India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వరదల వల్ల నష్టపోయిన తెలుగు రాష్ట్రాలకు కేంద్రం సహాయం చేస్తుందని కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ తెలిపారు. మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా పలు అంశాలు వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నివేదికలను పరిశీలించి నిబంధనల ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు కేంద్రం సహాయం అందిస్తుందని ఆయన అన్నారు. తెలంగాణ వద్ద NDRF నిధులు రూ.1,345కోట్లు ఉన్నాయని, గత ప్రభుత్వం ఈ నిధులను వాడుకోలేకపోయిందని ఆయన విమర్శించారు.
దులీప్ ట్రోఫీలో ఇండియా-బి, ఇండియా-ఏకు మధ్య జరిగిన మ్యాచ్‌లో ముషీర్ ఖాన్ 181 పరుగులు చేసి తన జట్టును ఆదుకున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో ఈ టోర్నీ చరిత్రలో డెబ్యూలో అత్యధిక స్కోరు చేసిన జాబితాలో సచిన్ టెండూల్కర్‌ను దాటేశారు. బాబా అపరాజిత్(212), యశ్ ధుల్(193) తొలి రెండు స్థానాల్లో ఉండగా సచిన్(159) మూడో స్థానంలో ఉండేవారు. ముషీర్ ఆయన్ను 4వ స్థానానికి నెట్టి థర్డ్ ప్లేస్‌కు చేరుకున్నారు.
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన ‘గోట్’ మూవీ తొలి రోజు కలెక్షన్లు అదరగొట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ.126.32 కోట్ల వసూళ్లు రాబట్టినట్లు మేకర్స్ ఓ పోస్టర్ ద్వారా ప్రకటించారు. వెంకట్ ప్రభు తెరకెక్కించిన ఈ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించారు. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందించారు. ప్రశాంత్, ప్రభుదేవా, స్నేహ కీలకపాత్రలు పోషించారు.
గంజాయి సాగును చట్టబద్ధం చేసేలా హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఈరోజు తీర్మానాన్ని ఆమోదించింది. వైద్య, పారిశ్రామికపరమైన ఉపయోగాల కోసం గంజాయిని సాగు చేయాలని అసెంబ్లీ కమిటీ ప్రతిపాదించిన నేపథ్యంలో ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టింది. రాష్ట్రానికి గంజాయి సాగు చక్కటి రాబడి అవుతుందని కమిటీ నివేదికలో పేర్కొనడం గమనార్హం. కశ్మీర్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్‌లో ఇప్పటికే విజయవంతమైందని అందులో వివరించింది.
AP: వరద బాధితులకు వైసీపీ నేతలు భారీ విరాళం ప్రకటించారు. ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక నెల జీతాన్ని విరాళాన్ని ఇస్తున్నట్లు తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పార్టీ చేపడుతున్న సహాయ కార్యక్రమాలకు ఈ మొత్తాన్ని వినియోగించనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే వైసీపీ చీఫ్ జగన్ రూ.కోటి విరాళాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.
కృత్రిమ మేధలో కోర్సు నేర్చుకునేందుకు నటుడు కమల్ హాసన్ అమెరికా వెళ్లినట్లు డెక్కన్ హెరాల్డ్ ఓ కథనంలో తెలిపింది. గత వారం చివరిలో ఆయన అమెరికా బయలుదేరారని, 45 రోజుల పాటు USలోనే ఉంటారని పేర్కొంది. ఫిల్మ్ మేకింగ్‌లో ఏఐ వినియోగంపై ఆయన ప్రధానంగా దృష్టి పెట్టనున్నారని వివరించింది. ప్రస్తుతం కల్కి 2898 ఏడీ, భారతీయుడు-2 సీక్వెల్స్, మణిరత్నం దర్శకత్వంలో థగ్ లైఫ్ సినిమాల్లో ఆయన నటిస్తున్నారు.
AP: విజయవాడ రూరల్ ఏరియాలో వరద ముంపునకు గురైన 10 గ్రామాలకు నటి నిహారిక రూ.50వేల చొప్పున రూ.5లక్షలు విరాళంగా ప్రకటించారు. ‘నేను నగర వాతావరణంలోనే పుట్టినా, మా పెద్దవారంతా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినవారే. ఆ అనుభవాల దృష్ట్యా గ్రామీణ వాతావరణంపై అభిమానం ఉంది. dy.CM మా బాబాయ్ పవన్ కళ్యాణ్‌తో పాటు కుటుంబీకులు బాధితులకు అండగా నిలబడటం సంతోషం కలిగించింది. నేనూ ఇందులో పాలుపంచుకోవాలనుకుంటున్నా’ అని తెలిపారు.
ఫుడ్ సేఫ్టీ అథారిటీ ధ్రువీకరించిన ప్రసాదాన్ని మాత్రమే గణేశ్ మండపాల వద్ద పంపిణీ చేయాలంటూ కర్ణాటక ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు వివాదానికి తెరలేపాయి. ఆగస్టు 31న జారీ చేసిన ఈ సర్క్యులర్‌లో FSSIA సర్టిఫికెట్ పొందిన వారిని మాత్రమే పబ్లిక్ మండపాలలో ప్రసాదం తయారు చేయడానికి అనుమతిస్తారు. దీన్ని హిందూ వ్యతిరేక చర్యగా BJP ఆరోపించింది. ప్రజల ఆరోగ్యం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం చెబుతోంది.
TG: రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను మహేశ్ కుమార్ గౌడ్‌కు అప్పగిస్తున్నట్లు CM రేవంత్ ప్రకటించారు. 2021 జులై 7న TPCC అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి తనపై పూర్తి విశ్వాసం ఉంచిన కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి ఆయన కృతజ్ఞతలు చెప్పారు. తనకు సహకరించిన పార్టీ నేతలు, కార్యకర్తలకు థాంక్స్ చెప్పారు.
AP: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం వరద సాయంగా రూ.3,300 కోట్లు ఇచ్చిందనేది ప్రచారం మాత్రమేనని CM చంద్రబాబు అన్నారు. సాయంపై తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు. వరద నష్టంపై ప్రాథమిక అంచనా రిపోర్టు రూపొందించి రేపు ఉదయం కేంద్రానికి పంపిస్తామని సీఎం స్పష్టం చేశారు. బాధితులకు సాయం విషయంలో కేంద్రంతో పాటు బ్యాంకర్లతో మాట్లాడుతున్నామన్నారు. బీమా కట్టిన వారందర్నీ త్వరగా ఆదుకోవాలని కోరుతున్నామని తెలిపారు.
Sorry, no posts matched your criteria.