India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తెలంగాణ మాజీ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ చెన్నై సౌత్ నుంచి ఎంపీగా పోటీచేస్తోన్న విషయం తెలిసిందే. అయితే, ఈ ఎన్నికల్లోనూ ఆమె ఓటమి దిశగా సాగుతున్నట్లు తెలుస్తోంది. డీఎంకే అభ్యర్థి సుమతి 6148 ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉన్నారు. ఎంపీగా గెలుస్తాననే ధీమాతో ఆమె గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. కాగా 2019లో డీఎంకే అభ్యర్థి తమిజాచి తంగపాండియన్ 2.62 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
AP: ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మొత్తం 34 నియోజకవర్గాల్లో ఒక్క చోట మినహా మిగతా అన్ని స్థానాల్లో కూటమి దూసుకెళ్తోంది. తూ.గోలోని 19 స్థానాల్లో TDP ముందంజలో ఉంది. ప.గోలో 15 స్థానాలకు గాను 14 స్థానాల్లో TDP లీడింగ్‌లో ఉంది. పోలవరంలో YCP అభ్యర్థి రాజ్యలక్ష్మి కేవలం 62 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఈ జిల్లాల్లో మెజార్టీ సీట్లు గెలిచిన పార్టీయే ప్రభుత్వం ఏర్పాటు చేసే సంప్రదాయం ఉంది.
AP: కనిగిరిలో టీడీపీ-వైసీపీ మధ్య ఆధిక్యం దోబూచులాడుతోంది. ఓ రౌండ్‌లో టీడీపీకి.. మరో రౌండ్‌లో వైసీపీకి లీడ్ వస్తోంది. ప్రస్తుతం వైసీపీ అభ్యర్థి దద్దాల నారాయణ 590 ఓట్ల స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్నారు. యర్రగొండపాలెంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇక్కడ కూడా ఆధిక్యం మారుతూ వస్తోంది. ఇక్కడ వైసీపీ అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ 441 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
AP: కోవూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి భారీ ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. ఆమె 15 వేలకుపైగా ఓట్ల లీడింగ్‌లో ఉన్నారు. వైసీపీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వెనుకంజలో ఉన్నారు. ఇక ఆత్మకూరు, వెంకటగిరిలో తప్ప జిల్లాలోని అన్ని స్థానాల్లో టీడీపీనే ఆధిక్యంలో కొనసాగుతోంది.
‘విశాఖనే పరిపాలనా రాజధాని చేస్తాం.. పాలన ఇక్కడి నుంచే చేస్తా.. జూన్-9న రెండోసారి CMగా ప్రమాణస్వీకారం ఇక్కడే చేస్తా’ అని CM జగన్ చెప్పిన మాటలను విశాఖ ప్రజలు పట్టించుకోలేదు. 2019 ఎన్నికల్లో ఉమ్మడి విశాఖలో 15 స్థానాలకు 11 స్థానాల్లో గెలిచిన YCP.. ఈసారి 2స్థానాల్లో(అరకు, పాడేరు)నే ఆధిక్యంలో ఉంది. విశాఖను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతామన్న YCP హామీని ప్రజలు విశ్వసించలేదని తాజా ఫలితాలు చెబుతున్నాయి.
మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రతి రౌండ్ రౌండ్‌కు ఆధిక్యం చేతులు మారుతోంది. ప్రస్తుతం బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు ఆధిక్యంలోకి వచ్చారు. అంతకుముందు బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి ఆధిక్యంలో కొనసాగారు. తొలి రెండు రౌండ్లు కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ఆధిక్యంలోకి వచ్చి వెనుకంజ వేశారు.
ఎన్నికల ఫలితాల రోజున స్టాక్‌మార్కెట్లు కుప్పకూలాయి. సూచీల ఘోర పతనంతో ఇన్వెస్టర్లు భారీగా నష్టపోయారు. నేడు ఒక్కరోజే ఏకంగా రూ.21 లక్షల కోట్ల సంపద కోల్పోయారు. దాంతో బీఎస్ఈ మార్కెట్ విలువ రూ.404.42 లక్షల కోట్లకు తగ్గింది. ఇక పదేళ్ల బాండ్ ఈల్డు 10 బేసిస్ పాయింట్ల మేర పెరిగి 7.04 శాతానికి చేరింది. ప్రస్తుతం ఇన్వెస్టర్లు ఏం చేయాలో తెలియక దిగాలు పడుతున్నారు.
● టీడీపీ ముందుగానే సూపర్-6 పథకాలను ప్రకటించడం
● జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో పొత్తు
● ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ప్రచారం
● చంద్రబాబు అరెస్టుతో కార్యకర్తల్లో కసి పెరగడం
● ఏపీని రాజధానిలేని రాష్ట్రంగా వైసీపీ మార్చిందంటూ ప్రజల్లోకి తీసుకెళ్లడం
● అభివృద్ధి లేదని పదేపదే చెప్పడం
● సీఎం జగన్ చేసిన ఎమ్మెల్యేల బదిలీలు
● చంద్రబాబు వ్యూహాత్మక నిర్ణయాలు
నార్త్ ఇండియాలో ఓటర్లు NDAకు షాక్ ఇస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో BJP కూటమికి ఊహించిన స్థాయిలో సీట్లు వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఓటర్లు ఇండియా కూటమి వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. మరోవైపు సౌత్ ఇండియాలో (ముఖ్యంగా AP, TGలో) NDAకు ఊహించిన దానికంటే ఎక్కువ స్థానాలు వచ్చేలా కనిపిస్తున్నాయి. దీంతో నార్త్‌లో NDA ఓట్లు ఇండియా కూటమికి, సౌత్‌లో ఇండియా కూటమి ఓట్లు NDAకు మారినట్లు తెలుస్తోంది.
ఉండిలో టీడీపీ అభ్యర్థి కనుమూరు రఘురామ కృష్ణ రాజు భారీ మెజార్టీతో దూసుకెళ్తున్నారు. ఇప్పటివరకు RRRకు మొత్తం 50 వేలకు పైగా ఓట్లు రాగా వైసీపీ క్యాండిడేట్ వెంకట నరసింహ రాజుకు 25వేల ఓట్లు వచ్చాయి. దీంతో రఘురామ 25వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. 2019లో వైసీపీ నుంచి నరసాపురం ఎంపీగా గెలిచిన రాజు ఆ తర్వాత జగన్‌తో విబేధాలు, పార్టీ వైఖరి నచ్చక బయటకు రావడం తెలిసిందే.
Sorry, no posts matched your criteria.