట్ర యువత మద్యం బానిసలు కాకుండా చర్యలు తీసుకోవాలని కోరేందుకే తాను CM ఇంటికి వెళ్లానని సంతోశ్ తెలిపారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫరుఖాబాద్‌లో బీజేపీ అభ్యర్థికి ఓ యువకుడు 8 సార్లు ఓటేసిన <<13277703>>వీడియో<<>> వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు పోలింగ్ బూత్ అధికారులందరినీ సస్పెండ్ చేస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
జూనియర్ ఎన్టీఆర్‌కు జనసేనాని పవన్ కళ్యాణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆస్కార్ అందుకున్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో అంతర్జాతీయంగా మెప్పు పొందారని కొనియాడారు. ఈ మేరకు జనసేన తరఫున ప్రకటన విడుదల చేశారు. తనదైన అభినయం, నృత్యంతో ప్రేక్షకుల అభిమానాన్ని దక్కించుకున్న యంగ్ టైగర్ మరిన్ని విజయాలు అందుకోవాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.
చెన్నైతో మ్యాచ్‌లో RCBని గెలిపించిన యశ్ దయాల్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ క్రమంలోనే గతేడాదిని గుర్తు చేసుకున్న అతడి తండ్రి చంద్రపాల్ భావోద్వేగానికి గురయ్యారు. ‘వేలంలో RCB యశ్‌ను కొనుగోలు చేయడాన్ని చాలా మంది తప్పుబట్టారు. అతడికి ₹5కోట్లు వృథా అన్నారు. ఆ విమర్శలు మమ్మల్ని బాధపెట్టాయి. ఇప్పుడు యశ్ ప్రదర్శన చూసి చాలా మంది ప్రశంసిస్తున్నారు. అభినందనలు తెలుపుతూ అనేక కాల్స్ వస్తున్నాయి’ అని తెలిపారు.
AP: ఎన్నికల రోజు, ఆ తర్వాత రాష్ట్రంలో జరిగిన అల్లర్లపై సిట్ బృందం నివేదిక రూపొందించి.. డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాకు అందజేసింది. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిలాల్లో మొత్తం 33 చోట్ల అల్లర్లు జరిగినట్లు అందులో పేర్కొంది.
1370 మందిపై FIR నమోదు చేయగా.. 124 మందిని అరెస్ట్ చేశామని, 94 మందికి నోటీసులు ఇచ్చినట్లు పేర్కొంది. 150 పేజీలతో కూడిన నివేదికను డీజీపీ.. కాసేపట్లో సీఈవో, సీఈసీకి పంపనున్నారు.
ఏపీలో కులాల వారీగా ఓటర్ల వివరాలు ప్రకటించినట్లుగా వైరల్ అవుతున్న పోస్ట్ ఫేక్ అని సీఈవో ముకేశ్ కుమార్ తెలిపారు. ఆన్‌లైన్‌లో సర్క్యులేట్ అవుతున్న డేటా తప్పని ట్వీట్ చేశారు. ఫ్యాక్ట్ చెక్ ద్వారా నిర్ధారించినట్లు పేర్కొన్నారు. తప్పుడు సమాచారంతో మోసపోవద్దని ప్రజలకు సూచించారు. అబద్ధాలు కాకుండా సత్యాన్ని ప్రచారం చేయాలని కోరారు.
ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక స్టాక్ మార్కెట్లు దూసుకెళ్తాయన్నారు ప్రధాని మోదీ. మార్కెట్లు సరికొత్త రికార్డులు నమోదు చేస్తాయన్నారు. మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే సామాన్యుల సంఖ్య పెరిగితే ఆర్థికవ్యవస్థకు బలం చేకూరుతుందని పేర్కొన్నారు. బీజేపీ భారీ మెజార్టీతో గెలుపొందుతుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ మెజార్టీపై అనుమానాల వల్లే స్టాక్ మార్కెట్లు మందకొడిగా సాగుతున్నాయన్న ప్రచారాన్ని తోసిపుచ్చారు.
ఛత్తీస్‌గఢ్‌లోని కబీర్‌దామ్ జిల్లాలో ఉన్న కవర్ధాలో ప్రయాణికులతో వెళుతున్న వ్యాన్ లోయలో పడింది. ఈ ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఐపీఎల్ సీజన్-17 ఫైనల్ మ్యాచ్ టికెట్లు కాసేపట్లో అందుబాటులోకి రానున్నాయి. సాయంత్రం 6 గంటల నుంచి పేటీఎం ఇన్‌సైడర్‌లో వీటిని విక్రయించనున్నారు. రూపే కార్డ్ ఉన్న వారు మాత్రమే వీటిని కొనుగోలు చేయొచ్చు. టికెట్ కనిష్ఠ ధర రూ.3 వేలుగా ఉంది. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఈ నెల 26న ఫైనల్ జరగనుంది.
గుజరాత్‌లో ఉగ్ర కలకలం రేగింది. అహ్మదాబాద్‌లో నలుగురు ISIS ఉగ్రవాదులను ఏటీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని శ్రీలంకకు చెందినవారిగా గుర్తించారు. దీంతో దేశంలోని పలు ఎయిర్‌పోర్టుల్లో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు.
Sorry, no posts matched your criteria.