News June 3, 2024

image

https://d29i5havsxvi1j.cloudfront.net/cd-timer/exitpolls-cd-timer.html

News June 3, 2024

బెంగళూరు రేవ్ పార్టీ నిర్వహణలో హేమ కీలక పాత్ర!

image

గతనెల 20న బెంగళూరు రేవ్ పార్టీ నిర్వహణలో నటి హేమ కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు గుర్తించారు. ఐదుగురితో కలిసి ఆమె రేవ్ పార్టీ ఏర్పాటు చేసినట్లు నిర్ధారించారు. ఇందులో డ్రగ్స్ కూడా వాడినట్లు తేలడంతో పార్టీలో పాల్గొన్న వారందరికీ టెస్టులు నిర్వహించారు. అందులో 86 మందికి పాజిటివ్‌గా తేలింది. వారిలో హేమ కూడా ఉండటంతో తాజాగా ఆమెను బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు.

News June 3, 2024

అరుదైన వ్యాధి.. మహిళ ప్రేగుల్లో ఆల్కహాల్ ఉత్పత్తి

image

కెనడాలో ‘ఆటో-బ్రూవరీ సిండ్రోమ్’ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఓ మహిళ(50)కు వైద్యులు చికిత్స అందించారు. ఈ వ్యాధి ఉన్నవారి ప్రేగుల్లో శిలీంధ్రాలు కిణ్వ ప్రక్రియతో ఆల్కహాల్‌ను ఉత్పత్తి చేస్తాయి. దీనివల్ల వారు అస్పష్టంగా మాట్లాడుతూ, పగలు నిద్రపోతూ ఉంటారు. UTI సమస్యలకు యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడటం వల్ల ఈ సిండ్రోమ్ వస్తుందట. యాంటీ ఫంగల్ ఔషధాలు, లో కార్బోహైడ్రేట్ ఆహారంతో ఆమెకు చికిత్స చేశారు.

News June 3, 2024

కాకతీయ కళాతోరణంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు: సీతక్క

image

TG: రాష్ట్రీయ గీతాన్ని వివాదం చేయడం తగదని మంత్రి సీతక్క అన్నారు. తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో కాకతీయ కళాతోరణం కొనసాగింపు లేదా తొలగింపుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. మెజారిటీ ప్రజల ఇష్టం మేరకే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో 14 ఎంపీ స్థానాలు గెలుస్తామన్న విశ్వాసం ఉన్నట్లు పేర్కొన్నారు.

News June 3, 2024

T20 WC: న్యూయార్క్‌ స్టేడియం చుట్టూ పోలీస్ స్నైపర్స్

image

T20 WC మ్యాచులకు ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో నిర్వాహకులు భద్రతను కట్టుదిట్టం చేశారు. న్యూయార్క్‌లోని నసావు కౌంటీ స్టేడియం చుట్టూ పోలీస్ స్నైపర్స్‌ను ఏర్పాటు చేశారు. నేటి నుంచి ఈనెల 12 వరకు ఇక్కడ జరిగే మ్యాచులకు స్పెషల్ వెపన్స్&టాక్టిక్స్ టీమ్స్‌తో పాటు స్నైపర్స్ భద్రతగా ఉంటారు. అలాగే డ్రోన్ దాడులు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇదే వేదికలో ఈనెల 9న IND, PAK మ్యాచ్ జరగనుంది.

News June 3, 2024

వాట్సాప్‌లో ఫలితాల పేరుతో ఫేక్ ఫైల్స్.. ఓపెన్ చేయొద్దన్న పోలీసులు

image

రేపు కౌంటింగ్ జరగనుండగా ఎలక్షన్ ఫలితాల పేరుతో మోసగాళ్లు సైబర్ నేరాలకు తెరలేపారు. వాట్సాప్‌లో ఫేక్ ఫైల్స్, లింకులు పంపుతున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. దీంతో వాటిని ఓపెన్ చేయొద్దని, అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సీీసీఎస్ పోలీసులు సూచిస్తున్నారు. ఫేక్‌ ఫైల్స్‌తో మొబైల్ హ్యాక్ లేదా డబ్బులు పోగొట్టుకునే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

News June 3, 2024

ISIకి రహస్య సమాచారం.. ‘బ్రహ్మోస్’ మాజీ ఇంజినీర్‌కు జీవితఖైదు

image

బ్రహ్మోస్ ఏరోస్పేస్ మాజీ ఇంజినీర్ నిషాంత్ అగర్వాల్‌కు నాగ్‌పూర్ కోర్టు జీవితఖైదు విధించింది. పాకిస్థాన్ ISIకి రహస్య సమాచారం చేరవేశారనే కేసులో అతడు దోషిగా తేలాడు. దీంతో కోర్టు నిషాంత్‌కు అధికారిక రహస్యాల చట్టం కింద మరో 14 ఏళ్ల జైలుశిక్షతో పాటు రూ.3000 ఫైన్ వేసింది. నాగ్‌పూర్‌లోని మిస్సైల్ సెక్షన్‌లో టెక్నికల్ రీసెర్చ్ సెంటర్‌లో ఇంజినీర్‌గా పనిచేసే నిషాంత్‌ను ATS అధికారులు 2018లో అరెస్ట్ చేశారు.

News June 3, 2024

హార్దిక్-నటాషా కలిసిపోయారా?

image

క్రికెటర్ హార్దిక్ పాండ్య-నటి నటాషా విడాకులు తీసుకోలేదా? మళ్లీ కలిసి పోయారా? అంటే నటాషా ఇన్‌స్టా ఖాతాను చూస్తే అవుననే అనిపిస్తోంది. తన ఇన్‌స్టాలో పెళ్లి ఫొటోలను తొలగించి డివోర్స్ వార్తలకు ఛాన్స్ ఇచ్చిన ఆమె తాజాగా వాటిని రీస్టోర్ చేశారు. నటాషా ఖాతాలో పెళ్లి ఫొటోలు కనిపిస్తున్నాయి. దీంతో మనసు మార్చుకుని మళ్లీ ఇరువురూ కలిసిపోయినట్లు తెలుస్తోంది. వీరికి 2020లో పెళ్లి కాగా కొడుకు అగస్త్య ఉన్నారు.

News June 3, 2024

తెలంగాణ సచివాలయంలో వాస్తు మార్పులు?

image

TG సచివాలయంలో మరోసారి వాస్తు మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. CM కాన్వాయ్ ఇప్పటివరకు సెక్రటేరియట్ ప్రధాన ద్వారం నుంచి లోపలికి వచ్చేది. ఇక నుంచి వెస్ట్ గేట్ నుంచి లోపలికి, నార్త్ ఈస్ట్ గేట్ నుంచి బయటకు వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నారట. ఇక సౌత్ ఈస్ట్ నుంచి అధికారుల రాకపోకలు సాగనున్నాయట. గతంలో ఆరో అంతస్తులో ఉన్న CM ఆఫీసును 9వ అంతస్తులోకి మార్చాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.

News June 3, 2024

భారీ లాభాల్లో మార్కెట్లు

image

స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 2,507 పాయింట్లు లాభపడి 76,468 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 733 పాయింట్లు వృద్ధి చెంది 23,263 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్టీపీసీ, ఎస్బీఐ, పవర్‌గ్రిడ్, ఎల్&టీ, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, ఎయిర్‌టెల్, విప్రో, మారుతీ, ITC షేర్లు భారీ లాభాలు పొందాయి.