News December 15, 2024

రికార్డు సృష్టించిన పుష్ప-2 మూవీ

image

అల్లు అర్జున్ పుష్ప-2 మూవీ రికార్డుల పరంపర కొనసాగుతోంది. డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా 10 రోజుల్లోనే హిందీలో రూ.507.50 కోట్లు కలెక్ట్ చేసి, అత్యంత వేగంగా 500Cr క్లబ్‌లోకి అడుగుపెట్టిన మూవీగా నిలిచింది. దీంతో పుష్ప యూనిట్ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. అలాగే రిలీజైన ఆరు రోజుల్లోనే రూ.1000 కోట్లు కలెక్ట్ చేసి, అతి తక్కువ టైంలో ఈ రికార్డు సాధించిన సినిమాగా నిలిచింది.

News December 15, 2024

WPL వేలం: రూ.55 లక్షలు పలికిన ఆంధ్రా ప్లేయర్

image

WPL వేలంలో ఆంధ్ర ప్లేయర్ శ్రీ చరణి పంట పండింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఈమెను రూ.55 లక్షలకు దక్కించుకుంది. జాతీయ స్థాయిలో చరణి ఇండియాC తరఫున ఆడారు. కడపకు చెందిన ఈ 20 ఏళ్ల ప్లేయర్ ఆల్‌రౌండర్ కావడం గమనార్హం.

News December 15, 2024

తాజ్ మహల్‌ను కట్టినవారి చేతులు నరికారు: సీఎం యోగి

image

తాజ్‌మహల్ కట్టినవారి చేతుల్ని అప్పటి పాలకులు నరికితే.. రామమందిర కార్మికుల్ని బీజేపీ సర్కారు గౌరవించుకుందని UP CM యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ‘గుడిని నిర్మించిన కార్మికులపై రామమందిర ప్రారంభం రోజున ప్రధాని పూల వర్షం కురిపించారు. ఒకప్పటి పాలకులు తాజ్ మహల్ నిర్మాణ, వస్త్ర పరిశ్రమ కార్మికులకు చేతులు నరికారు. నైపుణ్యాన్ని అంతం చేశారు. నేడు భారత్ కార్మిక శక్తిని కాపాడుకుంటోంది’ అని పేర్కొన్నారు.

News December 15, 2024

నీతో ఉండే ప్రతీ క్షణం మరింత అందం: వరుణ్ తేజ్

image

ఈరోజు నటి లావణ్య త్రిపాఠి పుట్టినరోజు సందర్భంగా ఆమె భర్త వరుణ్ తేజ్ ట్విటర్ వేదికగా విషెస్ తెలిపారు. ‘హ్యాపీ బర్త్ డే బేబీ. నువ్వు ఎంతో సంతోషాన్ని, ప్రశాంతతను నా జీవితంలోకి తీసుకొచ్చావు. నీతో ఉండే ప్రతి గంట, ప్రతి జ్ఞాపకం మరింత అందంగా మారుతోంది. లవ్ యూ. అన్నట్లు.. నన్ను డ్యాన్స్ చేయించగలిగే ఏకైక వ్యక్తి నువ్వే’ అని పేర్కొన్నారు.

News December 15, 2024

అత్యధికులు పంజాబ్‌, గుజ‌రాత్‌, AP నుంచే..!

image

US నుంచి అనధికార నివాసితులను తిప్పిపంప‌డంపై ట్రంప్ క‌స‌ర‌త్తు ప్రారంభించారు. రాష్ట్రాల‌వారీగా అధికారులు జాబితా సిద్ధం చేస్తున్నారు. అమెరికాలో 14 ల‌క్ష‌ల మంది అనధికార నివాసితులు ఉన్న‌ట్టు అంచ‌నాకొచ్చారు. వీరిలో 17,940 మంది భార‌తీయులు ఉండగా అత్య‌ధికులు పంజాబ్‌, గుజ‌రాత్‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి ఉన్న‌ట్టు తెలుస్తోంది. హ‌క్కులు పొందే న్యాయప్ర‌క్రియ ఆల‌స్యవుతుండ‌డంతో వీరిపై డిపార్టేషన్ కత్తివేలాడుతోంది.

News December 15, 2024

రేవంత్ పాలనలో తిరోగమిస్తున్న తెలంగాణ: కేటీఆర్

image

TG: పదేళ్ల పాటు కేసీఆర్ పాలనలో తెలంగాణ అద్భుతంగా పురోగమించిందని, సీఎం రేవంత్ అవగాహన రాహిత్యంతో ఇప్పుడు అన్ని రంగాల్లో తిరోగమిస్తోందని KTR విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగుంటే వాహనాల అమ్మకాలు, రిజిస్ట్రేషన్లు వృద్ధిలో ఉంటాయని Xలో ఓ <>ఆర్టికల్‌ను<<>> షేర్ చేశారు. పాలన గాలికొదిలేసి కక్ష సాధింపు చర్యలకే సమయం కేటాయిస్తే ఇలాంటి ఫలితాలే వస్తాయని మండిపడ్డారు.

News December 15, 2024

భూమిలేని నిరుపేదలకు రూ.12వేలు: భట్టి

image

TG: భూమిలేని నిరుపేద కుటుంబానికి రూ.12వేలు ఇస్తామని డిప్యూటీ CM భట్టి విక్రమార్క ప్రకటించారు. ‘ఏడాదికి 2 విడతల్లో డబ్బులు జమ చేస్తాం. డిసెంబర్ 28న తొలివిడత అందిస్తాం. రైతు భరోసా డబ్బులనూ సంక్రాంతి సమయంలో రైతులకు అందిస్తాం. రైతులకు రుణమాఫీ చేశాం. ఎకరానికి రూ.10వేలు పంట నష్ట పరిహారం చెల్లించాం. రైతు బీమా కూడా చెల్లిస్తున్నాం. ఇది రైతు ప్రభుత్వం’ అని భట్టి ఖమ్మంలో మీడియాతో చెప్పారు.

News December 15, 2024

WPL: భారీ ధర పలికిన విండీస్ ప్లేయర్

image

మహిళల ప్రీమియర్ లీగ్‌ వేలంలో వెస్టిండీస్ ప్లేయర్ డియాండ్ర డాటిన్ భారీ ధర పలికారు. వేలంలో ఆమెను రూ.1.7 కోట్లకు గుజరాత్ జెయింట్స్ దక్కించుకుంది. T20Iల్లో సెంచరీ చేసిన తొలి మహిళా ప్లేయర్ డాటిన్ కావడం గమనార్హం. దక్షిణాఫ్రికా ప్లేయర్ నాడిన్ డి క్లర్క్‌ను రూ.30 లక్షలకు ముంబై దక్కించుకుంది. పూనమ్ యాదవ్, హీథర్ నైట్, స్నేహ్ రాణా తదితర ప్లేయర్లు అన్‌సోల్డ్‌గా మిగిలారు.

News December 15, 2024

సాయంత్రం మ‌హారాష్ట్ర మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌

image

మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణ కొలిక్కి వ‌చ్చింది. BJP, శివ‌సేన‌, NCPల మ‌ధ్య 39 శాఖ‌ల‌పై ఏకాభిప్రాయం కుదిరింది. సాయంత్రం నాగ్‌పూర్‌లో మంత్రి వర్గ విస్తరణ జరగనుంది. NCPకి ఆర్థిక శాఖ‌, కోఆప‌రేటివ్‌, క్రీడా శాఖ‌లు, శివ‌సేన‌కు ప‌ట్ట‌ణాభివృద్ధి, ఆరోగ్య‌, ప‌ర్యాట‌క శాఖ‌లు ద‌క్క‌నున్న‌ట్టు స‌మాచారం. హోం, రెవెన్యూ BJP అట్టిపెట్టుకోనుంది. BJPకి దక్కిన 20 పదవుల్లో ఈ రోజు కొందరే ప్రమాణస్వీకారం చేయనున్నారు.

News December 15, 2024

ఎన్నికలకు ఆప్ రెడీ.. అభ్యర్థుల ప్రకటన పూర్తి

image

Febలో జ‌రిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఆప్ పూర్తి స్థాయిలో సిద్ధ‌మైంది. 38 మందితో కూడిన అభ్యర్థుల నాలుగో జాబితాను ఆదివారం ప్రకటించింది. ఈ సారి కూడా న్యూఢిల్లీ నుంచి కేజ్రీవాల్, కాల్కాజీ నుంచి సీఎం ఆతిశీ పోటీ చేయ‌నున్నారు. మొత్తం 70 మంది అభ్య‌ర్థుల్లో 20 మంది సిట్టింగ్‌ల‌కు టికెట్లు నిరాక‌రించింది. పలువురికి స్థానచలనం కల్పించింది. కేజ్రీవాల్‌పై షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ పోటీ చేయనున్నారు.