India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భారత జట్టు కోచ్‌గా తనకు T20WC చివరి టోర్నమెంట్ అని ద్రవిడ్ వెల్లడించారు. హెడ్ కోచ్ పదవికి మరోసారి దరఖాస్తు చేసే ఆలోచన తనకు లేదని ప్రెస్ కాన్ఫరెన్స్‌లో స్పష్టం చేశారు. కోచ్‌గా ఉండటాన్ని తాను ఎంజాయ్ చేశానని, రాబోయే కాలంలో టీమ్ షెడ్యూల్స్‌ను దృష్టిలో ఉంచుకుని మరోసారి అప్లై చేయొద్దని డిసైడ్ అయినట్లు చెప్పారు. WCలో రోహిత్, జైస్వాల్ ఓపెనింగ్ చేస్తారని, కోహ్లీ కూడా ఓపెనర్‌గా రావొచ్చని చెప్పారు.
TG: ఫోన్ ట్యాపింగ్ కేసును హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. గతంలో TSPSC పేపర్ లీకేజీ కేసులో హైకోర్టు న్యాయమూర్తి ఫోన్‌ను సైతం ట్యాప్ చేసినట్లు పోలీసు అధికారి భుజంగరావు అంగీకరించారు. దీనిపై మీడియాలో వార్తలు రావడంతో ప్రధాన న్యాయమూర్తి ఆలోక్ అరాధే ధర్మాసనం సుమోటోగా స్వీకరించింది. దీనిపై రేపు మధ్యాహ్నం విచారణ జరపనుంది.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. ఐదేళ్లపాటు CM, మంత్రులు, ఎమ్మెల్యేలుగా ఉన్నవారికి ఈ ఒక్కరాత్రే మిగిలి ఉంది. రేపు వారంతా మళ్లీ గెలుస్తారా? లేక కొత్తవారు ప్రజాప్రతినిధులుగా ఎన్నికవుతారా? అనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. మరి రాష్ట్రంలో ఏ పార్టీ గెలిచి అధికారం చేపడుతుందని మీరనుకుంటున్నారు? కామెంట్ చేయండి. ఎలక్షన్ రిజల్ట్స్ ఎక్స్‌క్లూజివ్‌గా WAY2NEWSలో తెలుసుకోండి.
TGSRTCలో 3వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు ఎండీ సజ్జనార్ తెలిపారు. అనుమతి రాగానే ఆయా పోస్టులను భర్తీ చేస్తామన్నారు. మహాలక్ష్మి పథకంతో బస్సుల్లో రద్దీ దృష్ట్యా కొత్తగా వచ్చే 2వేల డీజిల్ బస్సులు, 990 ఎలక్ట్రిక్ బస్సులకు అనుగుణంగా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. ఈ పథకం వచ్చాక రోజుకు 55 లక్షల మంది బస్సుల్లో ప్రయాణిస్తున్నట్లు వెల్లడించారు.
AP: ఓట్ల కౌంటింగ్ నేపథ్యంలో రేపు YCP నేతలు, కార్యకర్తలు అప్రమత్తంగా వ్యవహరించాలని CM జగన్ సూచించారు. ‘ఈ ఎన్నికల్లో మన పార్టీ కార్యకర్తలందరూ గొప్ప పోరాట స్ఫూర్తిని చాటారు. రేపు జరగనున్న కౌంటింగ్ ప్రక్రియలో కూడా అదే స్ఫూర్తిని కొనసాగించాలి. ప్రజలు మనకు వేసిన ప్రతి ఓటునూ మన పార్టీ ఖాతాలోకి వచ్చేలా అప్రమత్తంగా వ్యవహరించి, అఖండ విజయాన్ని చేకూరుస్తారని ఆశిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు.
బెంగళూరులో నిన్న ఒక్కరోజే దాదాపు 111mm వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ వెల్లడించింది. జూన్ నెలలో ఒక్కరోజే ఈ స్థాయి వర్షం కురవడం గత 133 ఏళ్లలో ఇదే తొలిసారి అని తెలిపింది. ఈనెల 1, 2 తేదీల్లో కలిపి మొత్తం 140.7mm వర్షపాతం నమోదైందని, ఏటా జూన్ నెల మొత్తంలో కురిసే సగటు వర్షపాతాన్ని (110.3mm) ఇప్పటికే అధిగమించినట్లు పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు మరింత విస్తరించాయని తెలిపింది.
టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచులో శ్రీలంక 77 రన్స్‌కే కుప్పకూలింది. ఆ జట్టు బ్యాటర్లలో కుశాల్ మెండిస్ (19) టాప్ స్కోరర్‌గా నిలిచారు. సౌతాఫ్రికా బౌలర్లలో అన్రిచ్ నోకియా 4, కేశవ్ మహరాజ్ 2, రబాడ 2 వికెట్లు తీయగా, బార్ట్‌మన్ ఒక వికెట్ పడగొట్టారు. టీ20ల్లో శ్రీలంకకు ఇదే అత్యల్ప స్కోర్.
ఏపీ ఎన్నికల ఫలితాలకు సమయం దగ్గర పడటంతో తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో వైసీపీ, టీడీపీ, జనసేన కార్యకర్తలు, అభిమానులు Xలో పోస్టులతో హోరెత్తిస్తున్నారు. #YSRCPWinningBig, #YSJaganAgain అని వైసీపీ, #HelloAP_ByeByeYCP, #JaganLosingBig అని టీడీపీ, జనసేన కార్యకర్తలు రిజల్ట్స్ హీట్ పెంచుతున్నారు.
బక్రీద్ పండుగ సందర్భంగా ఈనెల 17న తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. నెలవంక దర్శనం ఆధారంగా ముస్లింలు బక్రీద్‌ను జరుపుకుంటారు. ఈనెల 7న నెలవంక కనిపిస్తే జూన్ 17న, లేకపోతే 18న జరుపుకోనున్నారు. పండుగ జరుపుకునే రోజున (17or18) సెలవు ఉండనుంది.
రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ‘వెట్టయాన్’ సినిమా అక్టోబర్ 10న థియేటర్లలోకి వచ్చే అవకాశముంది. ఈ విషయాన్ని రజనీయే స్వయంగా వెల్లడించారు. దీంతో అదే రోజు రిలీజ్ కానున్న ఎన్టీఆర్ ‘దేవర’కు ఈ మూవీ పోటీగా మారింది. అయితే దేవర రిలీజ్ డేట్ సెప్టెంబర్ 27కు మారనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ విడుదల తేదీ మారకుంటే అక్టోబర్ 10న బాక్స్ ఆఫీస్ వద్ద రజనీకాంత్, ఎన్టీఆర్ సినిమాల మధ్య పోటీ చూడవచ్చు.
Sorry, no posts matched your criteria.