India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయంలో భారత్-కెనడా బంధం క్షీణించిన సంగతి తెలిసిందే. అతడు హతమై ఏడాది ముగిసిన సందర్భంగా తాజాగా ట్రూడో సర్కారు దేశ చట్టసభల సాక్షిగా సంతాప కార్యక్రమాన్ని నిర్వహించింది. భారత్ ఉగ్రవాదిగా ప్రకటించిన వ్యక్తికి నివాళులర్పించడమేంటంటూ నెట్టింట భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత్‌ను రెచ్చగొట్టేందుకే కెనడా ఇలాంటివి చేస్తోందని మండిపడుతున్నారు.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ సినీ రచయిత రాహుల్ మోదీతో ప్రేమలో ఉన్నారనే పుకార్ల నడుమ ఆమె షేర్ చేసిన సెల్ఫీ వైరలవుతోంది. ఈ సెల్ఫీతో వీరు తమ మధ్య ఉన్న బంధాన్ని ధ్రువీకరించారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ‘నా హృదయాన్ని మీ వద్దే పెట్టుకోండి, కానీ, నన్ను ప్రశాంతంగా నిద్రపోనివ్వండి’ అని రాహుల్‌ను ట్యాగ్ చేస్తూ ఆమె పోస్ట్ చేయడంతో అభిమానులు సర్‌ప్రైజ్ అయ్యారు.
427లో ఏర్పాటైన పురాతన నలంద యూనివర్సిటీ బౌద్ధం, గణితం, వైద్యం, రాజకీయం, ఖగోళశాస్త్రం, యుద్ధ విద్య రంగాల్లో ప్రసిద్ధి చెందింది. 7వ శతాబ్దంలో నలందలో ఆచార్య ఆర్యభట్ట నేతృత్వంలో గరిష్ఠంగా 10వేల మంది విద్యార్థులు, 2వేల మంది టీచర్లు ఉండేవారు. 1193లో భక్తియార్ ఖిల్జీ సైన్యం ఈ యూనివర్సిటీని ధ్వంసం చేసింది. 90 లక్షలకుపైగా గ్రంథాలున్న లైబ్రరీకి వారు నిప్పుపెట్టగా ఆ మంటలు చల్లారడానికి 3 నెలలు పట్టిందట.
భారత మహిళా వన్డే జట్టులోకి తెలుగు క్రికెటర్ అరుంధతిరెడ్డి(27) అరంగేట్రం చేశారు. సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో ఆమె టీమ్ ఇండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధాన నుంచి క్యాప్ అందుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన అరుంధతి మీడియం పేస్ వేయడంతో పాటు మంచి బ్యాటర్‌గానూ పేరు తెచ్చుకున్నారు. ఆమె ఇప్పటికే టీ20 జాతీయ జట్టులో ఉన్నారు. 26 మ్యాచ్‌ల్లో 18 వికెట్లు, 73 రన్స్ చేశారు.
TG: పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యే లక్ష్యమంటున్న ప్రభుత్వాలు రియాలిటీలో అలా వ్యవహరించడం లేదు. ఫలితంగా రాష్ట్రంలో ‘విద్యాహక్కు చట్టం’ అమలు ప్రశ్నార్థకంగా మారింది. ఈ చట్టం కింద ప్రైవేటు విద్యా సంస్థల్లో 25% సీట్లు పేద విద్యార్థులకు కేటాయించాలి. అలా జరక్కపోవడంపై హైకోర్టు తాజాగా స్పందించింది. చట్టం అమలు తీరుపై వివరాలివ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరి ఈ ప్రభుత్వమైనా అమలు చేస్తుందేమో చూడాలి.
AP: రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ దివంగత రామోజీరావుకు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తాజాగా నివాళులర్పించారు. ఈరోజు ఆర్ఎఫ్‌సీకి చేరుకున్న ఆమె, ఆయన ఫొటోకు అంజలి ఘటించారు. ఆయన కుటుంబీకుల్ని పరామర్శించి సానుభూతిని తెలియజేశారు. గతంలో వైఎస్ కుటుంబం, రామోజీరావు మధ్య పలు విభేదాలుండేవన్న సంగతి తెలిసిందే.
TG: యాపిల్ వాచ్ BJP రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణను గుండెపోటు ప్రమాదం నుంచి తప్పించింది. ఇటీవల ఆయనకు కొంతదూరం నడిస్తే ఆయాసం, ఛాతిలో మంట వస్తున్నా పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఆయన ధరించిన యాపిల్ వాచ్ గుండెకు ఇబ్బంది ఉందని పసిగట్టి అలర్ట్ ఇచ్చింది. ఆయన వైద్యుల్ని సంప్రదించగా హార్ట్‌లో రెండు రక్తనాళాలు మూసుకుపోయినట్లు గుర్తించారు. దీంతో మెరుగైన వైద్యం కోసం రామకృష్ణ HYD వెళ్లారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి’ సెన్సార్ పూర్తయినట్లు తెలుస్తోంది. సినిమాకు U/A సర్టిఫికెట్ లభించగా.. మొత్తం 2.58 గంటలు రన్ టైమ్ ఉండనుంది. మొత్తంగా విజువల్స్ అదిరిపోయాయని, ఎమోషన్స్& ఎంటర్‌టైన్మెంట్‌ను సమపాళ్లలో చూపించారని సెన్సార్ టీమ్ అభిప్రాయపడినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. వారు స్టాండింగ్ ఓవేషన్‌తో టీమ్‌ని మెచ్చుకున్నారని తెలిపాయి. ఈనెల 27న ‘కల్కి’ విడుదల కానుంది.
త్వరలో కొలువుదీరనున్న 16వ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు(9సార్లు) సీనియర్ మోస్ట్ లీడర్‌గా ఉంటారు. ఆయన తర్వాత గోరంట్ల బుచ్చయ్య (7సార్లు), అయ్యన్నపాత్రుడు(7), అచ్చెన్నాయుడు(6), ధూళిపాళ్ల నరేంద్ర కుమార్(6), నంద్యాల వరదరాజులు రెడ్డి(6), ఆనం రామనారాయణ రెడ్డి(6), కన్నా లక్ష్మీనారాయణ(6), కిమిడి కళా వెంకట్రావు(5), గొట్టిపాటి రవి కుమార్ (5), పయ్యావుల కేశవ్(5సార్లు) సీనియర్లుగా ఉన్నారు.
AP: రాష్ట్రంలో శాంతి భద్రతలను పటిష్ఠం చేస్తామని హోం మంత్రి అనిత అన్నారు. దిశ పోలీస్ స్టేషన్ల పేరు మారుస్తామని వెల్లడించారు. వైసీపీ బ్లడ్ ఉన్న పోలీసులు పక్కకు తప్పుకోవాలని.. ప్రజలకు అనుకూలంగా సిబ్బంది పని చేయాలని సూచించారు. సోషల్ మీడియాలో మనోభావాలు దెబ్బతీసేలా పోస్టులు పెట్టేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గత ప్రభుత్వంలో అక్రమ కేసులపై విచారణ జరిపిస్తామని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.