India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: ఫోన్ ట్యాపింగ్‌పై కేటీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ‘ఏం చేసుకుంటారో చేసుకోండని అంటున్నారు. ఎవరైనా కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాప్ చేస్తారా? కొన్ని ఫోన్ కాల్స్ విన్నామని KTR చెప్తున్నారు. వింటే చర్లపల్లిలో చిప్పకూడు తినాల్సి వస్తుంది. BRS చెప్పినట్టు విన్న అధికారుల పరిస్థితి చూస్తూనే ఉన్నాం. ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. తప్పకుండా చర్యలుంటాయి’ అని అన్నారు.
TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అధికారికంగా పోలీసులు ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు చేశారు. టెలిగ్రాఫ్ యాక్ట్‌ని జత చేస్తూ నాంపల్లి కోర్టులో మెమో దాఖలు చేశారు. దేశంలో అతి తక్కువ కేసుల్లోనే ఈ యాక్ట్‌ని ప్రయోగించారు. ఇప్పటి వరకు అధికార దుర్వినియోగం, ప్రభుత్వానికి సంబంధించిన విలువైన సమాచారాన్ని ధ్వంసం చేసిన కేసుల్లోనే నిందితులు ప్రణీత్, తిరుపతన్న, భుజంగరావును విచారించారు.
TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు టెలిగ్రాఫ్ చట్టాన్ని జత చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పర్మిషన్ లేకుండా ఇతరుల వ్యక్తిగత సంభాషణలు వినేందుకు ఫోన్ ట్యాప్ చేస్తే ఈ కేసు నమోదు చేస్తారు. ఇప్పటి వరకూ దేశంలో ఒకట్రెండు కేసులే నమోదయ్యాయి. రాష్ట్ర, కేంద్ర హోం సెక్రటరీ అనుమతి లేకుండా ట్యాప్ చేయడాన్ని తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. ఈ సీరియస్ కేసులో ఇంకా ఎవరెవరి పేర్లు బయటకొస్తాయనేది ఉత్కంఠగా మారింది.
లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్ సీఎం పదవిలో కొనసాగడాన్ని ఛాలెంజ్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. ఆయనను సీఎంగా తొలగించాలంటూ హిందూసేన జాతీయాధ్యక్షుడు విష్ణు గుప్తా ఈ పిల్ వేశారు. త్వరలో దీనిపై విచారణ జరగనుంది. అయితే నిన్న ఈ తరహా పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. కేజ్రీవాల్‌ను సీఎంగా తొలగించలేమంటూ తీర్పిచ్చింది. కాగా ఆయన ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు.
ఆర్థిక సంవత్సరం చివరి రోజు కావడంతో ఈ ఆదివారం బ్యాంకు ఉద్యోగులకు సెలవు లేదు. దీంతో మార్చి 31న దేశవ్యాప్తంగా బ్యాంకులు పని చేయనున్నాయి. ప్రభుత్వ లావాదేవీలు, ఇతరత్రా చెల్లింపులు, ట్యాక్స్ పేయర్స్‌కు ఆటంకం లేకుండా ఆర్బీఐ ఈ మేరకు బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. ఎస్బీఐ సహా 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు, 20 ప్రైవేట్ బ్యాంకులు, విదేశీ బ్యాంకైన డీబీఎస్ బ్యాంక్ ఇండియా కస్టమర్లకు సేవలు అందించనున్నాయి.
AP: అల్లూరి జిల్లా పాడేరులో సీనియర్ నేతలను కాదని కిల్లు వెంకటరమేశ్‌కి టీడీపీ టికెట్ ఇచ్చింది. ఆయన పాడేరు మాజీ సర్పంచ్ వెంకటరత్నం కుమారుడు. టీచర్‌గా రాజీనామా చేసి ఇటీవల TDPలో చేరారు. ఈ సీటు కోసం Ex MLA గిడ్డి ఈశ్వరి, మాజీ మంత్రి మణికుమారి, ZP మాజీ ఛైర్‌పర్సన్ కాంతమ్మ, నాగరాజు ప్రయత్నించారు. కాగా ఇక్కడ చివరిగా 1999లో టీడీపీ గెలిచింది. మరి కొత్త అభ్యర్థి రాకతో ఇక్కడ TDP జెండా ఎగురుతుందేమో చూడాలి.
MLA కడియం శ్రీహరి, MP కే కేశవరావులు BRSని వీడటంపై ఆపార్టీ శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. సోదరులుగా భావించి వీరికి పార్టీలో, ప్రభుత్వంలో KCR సముచిత స్థానాన్ని ఇచ్చారని గుర్తుచేస్తున్నారు. కేకేను రాజ్యసభలో పార్టీ పక్ష నేతగా, శ్రీహరిని డిప్యూటీ CMని చేశారని, KCR కష్టాల్లో ఉంటే ఆయనను వీడటం సరికాదంటున్నారు. ముగ్గురి ఫొటోను షేర్ చేస్తూ.. వారి నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. దీనిపై మీ కామెంట్?
కింది స్థాయి ఉద్యోగులపై దాడులు చేసేందుకే ACBని ఉపయోగించారని జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. ‘రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై 8 లక్షలకుపైగా ఫిర్యాదులు వస్తే ఏం చర్యలు తీసుకున్నారు? మంత్రులు, నేతలపై వచ్చిన ఫిర్యాదులను ఏమాత్రం పట్టించుకోలేదు. కానీ ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదని CM తనకు తానే ప్రకటించుకుంటారు. గత ఐదేళ్లలో అవినీతి జరగలేదని ఏసీబీ అధికారులే ఎలా చెబుతారు’ అని ఆయన విరుచుకుపడ్డారు.
TG: బీఆర్ఎస్ పార్టీలోని చెత్త అంతా పోయిందని ఆ పార్టీ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ‘ప్రస్తుతం పార్టీలో గట్టి వాళ్లే మిగిలారు. పదవులు, వ్యాపారాల కోసం వచ్చినవారే పార్టీ మారారు. నాయకులను కొంటారేమో గానీ.. కార్యకర్తలను మాత్రం కొనలేరు. మోసకారుల లిస్ట్ రాస్తే తొలి పేరు బీబీ పాటిల్‌దే ఉంటుంది. ఎంపీ ఎన్నికల తర్వాత బండ్లు ఓడలు.. ఓడలు బండ్లు అవుతాయి’ అని ఆయన పేర్కొన్నారు.
అమెరికా మహిళల జాతీయ క్రికెట్ జట్టులో హైదరాబాద్‌కు చెందిన ఇమ్మడి సాన్వికి చోటు దక్కింది. యూఏఈలో జరగనున్న ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో ఆమె అమెరికా జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు. 2020లో యూత్ క్రికెట్ అసోసియేషన్ కాలిఫోర్నియా తరఫున ఆమె అరంగేట్రం చేశారు. ఆమె రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్ ఆల్ రౌండర్. సాన్వి కుటుంబం సికింద్రాబాద్‌లోని సీతాఫల్‌మండీకి చెందినది.
Sorry, no posts matched your criteria.