India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: 2014-19 మధ్య CM చంద్రబాబు పర్సనల్ సెకట్రరీగా పనిచేసిన పెండ్యాల శ్రీనివాస్‌పై ఉన్న సస్పెన్షన్‌ను ప్రభుత్వం ఎత్తివేసింది. ప్లానింగ్ శాఖలో అసిస్టెంట్ సెక్రటరీగా పోస్టింగ్ ఇచ్చింది. సస్పెన్షన్ కాలాన్ని ఆన్‌డ్యూటీగా పరిగణిస్తూ ఉత్తర్వులిచ్చింది. స్కిల్ స్కామ్ కేసులో పెండ్యాలదే కీలక పాత్ర అని సీఐడీ నోటీసులివ్వడంతో ఆయన అమెరికా వెళ్లిపోయారు. దీంతో వైసీపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
TG: రాష్ట్రంలో సికింద్రాబాద్‌తో పాటు ప్రధాన రైల్వే స్టేషన్లకు వెళ్లే రోడ్ల విస్తరణకు సహకరించాలని CM రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. ఇరుకు రహదారులతో పీక్ అవర్స్‌లో ప్రయాణికులకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చొరవ తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో రైల్వే రంగంతో పాటు ఇతర మౌలిక వసతుల అభివృద్ధిపై కేంద్రం దృష్టి సారించినట్లు పేర్కొన్నారు.
ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ప్రభాస్ నటించిన సలార్ మూవీ బ్లాక్‌బస్టర్ అవడంతో సెకండ్ పార్ట్‌పై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్ర కోసం మోహన్ లాల్‌ను మేకర్స్ సంప్రదించినట్లు తెలుస్తోంది. ఆయన కూడా సానుకూలంగానే ఉన్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, బాబీ సింహా, శ్రుతి హాసన్, శ్రియా రెడ్డి నటిస్తున్న విషయం తెలిసిందే.
కనుమరుగైపోతున్న ‘పిట్టు’ గేమ్‌ను మధ్యప్రదేశ్ విద్యాశాఖ స్పోర్ట్స్ క్యాలెండర్‌లో చేర్చింది. శ్రీకృష్ణ భగవానుడు ఈ ఆట ఆడేవారని, ఇది దేశంలోనే అతి పురాతన ఆటల్లో ఒకటిగా పేర్కొంది. దీంతో ఇక నుంచి అక్కడి యూనివర్సిటీలు, కాలేజీల్లో ఈ పోటీలు నిర్వహించనున్నారు. దీన్ని పల్లి, లగోరీ అని వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు పేర్లతో పిలుస్తారు. ఇంతకీ మీ ఏరియాలో దీన్ని ఏమంటారు?
TG: IITHకు వచ్చే ఏడాది నుంచి స్కిల్ యూనివర్సిటీలోనే భవనం కేటాయిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. IITH ఏర్పాటు చేయాలని కోరగానే రాజకీయాలకు అతీతంగా ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు మంజూరు చేశారని తెలిపారు. నైపుణ్యం గల చేనేత కళాకారులు, నూతన ఆవిష్కరణల కోసం దీనిని ప్రారంభించినట్లు చెప్పారు. మరోవైపు 63 లక్షల మంది స్వయం సహాయక సభ్యులకు ఏటా 2 చీరల చొప్పున ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.
ఛత్తీస్‌గఢ్, విదర్భ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరికి వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉంది. గోదావరి ఉపనది ప్రాణహితకు ఇన్‌ఫ్లో పెరుగుతోంది. అలాగే ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నీరంతా ఒకటి, రెండు రోజుల్లో గోదావరికి చేరనుంది. అటు ఉత్తరాంధ్రలోని వంశధార, నాగావళి నదులకు సైతం ప్రవాహం పెరిగే అవకాశం ఉందని, జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
తమిళ స్టార్ హీరో విజయ్ కొడుకు జేసన్ సంజయ్‌తో టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ సినిమా చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. జేసన్‌కు డైరెక్టర్‌గా ఇది తొలి సినిమా కావడం గమనార్హం. దీనికి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందించనున్నట్లు సమాచారం. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
AP: వరదల్లో ప్రకాశం బ్యారేజ్ వద్దకు బోట్లు కొట్టుకొచ్చిన కేసు నిందితుడు మంత్రి లోకేశ్ సన్నిహితుడేనని YCP ఆరోపించింది. ‘ఈ కేసులో కోమటి రామ్మోహన్, ఉషాద్రిలను CBN ఆదేశాలతో పోలీసులు అరెస్టు చేశారు. రామ్మోహన్ TDP ఎన్నారై విభాగం అధ్యక్షుడు కోమటి జయరాంకు బంధువు. ఉషాద్రికి లోకేశ్‌తో సంబంధాలున్నాయనే దానికి ఈ ఫొటోనే సాక్ష్యం. వరద బాధితుల కోపాన్ని డైవర్ట్ చేయడానికి TDP ప్రయత్నిస్తోంది’ అని ట్వీట్ చేసింది.
AP: ఉత్తరాంధ్రను వణికిస్తోన్న తీవ్ర వాయుగుండం పూరీ సమీపంలో తీరం దాటింది. దీని ప్రభావంతో నిన్నటి నుంచి కోస్తా, ఉత్తరాంధ్రలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మరికొన్ని గంటల పాటు ఈ ప్రభావం ఉండనుంది. వాయుగుండం క్రమేపి బలహీనపడుతుందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది.
ఫిలిప్పీన్స్‌లో అపోలో అనే పాస్టర్ దావోవ్ సిటీలో 75ఎకరాల్లో ది కింగ్‌డమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ పేరిట ఓ సామ్రాజ్యం స్థాపించారు. సెక్స్ రాకెట్, డ్రగ్స్ స్మగ్లింగ్‌తో పాటు వ్యక్తిగత సహాయకులనూ లైంగికంగా వేధించారని అభియోగాలున్నాయి. దీంతో దాదాపు 2వారాల ఆపరేషన్ తర్వాత ఆ సామ్రాజ్యంలోకి ప్రవేశించిన 2,000 మంది పోలీసులు ఓ బంకర్‌లో దాక్కొన్న అపోలోను అరెస్ట్ చేశారు. హెలికాప్టర్లను కూడా వాడారు.
Sorry, no posts matched your criteria.