News June 20, 2024

విరాట్ టెస్టుల్లోకి ఎంట్రీ ఇచ్చింది ఈరోజే

image

టీమ్ఇండియా మోస్ట్ సక్సెస్‌ఫుల్ టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ 2011లో సరిగ్గా ఇదేరోజు ఆ ఫార్మాట్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్లేయర్‌గా, కెప్టెన్‌గా టెస్ట్ క్రికెట్‌కు ఆయన అందించిన సేవలను ఫ్యాన్స్ మరోసారి గుర్తుచేసుకుంటున్నారు. టెస్టుల్లో 113 మ్యాచులు ఆడిన కోహ్లీ.. 191 ఇన్నింగ్స్‌లలో 49.15 యావరేజ్‌తో 8,848 రన్స్ చేశారు. అందులో 29 సెంచరీలు, 30 అర్ధ సెంచరీలున్నాయి. కెప్టెన్‌గా 40 విజయాలు ఆయన ఖాతాలో ఉన్నాయి.

News June 20, 2024

బెంగాల్ రాజ్‌భవన్‌లో నాకు సేఫ్టీ లేదు: గవర్నర్

image

పశ్చిమ బెంగాల్ రాజ్‌భవన్‌లో తనకు రక్షణ లేదని ఆ రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ ఆందోళన వ్యక్తం చేశారు. తన కార్యాలయంలో పూర్తిగా బెంగాల్ పోలీసులే మోహరించి ఉన్నారని పేర్కొన్నారు. ‘ఇప్పుడు ఇన్‌ఛార్జిగా ఉన్న అధికారి, అతడి బృందం నుంచి నాకు ముప్పు పొంచి ఉంది. ఈ విషయాన్ని సీఎం మమతకు కూడా చెప్పాను. అయినా అటునుంచి ఎటువంటి స్పందనా లేదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

News June 20, 2024

ఉపాధి హామీ పథకం సోషల్ ఆడిట్ విభాగంతో DCM పవన్ భేటీ

image

ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పవన్ కళ్యాణ్ రెస్ట్ లేకుండా శాఖలపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. అధికారులపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. నిన్న పంచాయతీరాజ్ అధికారులతో సమీక్షించిన పవన్ నేడు ఉపాధి హామీ పథకంలో సోషల్ ఆడిట్ విభాగంతో భేటీ అయ్యారు. ఉదయం 10 గం. నుంచి అధికారులతో చర్చలు మొదలుపెట్టారు. ఛార్జ్ తీసుకున్న మొదటి రోజు నుంచే పాలనలో తన మార్క్‌ను చూపుతున్నారు.

News June 20, 2024

అభిమానిని చంపి.. భార్య ఫ్లాట్‌లో పూజలు చేసిన దర్శన్!

image

తన అభిమాని రేణుకస్వామిని నటుడు దర్శన్ హత్య చేసిన ఘటన కన్నడ నాట సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కీలక ఆధారాన్ని పోలీసులు సేకరించారు. హత్య సమయంలో దర్శన్ వాడిన లోఫర్స్‌ని అతని భార్య విజయలక్ష్మి ఫ్లాట్‌లో గుర్తించారు. హత్య తర్వాత అక్కడికొచ్చిన దర్శన్ ఇంట్లో పూజలు చేసి మైసూర్ వెళ్లారట. మరికొన్ని దుస్తులు, ఫుట్‌వేర్‌ని కూడా విజయలక్ష్మికి దర్శన్ అసిస్టెంట్ ఇచ్చినట్లు పోలీసులు తేల్చారు.

News June 20, 2024

వేడి కారణంగా ఢిల్లీలో 192మంది నిరాశ్రయుల మృతి

image

ఉత్తరాదిలో నిన్న మొన్నటి వరకు వేడిగాలుల ఉధృతి కొనసాగింది. ఆ కారణంగా ఢిల్లీలో ఈ నెల 11 నుంచి 19 మధ్యలో 192మంది నిరాశ్రయులు మ‌ృతిచెందారని ఎన్జీవో సెంటర్ ఫర్ హోలిస్టిక్ డెవలప్‌మెంట్ సంస్థ తెలిపింది. ఈ కాల పరిమితిలో ఇంతమంది చనిపోవడం ఇదే అత్యధికమని ఓ నివేదికలో వెల్లడించింది. ఢిల్లీలో గడచిన 72 గంటల్లో ఐదుగురు కన్నుమూయడం గమనార్హం. ఇక గత 24 గంటల్లోనే నోయిడాలో 14మంది వేడి కారణంగా చనిపోయారు.

News June 20, 2024

పట్నా హైకోర్టు సంచలన నిర్ణయం

image

బిహార్ ప్రభుత్వం గత ఏడాది అమలులోకి తెచ్చిన 65% రిజర్వేషన్లను పట్నా హైకోర్టు రద్దు చేసింది. బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీల కోసం రిజర్వేషన్లను పెంచుతూ గతంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టింది. సమానత్వం లోపించడమే కాక ఆర్టికల్ 14,15,16లను ఉల్లంఘించే విధంగా ఈ చట్టాలు ఉన్నాయని తెలిపింది. కాగా విద్యాసంస్థల్లో అడ్మిషన్లు, ఉద్యోగాలకు సంబంధించి 2023లో ప్రభుత్వం చట్టాలను సవరించింది.

News June 20, 2024

EVMలను హ్యాక్ చేయడం అసాధ్యం: IIT డైరెక్టర్

image

ఇండియాలో వినియోగిస్తున్న M3 మోడల్ ఈవీఎంలను హ్యాక్ చేయడం, ట్యాంపర్ చేయడం అసాధ్యమని ఐఐటీ గాంధీనగర్ డైరెక్టర్ రజత్ స్పష్టం చేశారు. ‘EVMలకు ఇతర పరికరాలతో కనెక్షన్ ఉండదు. వీటిని ఇంటర్నెట్, బ్లూటూత్ లాంటి వాటితో లింక్ చేయడం సాధ్యం కాదు. తద్వారా ఇతర సాఫ్ట్‌వేర్, ప్రోగ్రామ్స్ లోడ్ చేయలేం. ఎవరైనా ట్యాంపరింగ్ చేస్తే అందులోని ఆటోమేటెడ్ ఫంక్షన్లు దీన్ని వెంటనే ఫ్యాక్టరీ రీసెట్ చేస్తాయి’ అని వివరించారు.

News June 20, 2024

ప్రభాస్.. యూనివర్సల్ డార్లింగ్!

image

ముంబైలో జరిగిన ‘కల్కి’ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ను బిగ్ బీ అమితాబ్ ఆటపట్టించారు. డార్లింగ్ ఇంట్రోవర్ట్ అవడంతో అమితాబ్, కమల్, దీపిక, రానా ఏం అంటున్నా నవ్వుతూ సిగ్గుపడిపోయారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. తమ ఫేవరేట్ హీరో ఇంత ఉల్లాసంగా ఉండటం చూసి చాలా రోజులవుతుందని, బాలీవుడ్ సైతం ఆయన వ్యక్తిత్వానికి ఫిదా అయిందని ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు.

News June 20, 2024

బాధ్యతలు చేపట్టిన మంత్రులు

image

AP: సచివాలయంలో మంత్రులు బాధ్యతలు చేపట్టారు. జలవనరుల శాఖ మంత్రిగా నిమ్మల రామానాయుడు, కార్మికశాఖ మంత్రిగా వాసంశెట్టి సుభాష్, పరిశ్రమల శాఖ మంత్రిగా TG భరత్ తమ ఛాంబర్లలో ప్రత్యేక పూజల అనంతరం బాధ్యతలు చేపట్టారు. కేంద్రం నుంచి నిధులు తెచ్చి పోలవరాన్ని పరుగులు పెట్టిస్తామని నిమ్మల అన్నారు. YCP వల్లే పోలవరం ఆలస్యమైందని దుయ్యబట్టారు. కార్మిక చట్టాలను జగన్ ప్రభుత్వం కాలరాసిందని వాసంశెట్టి ఫైర్ అయ్యారు.

News June 20, 2024

నీట్ పిటిషన్‌‌పై సుప్రీంకోర్టు నోటీసులు

image

నీట్‌కు సంబంధించి వివిధ హైకోర్టుల్లో జరుగుతున్న కేసుల విచారణపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అన్ని కేసులను సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలన్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పిటిషన్ విచారణలో భాగంగా కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. నీట్ కౌన్సెలింగ్‌‌కు అంతరాయం ఉండదని స్పష్టం చేసింది. కాగా గ్రేస్ మార్క్స్‌ పొందిన 1,563 మందికి ఈనెల 23న మరోసారి పరీక్ష నిర్వహించాలని NTA భావిస్తోంది.