News September 5, 2024

వరద బాధితుల కోసం కేంద్రం కీలక ఆదేశాలు

image

AP, TGల్లో భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన ప్రజలకు పూర్తి సహాయాన్ని అందించాలని ప్రభుత్వ రంగ బీమా కంపెనీలకు కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. బాధితుల క్లెయిమ్ ప్రక్రియను సులభతరం చేయడంతో పాటు వేగంగా సెటిల్‌మెంట్‌లు చేయాలని సూచించింది. ఇందుకోసం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయాలంది. పాలసీదారులు సంప్రదించేందుకు నోడల్ అధికారుల పేర్లు, నంబర్‌లను ప్రచారం చేయాలని బీమా కంపెనీలకు సూచించింది.

News September 5, 2024

క్రెడిట్ కార్డ్ యూజర్లకు అలర్ట్

image

క్రెడిట్ కార్డ్ హోల్డర్స్ త‌మ‌కు న‌చ్చిన కార్డ్ నెట్‌వ‌ర్క్ (మాస్టర్ కార్డ్, రూపే లేదా వీసా)ను ఎంచుకొనే విధంగా శుక్ర‌వారం నుంచి కొత్త నిబంధ‌న‌లు అమ‌ల్లోకి రానున్నాయి. కొత్త కార్డు కోసం దరఖాస్తు లేదా ఉన్న కార్డు రెన్యూవల్ సందర్భంగా యూజర్స్ త‌మకు న‌చ్చిన నెట్‌వ‌ర్క్‌ను ఎంచుకోవ‌చ్చు. కస్టమర్ల ఎంపిక సామ‌ర్థ్యం మెరుగుపరచడం, డిజిటల్ చెల్లింపుల్లో పోటీత‌త్వం లక్ష్యంగా మార్చి 6న ఆర్బీఐ ఈ ఆదేశాలిచ్చింది.

News September 5, 2024

వరద బాధితులకు అండగా రాజమండ్రి ఖైదీలు

image

AP: విజయవాడ వరద బాధితులను ఆదుకోవడానికి రాజమండ్రి సెంట్రల్ జైలు ఖైదీలు పెద్దమనసుతో ముందుకొచ్చారు. 25,000 మందికి సరిపడా టమాటా బాత్ ప్యాకెట్లను సిద్ధం చేసి 2 ప్రత్యేక వాహనాల్లో బెజవాడకు పంపారు. జిల్లా కలెక్టర్ ప్రశాంతి పిలుపుతో జైళ్ల శాఖ డీజీ విశ్వజిత్ ప్రోద్బలంతో మేము సైతం అంటూ ముందుకొచ్చారు. కరోనా సమయంలోనూ లక్ష మాస్కులు కుట్టి ఇచ్చి సెంట్రల్ జైలు ఖైదీలు మానవతా దృక్పథం చూపిన సంగతి తెలిసిందే.

News September 5, 2024

30 రోజుల్లో రూ.9.4 కోట్లు.. మెగా ఫ్యామిలీ ఔదార్యం

image

విపత్తుల విషయంలో మెగా ఫ్యామిలీ ఔదార్యాన్ని చాటుకుంటోంది. గడచిన 30 రోజుల్లో మొత్తం రూ.9.4 కోట్లను విరాళాలిచ్చింది. తెలుగు రాష్ట్రాలకు పవన్ కళ్యాణ్ రూ.6 కోట్లు, చిరంజీవి, రామ్ చరణ్ చెరో కోటి, సాయి దుర్గ తేజ్ రూ.25 లక్షలు, వరుణ్ తేజ్ రూ.15 లక్షలు ఇవ్వగా కేరళ వరదలకు చిరంజీవి, రామ్ చరణ్ కలిసి రూ.కోటి అందించారు. ఇవి కాక మెగాస్టార్ చిరంజీవి విడిగా పలు దాతృత్వ కార్యక్రమాలను చేపడుతున్నారు.

News September 5, 2024

కరకట్టపై CM ఇంటిని పవన్ కూల్చాలి: అంబటి

image

AP: వరదలు వస్తే ఎలా వ్యవహరించాలో CM చంద్రబాబుకు తెలియదని YCP నేత అంబటి రాంబాబు విమర్శించారు. బాబు అసమర్థత వల్లే విజయవాడలో వరదలు సంభవించాయని ఆరోపించారు. ‘కరకట్ట మునిగిపోతుందని తెలిసి కూడా చంద్రబాబు అక్కడే ఉంటున్నారు. మునిగిపోయే ఇంట్లో ఉండటం ఆయన తప్పు. బుడమేరు ఆక్రమించారని dy.CM పవన్ అంటున్నారు. మరి కరకట్టపై CM ఇల్లు ఉంది. ఆ నివాసాన్ని కూల్చివేసి పవన్ శెభాష్ అనిపించుకోవాలి’ అని ఆయన వ్యాఖ్యానించారు.

News September 5, 2024

27,862 ప్రభుత్వ స్కూళ్లకు ఉచిత విద్యుత్

image

TG: ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్ అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. టీచర్స్ డేను పురస్కరించుకుని దీని అమలుకు జీవో ఇచ్చింది. స్కూళ్ల జాబితా తయారు చేయాలని అధికారులను ఆదేశించింది. దాదాపుగా 27,862 స్కూళ్లు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తుండగా, వాటికయ్యే విద్యుత్ ఖర్చును ప్రభుత్వమే చెల్లించనుంది. అటు స్కూళ్లలో శానిటేషన్ వర్కర్స్ ఏర్పాటుకు రూ.136 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది.

News September 5, 2024

వరద బాధితులకు బీఆర్ఎస్ ఎంపీ రూ.కోటి విరాళం

image

TG: వరదల బాధితులకు హెటిరో డ్రగ్స్ అధినేత, బీఆర్ఎస్ ఎంపీ బండి పార్థసారథిరెడ్డి రూ.కోటి విరాళం ప్రకటించారు. ఈ మేరకు చెక్కును ఖమ్మం కలెక్టర్‌కు ఆయన అందజేశారు. దీంతో పాటు రూ.లక్షల విలువ చేసే మందులు వితరణ చేయడంతో పాటు వారం రోజులు సింధు హాస్పిటల్స్ వైద్యులు ఖమ్మంలోనే వైద్యం చేస్తారని చెప్పారు.

News September 5, 2024

BEAUTIFUL: పొలాల్లో దిగిన హెలికాప్టర్‌.. కూలీల ఫొటోలు

image

హెలికాప్టర్ మన ఇంటిపై నుంచి వెళుతుంటే పరుగులు పెట్టి మరీ చూస్తాం. అలాంటిది పొలాల్లో ల్యాండ్ అయితే? నల్గొండ జిల్లాలోని చిట్యాల(M) వనిపాకల వద్ద పొలాల్లో ఓ ఆర్మీ <<14028143>>హెలికాప్టర్<<>> సాంకేతిక సమస్య వల్ల అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. అక్కడే వ్యవసాయ పని చేస్తున్న మహిళా కూలీలు హెలికాప్టర్ వద్దకు చేరి ఫొటోలు తీసుకున్నారు. రోజంతా పడ్డ అలసటను ఆ కొద్ది క్షణాల్లో మర్చిపోయారు. ఫొటోపై మీ కామెంట్ ఏంటి?

News September 5, 2024

వరద బాధితులకు దగ్గుబాటి ఫ్యామిలీ రూ.కోటి సాయం

image

రెండు రాష్ట్రాల్లోని వరద బాధితుల కోసం దగ్గుబాటి ఫ్యామిలీ రూ.కోటి సాయం ప్రకటించింది. ఇరు రాష్ట్రాలకు చెరో రూ.50 లక్షలు అందించింది. మరో వైపు AP, TGలోని అన్ని థియేటర్ల వద్ద విరాళాలు, వస్తువుల సేకరణ కోసం సెంటర్ ఏర్పాటు చేయాలని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయించింది. రెండు రాష్ట్రాలకు తలో రూ.25 లక్షల విరాళం ప్రకటించింది. నిర్మాత దిల్ రాజు AP, TGలకు చెరో రూ.25 లక్షల సాయం ప్రకటించారు.

News September 5, 2024

మార్కెట్ల ప‌త‌నానికి కార‌ణాలు ఇవే!

image

లో ఫ్యూచ‌ర్స్ ప్రైస్‌తో కూడిన హై ఓపెన్ ఇంట్రెస్ట్ వ‌ల్ల‌ భార‌తీ ఎయిర్‌టెల్, 1:1 బోన‌స్ షేర్ల ప్ర‌క‌ట‌న‌ అనంతరం రిల‌య‌న్స్ షేర్లు అమ్మ‌కాల ఒత్తిడికి లోన‌వ్వ‌డంతో దేశీయ స్టాక్ మార్కెట్‌లు గురువారం న‌ష్టాల‌బాటప‌ట్టాయి. సెన్సెక్స్ 151 పాయింట్లు న‌ష్ట‌పోయి 82,201 వ‌ద్ద‌, నిఫ్టీ 53 పాయింట్ల న‌ష్టంతో 25,145 వ‌ద్ద నిలిచాయి. ప్ర‌ధాన దేశాల మార్కెట్ల‌లో నెలకొన్న అస్థిరత మన మార్కెట్ల‌పై ప్రభావం చూపాయి.