India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఈశాన్య రాష్ట్రాల్లో కాంగ్రెస్-బీజేపీ మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. మణిపుర్‌లో కాంగ్రెస్, NPF ఒక్కో స్థానంలో, మేఘాలయాలో కాంగ్రెస్, ఇతరులు చెరో స్థానంలో ఆధిక్యంలో ఉన్నారు. సిక్కింలో ఇతరులు, మిజోరంలో కాంగ్రెస్, అరుణాచల్ ప్రదేశ్‌లో బీజేపీ, కాంగ్రెస్ చెరో స్థానంలో, నాగాలాండ్‌లో కాంగ్రెస్, త్రిపురలో బీజేపీ ముందంజలో ఉన్నాయి.
దేశంలో ఎన్డీఏ మేజిక్ ఫిగర్ దాటింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ 290 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అయితే బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై మాత్రం కోయంబత్తూరులో వెనుకంజలో ఉన్నారు. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై కూడా చెన్నై వెస్ట్‌లో వెనుకంజలో కొనసాగుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి 222 సీట్లలో లీడింగ్‌లో కొనసాగుతోంది.
BJP(7): NZB(అర్వింద్), చేవెళ్ల(విశ్వేశ్వర్‌రెడ్డి), కరీంనగర్(బండి సంజయ్), MBNR(DK అరుణ), SECBAD(కిషన్‌రెడ్డి), ఆదిలాబాద్(గోదం నగేశ్), మల్కాజిగిరి(ఈటల). INC(8): జహీరాబాద్(షెట్కార్), MHBD(బలరాం నాయక్), WGL(కావ్య), KHM(రఘురామిరెడ్డి), నా.కర్నూల్(మల్లు రవి),
పెద్దపల్లి(G.వంశీకృష్ణ), NLG(రఘువీర్‌రెడ్డి), భువనగిరి(CH.కిరణ్). BRS(1): మెదక్(వెంకట్రామిరెడ్డి), MIM(1): HYD(ఒవైసీ)
ఒడిశా, బిహార్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ ఆధిక్యంలో దూసుకుపోతుంది. ఒడిశాలో 14 స్థానాల్లో బీజేపీ, 5 స్థానాల్లో బీజేడీ, ఒక స్థానంలో కాంగ్రెస్ అధిక్యంలో కొనసాగుతోంది. మరోవైపు బిహార్‌లో ఎన్డీఏ కూటమి మెజార్టీలో కొనసాగుతోంది. ఝార్ఖండ్‌లోనూ 8 స్థానాల్లో NDA కూటమి ముందంజలో ఉంది.
ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ దేశ వ్యాప్తంగా ఎర్లీ ట్రెండ్స్‌లో ఎన్డీయే – ఇండియా కూటముల మధ్య హోరాహోరి పోరు జరుగుతోంది. ఎన్డీయే 285 స్థానాల్లో, ఇండియా కూటమి 221 స్థానాల్లో తమ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఎవరూ ఊహించని రీతిలో ఎర్లీ ట్రెండ్స్ ఉండడంతో ఆసక్తి నెలకొంది. యూపీలో ఎన్డీయే 37 స్థానాల్లో, ఇండియా కూటమి 39 స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నాయి.
AP: గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వైసీపీ అభ్యర్థి కిలారి రోశయ్యపై దాదాపు 40000+ పైగా మెజార్టీతో పెమ్మసాని ఆధిక్యంలో ఉన్నారు. కౌంటింగ్ ముగిసే సరికి పెమ్మసాని మెజార్టీ లక్షల్లో ఉంటుందని టీడీపీ శ్రేణులు అంచనా వేస్తున్నాయి.
లోక్‌సభ ఎన్నికల్లో అధికార బీజేపీని యూపీ దెబ్బకొట్టేలా ఉంది. ఎర్లీ ట్రెండ్స్ ప్రకారం ఇక్కడ సగం వరకు సీట్లు కోల్పోవచ్చు! అయితే ఆ నష్టాన్ని మధ్యప్రదేశ్ భర్తీచేసేలా కనిపిస్తోంది. మొత్తం 29 నియోజకవర్గాల్లో అన్నింట్లోనూ బీజేపీ హవా కొనసాగుతోంది. శివరాజ్ సింగ్ చౌహాన్, జ్యోతిరాధిత్య సింధియా, శంకర్ లాల్వానీ, బంటీ వివేక్ సాహూ, అలోక్ శర్మ దూసుకెళ్తున్నారు. చింద్వాడలో నకుల్ కమల్‌నాథ్ వెనుకంజలో ఉన్నారు.
AP: ఎన్నికల కౌంటింగులో రాయలసీమ జిల్లాల్లో కూటమి భారీ విజయం దిశగా సాగుతోంది. మొత్తం 52 స్థానాలకు గాను ప్రస్తుతం 45 చోట్ల కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. కేవలం 7 స్థానాల్లోనే వైసీపీ నేతలు లీడింగులో ఉన్నారు.
ఏపీలోని దాదాపు అన్ని జిల్లాల్లో కూటమి దూసుకెళ్తోంది. ఒక్క కడప మినహా అన్ని జిల్లాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ అధిక్యంలో కొనసాగుతున్నాయి. సీఎం జగన్ సొంత జిల్లా కడపలోనూ కూటమి గట్టి పోటీ ఇస్తోంది. టీడీపీ బలహీనంగా ఉన్న రాయలసీమ, దక్షిణ కోస్తాలోనూ సైకిల్ దూసుకెళ్తోంది.
ఖమ్మంలో కాంగ్రెస్ జెండా ఎగురుతోంది. ఆ పార్టీ అభ్యర్థి రఘురాంరెడ్డి ఆరో రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసే సమయానికి లక్షా 26వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. దీంతో కాంగ్రెస్ గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే నామా నాగేశ్వర్‌రావు కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు.
Sorry, no posts matched your criteria.