India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కృత్రిమ మేధలో కోర్సు నేర్చుకునేందుకు నటుడు కమల్ హాసన్ అమెరికా వెళ్లినట్లు డెక్కన్ హెరాల్డ్ ఓ కథనంలో తెలిపింది. గత వారం చివరిలో ఆయన అమెరికా బయలుదేరారని, 45 రోజుల పాటు USలోనే ఉంటారని పేర్కొంది. ఫిల్మ్ మేకింగ్‌లో ఏఐ వినియోగంపై ఆయన ప్రధానంగా దృష్టి పెట్టనున్నారని వివరించింది. ప్రస్తుతం కల్కి 2898 ఏడీ, భారతీయుడు-2 సీక్వెల్స్, మణిరత్నం దర్శకత్వంలో థగ్ లైఫ్ సినిమాల్లో ఆయన నటిస్తున్నారు.
AP: విజయవాడ రూరల్ ఏరియాలో వరద ముంపునకు గురైన 10 గ్రామాలకు నటి నిహారిక రూ.50వేల చొప్పున రూ.5లక్షలు విరాళంగా ప్రకటించారు. ‘నేను నగర వాతావరణంలోనే పుట్టినా, మా పెద్దవారంతా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినవారే. ఆ అనుభవాల దృష్ట్యా గ్రామీణ వాతావరణంపై అభిమానం ఉంది. dy.CM మా బాబాయ్ పవన్ కళ్యాణ్‌తో పాటు కుటుంబీకులు బాధితులకు అండగా నిలబడటం సంతోషం కలిగించింది. నేనూ ఇందులో పాలుపంచుకోవాలనుకుంటున్నా’ అని తెలిపారు.
ఫుడ్ సేఫ్టీ అథారిటీ ధ్రువీకరించిన ప్రసాదాన్ని మాత్రమే గణేశ్ మండపాల వద్ద పంపిణీ చేయాలంటూ కర్ణాటక ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు వివాదానికి తెరలేపాయి. ఆగస్టు 31న జారీ చేసిన ఈ సర్క్యులర్‌లో FSSIA సర్టిఫికెట్ పొందిన వారిని మాత్రమే పబ్లిక్ మండపాలలో ప్రసాదం తయారు చేయడానికి అనుమతిస్తారు. దీన్ని హిందూ వ్యతిరేక చర్యగా BJP ఆరోపించింది. ప్రజల ఆరోగ్యం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం చెబుతోంది.
TG: రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను మహేశ్ కుమార్ గౌడ్‌కు అప్పగిస్తున్నట్లు CM రేవంత్ ప్రకటించారు. 2021 జులై 7న TPCC అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి తనపై పూర్తి విశ్వాసం ఉంచిన కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి ఆయన కృతజ్ఞతలు చెప్పారు. తనకు సహకరించిన పార్టీ నేతలు, కార్యకర్తలకు థాంక్స్ చెప్పారు.
AP: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం వరద సాయంగా రూ.3,300 కోట్లు ఇచ్చిందనేది ప్రచారం మాత్రమేనని CM చంద్రబాబు అన్నారు. సాయంపై తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు. వరద నష్టంపై ప్రాథమిక అంచనా రిపోర్టు రూపొందించి రేపు ఉదయం కేంద్రానికి పంపిస్తామని సీఎం స్పష్టం చేశారు. బాధితులకు సాయం విషయంలో కేంద్రంతో పాటు బ్యాంకర్లతో మాట్లాడుతున్నామన్నారు. బీమా కట్టిన వారందర్నీ త్వరగా ఆదుకోవాలని కోరుతున్నామని తెలిపారు.
AP: వరద ప్రభావిత ప్రాంతాల్లో 72% పారిశుద్ధ్య పనులు పూర్తయ్యాయని CM చంద్రబాబు వెల్లడించారు. మనుషులు వెళ్లలేని చోట్ల డ్రోన్లతో బాధితులకు ఫుడ్ అందించామన్నారు. AI, ఊబరైజేషన్ టెక్నాలజీ ఉపయోగించామని చెప్పారు. వరద బాధిత ప్రాంతాల్లో ఉచిత బస్సులు ఏర్పాటు చేశామన్నారు. అంటువ్యాధులు రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. రాబోయే మూడు రోజుల్లో ప్రభుత్వం నుంచి సరకులు అందించేందుకు ప్రయత్నిస్తున్నామని స్పష్టం చేశారు.
విదేశీ ప్రత్యేక్ష పెట్టుబడుల్లో తెలంగాణ దేశంలోనే నాలుగో స్థానంలో నిలిచింది. DPIIT డేటా ప్రకారం 2024-25 మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) రూ.70,795 కోట్ల పెట్టుబడులతో మహారాష్ట్ర మొదటిస్థానంలో నిలవగా, కర్ణాటక, ఢిల్లీ రెండు మూడు స్థానాల్లో నిలిచాయి. తెలంగాణ రూ.9,023 కోట్ల పెట్టుబడులను ఆకర్షించి నాలుగో స్థానంలో నిలిచింది. గుజరాత్, తమిళనాడు, హరియాణా తరువాతి స్థానాల్లో నిలిచాయి.
రష్యా మాజీ ఒలింపిక్ క్రీడాకారిణి అలీనా కబేవాతో ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇద్దరు బిడ్డల్ని కన్నారని ఫోర్బ్స్ నివేదిక సంచలన కథనాన్ని ప్రచురించింది. మాస్కోలో పుతిన్‌కు చెందిన ఓ భారీ బంగ్లాలో అలీనా, ఆమె బిడ్డలు ఇవాన్, వ్లాదిమిర్ జూనియర్ కట్టుదిట్టమైన భద్రత మధ్య నివసిస్తున్నారని రాసుకొచ్చింది. కాగా పుతిన్‌కు ఓ మాజీ భార్య ఉన్నారు. ఆమెతో ఆయనకు ఇద్దరు ఆడపిల్లలు కలిగారు.
దేశవ్యాప్తంగా 85శాతం జిల్లాల్లో విపరీత వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని ఐపీఈ గ్లోబల్, ఇస్రీ ఇండియా చేసిన సంయుక్త అధ్యయనంలో వెల్లడైంది. సంప్రదాయ వరద ప్రభావిత ప్రాంతాలు కరవుతో, సంప్రదాయ కరవు ప్రాంతాలు వరదలతో అల్లాడుతున్నాయని ఆ నివేదిక తెలిపింది. 1973 నుంచి 2023 మధ్యకాలంలో వాతావరణ పరిస్థితుల వివరాలను అధ్యయనం చేసిన మీదట గత దశాబ్దకాలంలో వాతావరణంలో విపరీత మార్పులు ఐదింతలు పెరిగాయని వెల్లడించింది.
విఘ్నేశ్వరుడిని వివేకం, జ్ఞానం ప్రసాదించే దేవుడిగా భావిస్తారు. వివాహానికి సంబంధించిన పనులు వివేకంతో చేస్తూ విజయం సాధించాలని గణపతిని పూజిస్తారు. వినాయకుడు ఆదిపూజ్యుడు. నవ దంపతులు సంతోషకరమైన జీవితం కోసం ఆయన ఆశీర్వాదం పొందడానికి శుభలేఖపై ఫొటోను ముద్రిస్తూ భక్తిని చాటుకుంటారు. హిందూ ఆచారాల్లో వివాహం పవిత్రమైనది. ఈ బంధాన్ని చివరి వరకు కొనసాగించేందుకు పెళ్లిలో గణేశుడిని పూజించి ఆశీర్వాదం తీసుకుంటారు.
Sorry, no posts matched your criteria.