India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

‘మతపరమైన భక్తి ఆత్మశుద్ధికి దోహదం చేయవచ్చు. అదే రాజకీయాల్లో భక్తి నియంతృత్వానికి దారి తీస్తుంది. ఆయన నియంత అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు’ అంటూ మోదీని ఖర్గే ఘాటుగా విమర్శించారు. రాజ్యాంగంపై చర్చలో ఖర్గే మాట్లాడుతూ.. 1947-52లో ఎన్నికైన ప్రభుత్వం లేనప్పుడు రాజ్యాంగ సవరణకు నెహ్రూ ప్రయత్నించారంటూ మోదీ తప్పుదోవ పట్టిస్తున్నారని, ఆయనో పెద్ద అబద్ధాల కోరు అని విమర్శించారు.

‘పుష్ప-2’ సినిమాపై డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ప్రశంసల వర్షం కురిపించారు. ‘పుష్పరాజ్‌గా అల్లు అర్జున్ అదరగొట్టారు. ప్రతి డైలాగ్, ఎమోషన్, యాక్టింగ్.. ఆయన ఐకాన్ స్టార్ అని నిరూపించాయి. శ్రీవల్లి క్యారెక్టర్‌కు రష్మిక ప్రాణం పోశారు. పావని కరణం నటన బాగుంది. డీఎస్పీ మ్యూజిక్ అద్భుతం, చిత్రయూనిట్‌కు అభినందనలు. ఐకాన్ పాత్రను రూపొందించినందుకు సుకుమార్ సార్‌కు వందనాలు’ అని ప్రశాంత్ ట్వీట్ చేశారు.

భారత క్రికెటర్ విరాట్ కోహ్లీపై దిగ్గజ క్రికెటర్ అనిల్ కుంబ్లే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కోహ్లీని ఏ ఒక్కరూ ఎందుకు ప్రశ్నించట్లేదో తనకు అర్థం కావడం లేదన్నారు. గత ఐదేళ్లుగా టెస్టుల్లో ఆయన ప్రదర్శన ఆశాజనకంగా లేదని అభిప్రాయపడ్డారు. బ్యాగులు ప్యాక్ చేసుకొని లండన్‌లో సెటిల్ అయ్యేందుకు కోహ్లీకి ఇదే సరైన సమయమని తీవ్రంగా వ్యాఖ్యానించారు.

బంగ్లాకు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. కుదేలైన ఎకానమీని యూనస్ నిలబెట్టడం లేదు. బ్యాంకింగ్ వ్యవస్థ కుప్పకూలేందుకు సిద్ధంగా ఉంది. మరోవైపు కరెంటు లేక పరిశ్రమలు మూతపడుతున్నాయి. తాజాగా మయన్మార్ రెబల్స్ 275KM మేర బంగ్లా సరిహద్దును అధీనంలోకి తీసుకోవడంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అక్కడ వాణిజ్య సేవల్ని నిలిపేసి ఆంక్షలు అమలు చేస్తోంది. బంగ్లాలోని టెక్నాఫ్ సహా కొన్ని ప్రాంతాలను రెబల్స్ ఆక్రమించారని సమాచారం.

AP: తండ్రి మరణం తర్వాత వచ్చే డబ్బు కోసం ఓ మహిళ సొంత అన్నదమ్ములనే చంపిన ఘటన పల్నాడు(D) నకరికల్లులో జరిగింది. ప్రభుత్వ టీచర్ పౌలిరాజు ఇటీవల మరణించాడు. ప్రభుత్వం నుంచి వచ్చే రూ.40లక్షల కోసం కుమారులు గోపీకృష్ణ(కానిస్టేబుల్), రామకృష్ణ(టీచర్), కూతురు కృష్ణవేణి మధ్య గొడవలు జరిగాయి. దీంతో గతనెల 26న తమ్ముడిని, ఈనెల 10న అన్నను చంపిన కృష్ణవేణి వారి మృతదేహాలను కెనాల్‌లో పడేసింది. పోలీసులు అరెస్ట్ చేశారు.

ఏలూరు జిల్లా నూజివీడులో నిన్న జరిగిన గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణలో వైసీపీ నేత జోగి రమేశ్ పాల్గొనడంపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రి పార్థసారధి, ఎమ్మెల్యే గౌతు శిరీష, కొనకళ్ల నారాయణ సహా పలువురు పాల్గొన్న ఈ కార్యక్రమానికి జోగి కూడా హాజరయ్యారు. ఆయన ఎందుకు వచ్చారు? ఎవరు ఆహ్వానించారనే విషయాలపై లోకేశ్ వివరణ కోరారు.

‘పుష్ప’ సినిమాకు నేషనల్ అవార్డు గెలుచుకున్న అల్లు అర్జున్ ‘పుష్ప-2’తో మరోసారి అందుకుంటారని అభిమానులు పోస్టులు పెడుతున్నారు. అయితే, ఈ ఏడాది మరికొందరు నటులూ తమ అద్భుతమైన నటనతో మెప్పించారని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. ‘మహారాజ’లో విజయ్ సేతుపతి, ‘గోట్ లైఫ్’లో పృథ్వీరాజ్, ‘తంగలాన్’లో విక్రమ్‌ల నటన కూడా అద్భుతంగా ఉందంటున్నారు. మరి ఈ ఏడాది నేషనల్ అవార్డు ఎవరికి వస్తుందో కామెంట్ చేయండి.

TG: అసెంబ్లీలో పర్యాటకంపై చర్చ జరుగుతుండగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేతలు ప్లకార్డులు ప్రదర్శించారు. కాంగ్రెస్ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో సభా మర్యాదలు పాటించాలని, సభాపతిని గౌరవించాలని విపక్ష నేతలను స్పీకర్ కోరారు. సభలో ప్లకార్డులు ప్రదర్శించవద్దని సూచించారు. మరోవైపు తమకు మాట్లాడే సమయం ఇవ్వాలని బీఆర్ఎస్ నేతలు కోరారు. నిరసనల నడుమ స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు.

బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్‌కు షాక్ తగిలింది. అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్‌లో అతను బౌలింగ్ చేయకుండా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. తొలుత ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు ఈ ఆల్‌రౌండర్‌పై నిషేధం విధించగా, BCB కూడా తాజాగా ఈ ప్రకటన చేసింది. కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో అతడి బౌలింగ్ యాక్షన్‌పై ఫిర్యాదు అందగా, పరీక్షలో మోచేయి పరిధి 15 డిగ్రీలను మించిన్నట్లు తేలింది.

TG: బీఏసీ సమావేశం నుంచి బీఆర్ఎస్, ఎంఐఎం వాకౌట్ చేశాయి. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహిస్తారో క్లారిటీ లేదని హరీశ్ రావు అన్నారు. ఏ సబ్జెక్ట్ పై మాట్లాడాలో చెప్పలేదని తెలిపారు. సభను కనీసం 15 రోజులు జరపాలని కోరినట్లు పేర్కొన్నారు. ఈ సమావేశానికి సీఎం రేవంత్, డిప్యూటీ భట్టి విక్రమార్క, స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు.
Sorry, no posts matched your criteria.