India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 126148 ఓట్ల లీడింగ్‌లో ఉన్నారు. వైసీపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి వెనుకంజలో కొనసాగుతున్నారు. అలాగే ఒంగోలు టీడీపీ ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి 15 వేలకుపైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
కర్ణాటకలో బెంగళూరు రూరల్ కాంగ్రెస్ అభ్యర్థి, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేశ్ ఓటమిపాలయ్యారు. ఆయనపై బీజేపీ అభ్యర్థి డా.సి.మంజునాథ్ 2,39,744 ఓట్ల తేడాతో గెలుపొందారు. మరోవైపు పంజాబ్‌లోని జలంధర్ స్థానం నుంచి పంజాబ్ మాజీ సీఎం, కాంగ్రెస్ అభ్యర్థి చరన్‌జిత్ సింగ్ గెలిచారు. బీజేపీ అభ్యర్థి సుశీల్ కుమార్ రింకూపై 1.75లక్షల ఓట్ల తేడాతో విజయం సాధించారు.
AP: వైసీపీ కీలక నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి వెనుకంజలో ఉన్నారు. గత ఎన్నికల్లో చంద్రగిరి నుంచి గెలిచిన భాస్కర్ రెడ్డి ఈసారి ఒంగోలు ఎంపీగా బరిలో నిలిచారు. అక్కడ టీడీపీ అభ్యర్థి మాగంటి శ్రీనివాసులు రెడ్డి 13,979 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇటు చంద్రగిరి స్థానంలో ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఆయన ప్రత్యర్థి పులివర్తి నాని కంటే 10,579 ఓట్ల వెనుకంజలో ఉన్నారు.
AP: అన్న వైఎస్ జగన్‌తో విభేదించి కాంగ్రెస్‌లో చేరిన షర్మిల కడపలో భారీగా వైసీపీ ఓట్లను చీల్చారు. ఏకంగా 1,09,620 ఓట్లు సాధించారు. అవినాశ్ రెడ్డి(YCP) 4,53,483 ఓట్లు, టీడీపీ అభ్యర్థి భూపేశ్ రెడ్డి 3,93,215 ఓట్లు సాధించి ఒకటి, రెండు స్థానాల్లో ఉన్నారు. ప్రస్తుతం అవినాశ్ 60,268 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అలాగే పులివెందులలోనూ సీఎం జగన్ మెజార్టీని భారీగా తగ్గించారు.
కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిచింది. ఆ పార్టీ అభ్యర్థి శ్రీగణేశ్ విజయం సాధించారు. సమీప బీఆర్ఎస్ అభ్యర్థి నివేదితపై ఆయన గెలుపొందారు. ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న లాస్య నందిత మృతితో ఇక్కడ ఉప ఎన్నిక జరిగింది. ఈ స్థానంలో బీజేపీ నుంచి ఇక్కడ వంశ తిలక్ పోటీ చేశారు.
బీజేపీకి కొన్ని నినాదాలు కలిసిరావడం లేదు. 2004లో వాజ్‌పేయీ ‘ఇండియా షైనింగ్’తో బరిలోకి దిగారు. సరిగ్గా 20 ఏళ్లకు నరేంద్రమోదీ ‘అబ్కీ బార్ 400 పార్’తో రంగంలోకి దూకారు. అప్పట్లో కాంగ్రెస్ సౌజన్యంతో యూపీఏ వన్ విజయదుందుభి మోగించింది. 2024లో మాత్రం ఇండియా కూటమి గట్టి పోటీనిచ్చింది. అనూహ్యంగా పుంజుకొని బీజేపీని సొంతంగా మ్యాజిక్ ఫిగర్ దాటనివ్వలేదు. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం NDA హ్యాట్రిక్‌కు ఢోకా లేదు.
ధర్మవరంలో ఫలితం తారుమారైంది. కౌంటింగ్ ఆరంభం నుంచి వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి లీడ్ కనబర్చడంతో YCP శ్రేణులు ఆయన గెలుపు పక్కా అనుకున్నారు. కానీ బత్తులపల్లి నుంచి ధర్మవరం టౌన్ వరకు గల బూత్‌ల ఓట్ల లెక్కింపుతో ఇది రివర్స్ అయింది. 19వ రౌండ్ ముగిసేసరికి BJP అభ్యర్థి సత్యకుమార్ 3300 ఓట్లకు పైగా మెజార్టీలో ఉన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు బీజేపీ కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. ఆయన్ను ఎన్డీఏ కన్వీనర్‌గా నియమించనున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కేంద్రంలో ఆ పార్టీకి సీట్లు తగ్గడంతో చంద్రబాబు మద్దతు కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో బీజేపీ పెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని ప్రధాని మోదీ, అమిత్ షా చంద్రబాబుకు ఫోన్లో చెప్పినట్లు తెలుస్తోంది.
AP: YSR జిల్లా కమలాపురంలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. సీఎం జగన్ మేనమామ, వైసీపీ అభ్యర్థి రవీంద్రనాథ్ రెడ్డిపై టీడీపీ అభ్యర్థి పుట్టా చైతన్య రెడ్డి విజయం సాధించారు. అటు మైదుకూరులోనూ వైసీపీ అభ్యర్థి రఘురాం రెడ్డిపై టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ 20,937 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
లైంగిక వేధింపుల కేసు నిందితుడు జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఓటమి దిశగా సాగుతున్నారు. కర్ణాటకలోని హసన్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయనపై ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి శ్రేయస్ పటేల్ 43వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కౌంటింగ్ ప్రారంభమైన తర్వాత ఆయన లీడింగ్‌లో కొనసాగగా ఇప్పుడు రెండోస్థానానికి పడిపోయారు.
Sorry, no posts matched your criteria.