India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నటి పూనమ్ కౌర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. కుట్రలు, మోసాలతో గెలవడం కంటే యోధునిగా ఓడిపోవడం మేలు అని రాసుకొచ్చారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల గురించే ఆమె పోస్టు చేశారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈవీఎంల గురించి చర్చ జరుగుతున్న వేళ పూనమ్ ఇలా స్పందించారని పేర్కొంటున్నారు.
ఎన్నికల ఫలితాల తర్వాత స్టాక్ మార్కెట్లు ఒడుదొడుకులు ఎదుర్కొన్నా ఆ ప్రభావం ప్రభుత్వ రంగ సంస్థల స్టాక్స్‌పై పెద్దగా కనిపించలేదు. జూన్ 4-19 మధ్య 10 ట్రేడింగ్ సెషన్లలో ఈ PSU స్టాక్స్ ₹7,23,823 కోట్ల లాభాన్ని ఆర్జించాయి. దీంతో BSEలోని 56 PSU స్టాక్స్ సంపద ₹68,03,059 కోట్లకు చేరింది. కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వం ఉందని ఇన్వెస్టర్లలో నమ్మకం, NDA పాలసీల కొనసాగింపు ఇందుకు కారణాలని విశ్లేషకులు చెబుతున్నారు.
AP: 15వ ఆర్థిక సంఘం నిధుల మళ్లింపుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను నిలదీశారు. స్థానిక సంస్థలకు నిధులు ఎందుకు ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేశారు. CFMS ఖాతాకు ఎన్ని ఆర్థిక సంఘం, స్థానిక సంస్థల నిధులను మళ్లించారో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. మరోవైపు సీజనల్ వ్యాధుల కట్టడికి కార్యాచరణ రూపొందించాలని పవన్ ఆదేశాలు జారీ చేశారు.
JK, మహారాష్ట్ర, ఝార్ఖండ్, హరియాణా అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు EC కసరత్తు చేస్తోంది. జులై 1 నాటికి 18ఏళ్లు నిండిన వారందరికీ ఓటు హక్కు కల్పిస్తామని తెలిపింది. జులై 25న ముసాయిదా జాబితా వెల్లడి, AUG9 వరకు అభ్యంతరాల స్వీకరణ, 20న తుది జాబితా ప్రకటిస్తామని పేర్కొంది. 2018 తర్వాత JKలో అసెంబ్లీ ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి. హరియాణా, మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీల గడువు NOV 11, 26, JAN 5తో ముగియనుంది.
ట్రైన్ టికెట్ బుక్ చేసేటప్పుడు వచ్చే GNWL/WL విషయంలో కొందరు అయోమయపడుతుంటారు. GNWL అంటే జనరల్ వెయిటింగ్ లిస్టులో ఎంతమంది ఉన్నారో చూపిస్తుంది. ఉదా.GNWL30/WL8 ఉంటే మొత్తం 30 మంది వెయిటింగ్ లిస్టు జాబితాలో టికెట్ బుక్ చేయగా అందులో 22 మంది టికెట్లను క్యాన్సిల్ చేసుకున్నారని అర్థం. అంటే నిజానికి వెయిటింగ్ లిస్టులో ఉన్నది 8 మంది మాత్రమే. సో, ఈసారి టికెట్ బుక్ చేసేటప్పుడు WL చూసి చేసుకోండి.
ఆరున్నరేళ్లుగా రిలేషన్‌లో ఉన్న బాయ్ ఫ్రెండ్ తనకిచ్చిన మాట తప్పాడంటూ ఓ యువతి కోర్టులో కేసు వేసింది. ఈ ఘటన న్యూజిలాండ్‌లో జరిగింది. ఓ ప్రోగ్రామ్ కోసం వెళ్లాల్సిన తనను ఎయిర్‌పోర్టుకు తీసుకెళ్తానని చెప్పి విఫలమయ్యాడని ఆమె తెలిపారు. తనకు వృథా అయిన ఖర్చులను అతను చెల్లించేలా ఆదేశించాలని కోరారు. అయితే మౌఖిక ఒప్పందాలకు చట్టాలను అమలు చేయడం సాధ్యం కాదని న్యాయమూర్తి తీర్పునిచ్చారు.
AP: రాష్ట్ర కాంగ్రెస్‌లోని అన్ని విభాగాల కమిటీలు రద్దు చేసినట్లు పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తెలిపారు. పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగానే కమిటీలు రద్దు చేసినట్లు పేర్కొన్నారు. త్వరలోనే కొత్త కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. కాగా ఇటీవల రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాభవాన్ని చవిచూసింది. ఆ పార్టీ తరఫున ఒక్కరు కూడా చట్టసభలకు ఎన్నిక కాలేదు.
శ్రీవారి లడ్డూ ప్రసాదం నాణ్యత ఎందుకు తగ్గుతోందని EO శ్యామలారావు పోటు సిబ్బందిని ప్రశ్నించారు. సిబ్బంది తక్కువగా ఉండటంతో వర్క్ లోడ్ ఎక్కువవుతోందని అధికారులు ఆయనకు వివరించారు. ముడిపదార్థాల నాణ్యత పెంచాలని కోరారు. తక్కువ ధరకు కోట్ చేసిన గుత్తేదారు సరుకులను సప్లై చేస్తున్నారని EO దృష్టికి తెచ్చారు. బెస్ట్ క్వాలిటీ నెయ్యి, శనగ పిండి ఉపయోగించి నమూనా లడ్డూలు తయారు చేయాలని పోటు సిబ్బందికి EO సూచించారు.
ఒలింపిక్స్ గేమ్స్‌కు తొలిసారి ఆతిథ్యం ఇచ్చే అవకాశం కోసం భారత్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. 2036 కోసం దాఖలు చేసే బిడ్ విజయవంతం కావాలంటే ఏం చేయాలనే అంశాలపై మిషన్ ఒలింపిక్స్ సెల్ క్రీడా మంత్రి మన్‌సుఖ్ మాండవీయకు ఓ రిపోర్టును అందించింది. అలాగే కొత్తగా యోగా, చెస్, T20 క్రికెట్, కబడ్డీ, స్క్వాష్, ఖోఖో క్రీడలను ఒలింపిక్స్‌లో ప్రవేశపెట్టాలని సూచించింది. దీనివల్ల భారత్‌కు పతకాల సంఖ్య పెరుగుతుందని తెలిపింది.
T20WC సూపర్-8లో అఫ్గాన్‌పై ఘన విజయం సాధించిన టీమ్ ఇండియా ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. 10 మంది బ్యాటర్లనూ క్యాచ్ రూపంలోనే ఔట్ చేసింది. షార్ట్ ఫార్మాట్ హిస్టరీలో భారత్ ఇలా చేయడం ఇదే తొలిసారి. రిషభ్ పంత్, రవీంద్ర జడేజా చెరో 3 క్యాచ్‌లు, రోహిత్ శర్మ 2, అర్షదీప్, అక్షర్ పటేల్ చెరో క్యాచ్ పట్టుకున్నారు.
Sorry, no posts matched your criteria.