India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

అల్లు అర్జున్ అరెస్టు దేశవ్యాప్త చర్చకు దారితీస్తోంది. ప్రాంతీయ మాధ్యమాలతోపాటు హిందీ, ఆంగ్ల ప్రసారమాధ్యమాల్లో ఈ అంశంపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. అసలేం జరిగింది? పోలీసులు పెట్టిన కేసులేంటి? ఏ సెక్షన్ కింద ఎంత వరకు శిక్షపడే అవకాశం ఉంది? అసలు కేసు నిలుస్తుందా? అనే మెరిట్స్‌పై నిపుణులతో చర్చిస్తున్నారు. పుష్ప అరెస్టు నేషనల్ ఇష్యూ అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనతో తనకు సంబంధం లేదని పోలీసులకు అల్లు అర్జున్ వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. సినిమా రిలీజ్ సమయంలో థియేటర్లకు రావడం సహజమేనని, గతంలో కూడా ఇలా వచ్చినట్లు తెలిపినట్లు తెలుస్తోంది. ఇలాంటి ఘటన జరుగుతుందని ఊహించలేదని, తాను రావడం వల్లే ఘటన జరిగిందనేది అవాస్తవమని చెప్పినట్లు సమాచారం.

TG: తన అరెస్టును సవాల్ చేస్తూ అల్లు అర్జున్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. పోలీసుల నుంచి పూర్తి వివరాలు సేకరించి సాయంత్రం 4 గంటలకు చెబుతానని ప్రభుత్వ తరఫు లాయర్ కోర్టుకు తెలిపారు. దీంతో సాయంత్రం 4 గంటలకు దీనిపై విచారణ చేస్తామని న్యాయస్థానం తెలిపింది. అటు కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.

‘పుష్ప-2’ సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయడం ప్రకంపనలు సృష్టించింది. సక్సెస్ మీట్ కోసం నిన్న ఢిల్లీకి వెళ్లొచ్చిన అర్జున్‌ను ఉదయమే అరెస్ట్ చేయడంతో సోషల్ మీడియా షేక్ అవుతోంది. దీంతో #AlluArjunArrest హ్యాష్‌ట్యాగ్ ట్విటర్‌లో దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది. నార్త్ ఇండియన్ అభిమానులు సైతం ఆయనకు సపోర్ట్‌గా ట్వీట్స్ చేస్తున్నారు.

హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసినట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. గాంధీ ఆస్పత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం నాంపల్లి క్రిమినల్ కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు. అటు గాంధీ ఆస్పత్రికి బన్నీని తరలించేందుకు వాహనాలను పోలీసులు సిద్ధం చేస్తున్నారు.

అల్లు అర్జున్‌పై సోమవారం వరకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వాలని ఆయన తరఫు లాయర్ <<14867578>>కోరడంపై<<>> హైకోర్టు జడ్జి కీలక వ్యాఖ్యలు చేశారు. పోలీసుల అభిప్రాయం తెలుసుకొని మ.2.30 గంటలకు చెబుతామని వెల్లడించారు. అయితే ఇప్పటికే అల్లు అర్జున్ వేసిన క్వాష్ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని లాయర్ కోరగా హైకోర్టు తిరస్కరించింది. ఉ.10.30 గంటలలోపే పిటిషన్ జత చేయాల్సిందని చెప్పింది.

మరికొద్దిసేపట్లో అల్లు అర్జున్‌ను వైద్యపరీక్షల కోసం పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించనున్నారు. అనంతరం అక్కడి నుంచి నాంపల్లి కోర్టుకు తీసుకెళ్తారు. ఈమేరకు రూట్ క్లియర్ చేస్తున్నారు.

వ్యక్తి మృతికి కారకులపై BNS (105) సెక్షన్ నమోదు చేస్తారు. దీంతో 5సం.-10సం. శిక్ష పడుతుంది. BNS 118(1) సెక్షన్: ప్రమాదకర ఆయుధాలు, విషం, పేలుడు పదార్థాలతో తీవ్రగాయం చేసేందుకు యత్నించిన వారిపై నమోదు చేస్తారు. దీంతో మూడేళ్ల వరకు జైలు శిక్ష, రూ.20వేల జరిమానా పడొచ్చు. ఇక BNS section 3(5) ప్రకారం ఒక నేరాన్ని పలువురు వ్యక్తులు ఒకే ఉద్దేశంతో చేస్తే, అందులోని అందర్నీ సమానమైన శిక్షార్హులుగా పరిగణిస్తారు.

చిక్కడపల్లి పీఎస్‌కు కాసేపట్లో చిరంజీవి చేరుకోనున్నారు. ఓ సినిమా షూటింగ్‌లో ఉన్న ఆయన దాన్ని రద్దు చేసుకున్నారు. పీఎస్‌లో ఉన్న అల్లు అర్జున్‌తో మాట్లాడనున్నారు. కాగా ఇప్పటికే అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పీఎస్‌కు తరలించిన పోలీసులు ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసుకున్నారు. మరోవైపు ఆయనను రిమాండ్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాసేపట్లో ఆయనను గాంధీ ఆసుపత్రికి తరలించనున్నారు.

AP: స్వర్ణాంధ్ర@2047 విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించడం చరిత్రాత్మకమని సీఎం చంద్రబాబు అన్నారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే దీనిని రూపొందించామని చెప్పారు. ‘తెలుగు జాతి ప్రపంచంలోనే నంబర్‌వన్‌గా ఉండాలి. అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలవాలి. గత ప్రభుత్వంలో ఊహించని విధ్వంసం జరిగింది. ఇప్పుడు దానిని సరిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Sorry, no posts matched your criteria.