News December 3, 2024

శుభ ముహూర్తం

image

తేది: డిసెంబర్ 03, మంగళవారం
విదియ మ.1.09 గంటలకు
మూల సా.4.41 గంటలకు
వర్జ్యం: మ.3.01-సా.4.41 గంటల వరకు
తిరిగి రా.2.30-తె.4.09 గంటల వరకు
దుర్ముహూర్తం: ఉ.8.36-ఉ.9.24 గంటల వరకు
తిరిగి రా.10.40-రా.11.31 గంటల వరకు

News December 3, 2024

లోయర్ ఆర్డర్‌లో రోహిత్ వద్దు: హర్భజన్

image

BGT 2వ టెస్ట్‌లో రోహిత్ శ‌ర్మ టాప్ ఆర్డ‌ర్‌లో లేదా మూడో స్థానంలో ఆడ‌వ‌చ్చ‌ని మాజీ స్పిన్న‌ర్ హ‌ర్భజ‌న్ సింగ్ అభిప్రాయపడ్డారు. లోయ‌ర్ ఆర్డ‌ర్‌ 5, 6 స్థానాల్లో ఆడే అవ‌కాశం లేద‌న్నారు. య‌శ‌స్వీతో క‌లిసి రోహిత్ ఓపెనింగ్ చేస్తార‌ని, రాహుల్ మూడో స్థానంలో రావ‌చ్చ‌ని పేర్కొన్నారు. ఆరో స్థానంలో రోహిత్ ఆడ‌డం జ‌ట్టుకు మంచిది కాద‌ని, బ్యాటింగ్ ఆర్డ‌ర్‌లో టాప్-4 ఆట‌గాళ్లు టీమ్‌కు 4 స్తంభాలుగా ఉండాల‌న్నారు.

News December 3, 2024

నేటి ముఖ్యాంశాలు

image

☛ AP: దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం: సీఎం CBN
☛ రేషన్ బియ్యం అక్రమరవాణాపై విచారణ జరపాలని సీఎంకు పవన్ విజ్ఞప్తి
☛ చంద్రబాబు రైతులను రోడ్డున పడేశారు: YS జగన్
☛ రూ.67వేల కోట్ల అప్పు చేసి ఏం చేశారు?: బొత్స
☛ TG: పదేళ్లు మేమే అధికారంలో ఉంటాం: రేవంత్
☛ ఈ నెలలో 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్: మంత్రి
☛ కేసీఆర్ మొక్క కాదు.. వేగు చుక్క: కవిత
☛ KCR కంటే దారుణంగా రేవంత్ రెడ్డి పాలన: ఈటల

News December 2, 2024

రైతులను రోడ్డున పడేశారు: YS జగన్

image

AP: ధాన్యం కొనకుండా రైతులను CM చంద్రబాబు రోడ్డున పడేశారని జగన్ విమర్శించారు. ‘తేమ శాతం సాకుగా చూపి రైతులను దోపిడీకి గురి చేస్తున్నారు. మద్దతు ధర లేక బస్తాకు ₹300-₹400 నష్టానికి ధాన్యం అమ్ముకోవాల్సి వస్తోంది. తుఫాను వస్తుందని 4 రోజుల ముందుగానే వాతావరణ శాఖ హెచ్చరించినా ప్రభుత్వం ధాన్యాన్ని కొనలేదు. రైతులు అవస్థలు పడుతుంటే డైవర్షన్‌ పాలిటిక్స్‌తో CM, మంత్రులు కాలం గడుపుతున్నారు’ అని ట్వీట్ చేశారు.

News December 2, 2024

మద్యం కొనుగోళ్లు ఆపేస్తాం: వైన్స్ ఓనర్స్

image

AP: మద్యం షాపుల టెండర్‌కు ముందు ప్రకటించిన 20% కమీషన్ ఇవ్వాలని వైన్స్, బార్ల యజమానులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇవాళ కడపలో సమావేశమైన మద్యం షాపుల ఓనర్లు ఈనెల 5న ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్‌కు నోటీస్ ఇవ్వాలని నిర్ణయించారు. ఈనెల 14వ తేదీలోపు కమీషన్ పెంపుపై నిర్ణయం తీసుకోకపోతే మద్యం కొనుగోళ్లు ఆపేస్తామని హెచ్చరించారు. ప్రస్తుతం 9.5% కమీషన్ ఇస్తున్నారని, దీనితో లైసెన్స్ ఫీజులు కట్టలేమని చెబుతున్నారు.

News December 2, 2024

‘హరిహర వీరమల్లు’ షూటింగ్.. పవన్ సెల్ఫీ

image

పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు. ఈ విషయాన్ని ఆయన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రకటించారు. వీరమల్లు గెటప్‌లో తీసుకున్న సెల్ఫీని పోస్ట్ చేశారు. ‘బిజీ పొలిటికల్ షెడ్యూల్ తర్వాత చివరకు నేను చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పని కోసం నా సమయాన్ని కొన్ని గంటలు ఇవ్వగలుగుతున్నా’ అని పేర్కొన్నారు.

News December 2, 2024

ఏపీలో పుష్ప-2 టికెట్ ధరలు భారీగా పెంపు

image

పుష్ప-2 సినిమా టికెట్ల ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. డిసెంబర్ 4న ప్రీమియర్ షో రా.9.30 గంటలకు ఒక టికెట్‌ రూ.800గా నిర్ణయించింది. డిసెంబర్ 5 నుంచి 17 వరకు గరిష్ఠంగా రూ.200 వరకు పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మల్టీప్లెక్సుల్లో రూ.200, సింగిల్ స్క్రీన్లలో లోయర్ క్లాసుకు రూ.100, అప్పర్ క్లాసుకు రూ.150 వరకు పెంచుకోవచ్చంది.

News December 2, 2024

దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం: సీఎం

image

AP: వర్షాల ప్రభావం పూర్తిగా తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలని అధికారులకు CM CBN సూచించారు. తుఫాను ప్రభావం, సహాయక చర్యలపై అధికారులతో సమీక్షించారు. మొత్తం 53 మండలాల్లో తుఫాను ప్రభావం ఉందని, ప్రాథమిక అంచనా ప్రకారం 6,824 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించాలని, ఎన్యుమరేషన్ ప్రక్రియ చేపట్టాలని CM సూచించారు. తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు.

News December 2, 2024

ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు: అల్లు అర్జున్

image

‘పుష్ప-2’ సినిమా టికెట్ ధరల పెంపునకు అనుమతిచ్చిన ఏపీ ప్రభుత్వానికి అల్లు అర్జున్ X వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయం తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుగుదల పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను తెలియజేస్తుందని అన్నారు. సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తున్న సీఎం చంద్రబాబుకు స్పెషల్ థాంక్స్, ఫిల్మ్ ఇండస్ట్రీకి మద్దతుగా నిలుస్తోన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు సిన్సియర్ థాంక్స్ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

News December 2, 2024

ఈనెల 5న ఇందిరమ్మ ఇళ్ల యాప్ ఓపెన్: మంత్రి

image

TG: ప్రతి నియోజకవర్గానికి 3500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ ‘ఈనెల 5న ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన యాప్‌ను ఓపెన్ చేస్తాం. ప్రతి గ్రామానికి అధికారుల బృందాలు వస్తాయి’ అని పేర్కొన్నారు. సంక్రాంతి పండుగ తర్వాత రైతు భరోసా నిధులను అన్నదాతల ఖాతాల్లో జమ చేస్తామన్నారు.