India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మహారాష్ట్రలో ఓటమికి EVMలను కాంగ్రెస్ నిందిస్తుండటంపై ECI స్పందించింది. డిసెంబర్ 3న తమను కలవాలని INC బృందాన్ని ఆహ్వానించింది. ఎన్నికల ప్రక్రియలో ప్రతి దశలో అన్ని పార్టీల అభ్యర్థులు, ఏజెంట్లు భాగమవుతారని తాత్కాలిక స్పందనను తెలియజేసింది. కాంగ్రెస్ వివరించే సరైన అంశాలను సమీక్షించి, రాతపూర్వకంగా జవాబిస్తామని పేర్కొంది. పోలింగ్ శాతం అప్డేషన్ ప్రాసెస్‌లో పార్టీల భాగస్వామ్యం ఉంటుందని చెప్పింది.

Netflix యూజర్లే లక్ష్యంగా 23 దేశాల్లో భారీ సైబర్ స్కామ్ జరుగుతోందని బిట్‌డిఫెండర్ హెచ్చరించింది. క్యారెట్ ఆన్ స్టిక్ విధానంలో యూజర్లను బురిడీ కొట్టిస్తున్నారంది. ‘మీ పేమెంట్ ప్రాసెసింగ్‌లో ఇష్యూ తలెత్తింది’, ‘మీ పేమెంట్ ఫెయిలైంది. వివరాలు చెక్ చేసుకోండి’ అంటూ fake links పంపిస్తున్నారు. అందులో పేర్లు, క్రెడిట్ కార్డు డీటెయిల్స్ నమోదు చేయగానే డబ్బులు కొట్టేస్తున్నారు. ఇలాంటి మెసేజులు మీకూ వచ్చాయా?

ఉన్నత విద్యలో భారీ మార్పులకు UGC శ్రీకారం చుట్టింది. UG స్టూడెంట్స్ ఇష్టానుసారం డిగ్రీని పూర్తిచేసేలా ఫ్లెక్సిబుల్ డ్యురేషన్ గైడ్‌లైన్స్‌ను ఆమోదించింది. వీటిప్రకారం 6 సెమిస్టర్లుండే డిగ్రీని 5 లేదా 7 సెమిస్టర్లలో పూర్తిచేయొచ్చు. 4 ఏళ్ల డిగ్రీకీ ఇంతే. అంటే వ్యవధికి ముందు లేదా ఆలస్యంగా చదవొచ్చు. 2 సెమిస్టర్లు పూర్తయ్యాక వీటిని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. సాధారణ డిగ్రీతో సమానంగా వీటికి విలువుంటుంది.

UGC ఆమోదించిన ఫ్లెక్సిబుల్ డ్యురేషన్ డిగ్రీ గైడ్‌లైన్స్ ఉన్నత విద్యారంగంలో పెనుమార్పులు తేవొచ్చు. మూడేళ్ల డిగ్రీని ఆర్నెల్లు ముందుగానే పూర్తిచేస్తే విద్యార్థుల మధ్య పోటీ పెరుగుతుంది. మెల్లగా చదువుతాం, బ్యాక్‌లాగులు రాస్తామంటే కష్టమే. విద్య, ఉపాధి అవకాశాలు వేగంగా డిగ్రీ పూర్తిచేసినవాళ్లకే ఎక్కువగా ఉంటాయి. టైమ్ కావాలనుకొనే వాళ్లు, స్కిల్స్ నేర్చుకొనేవాళ్లు డిగ్రీ వ్యవధిని ఆర్నెల్లు పెంచుకోవచ్చు.

AP: మంత్రి నారా లోకేశ్‌తో సమావేశమైనట్లు హీరో మంచు విష్ణు వెల్లడించారు. ఇద్దరూ కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘నా సోదరుడు, డైనమిక్ విద్యాశాఖ మంత్రి లోకేశ్‌తో సానుకూల వాతావరణంలో పలు అంశాలపై మాట్లాడా. అతని పాజిటివ్ ఎనర్జీ అద్భుతం. లోకేశ్‌కు దేవుడు మరింత శక్తి ఇవ్వాలని కోరుకుంటున్నా’ అని రాసుకొచ్చారు.

కెరీర్ ఆరంభంలో అవకాశాలు రాక, చేతిలో డబ్బుల్లేక 3 నెలలు అన్నం తినలేదని నటుడు రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘సినిమాల్లోకి వెళ్తా అనడంతో నాన్న అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇండస్ట్రీలో ఫెయిల్ అయితే ఇంటికి రావొద్దన్నారు. ఒక దశలో వేషాలు రాకపోవడంతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా. చివరగా నిర్మాత పుండరీకాక్షయ్య ఆఫీసుకు వెళితే డబ్బింగ్ అవకాశం వచ్చింది. దీంతో నా దశ తిరిగింది’ అని తెలిపారు.

మహారాష్ట్ర CM రేసులో కొత్త పేరు విన్పిస్తోంది. పుణె MP, కేంద్ర సహాయమంత్రి మురళీధర్ మొహోల్ పేరును BJP అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు మీడియా వర్గాలు పేర్కొన్నాయి. మరాఠా నేత అయిన మురళీకి బలమైన RSS మూలాలున్నాయి. గతంలో పుణే మున్సిపల్ మేయర్‌గా పని చేసిన ఇతనికి BJPలో చురుకైన నేతగా పేరుంది. వారం రోజులుగా మహారాష్ట్ర సీఎం పీఠం కోసం ఫడణవీస్, శిండే ఎదురుచూస్తుండగా, కొత్త పేరు తెరపైకి రావడం చర్చనీయాంశమైంది.

AP: తమిళనాడుకు చెందిన భావన(35) అనే మహిళ భర్తతో గొడవపడి తిరుమల వచ్చింది. శ్రీవారి మెట్టు మార్గం నుంచి వెళుతూ తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్లుగా బెంగళూరులో ఉన్న అన్నకు సెల్ఫీ వీడియో పంపింది. అతను వెంటనే తిరుమల పోలీసులకు సమాచారం అందించారు. వీడియోలోని లొకేషన్, సీసీటీవీల ఆధారంగా వారు గంటలోనే ఆమెను గుర్తించి కౌన్సెలింగ్ ఇచ్చారు. భర్త, పిల్లలను పిలిపించి మాట్లాడి సురక్షితంగా ఇంటికి పంపారు.

ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈరోజు ‘హరి హర వీరమల్లు’ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘ధర్మం కోసం పోరాటంలో ఆఖరి అధ్యాయం మొదలు’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. మరిన్ని అప్డేట్స్ త్వరలో రానున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రం 2025 మార్చి 28న రిలీజ్ కానుంది. అయితే, ఎన్నిరోజుల పాటు ఈ షూటింగ్ షెడ్యూల్ ఉంటుందో తెలియాల్సి ఉంది.

AP: ఫెంగల్ తుఫానుపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అన్ని స్థాయిల్లో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, పరిస్థితిని ఎప్పటికప్పుడు రియల్ టైంలో అంచనా వేసి చర్యలు చేపట్టాలని సూచించారు. వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని పూర్తి సమన్వయంతో పని చేయాలన్నారు. ఆస్తి, ప్రాణ నష్ట నివారణకు ముందు నుంచే జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తుఫాను సమాచారాన్ని రైతులకు ఎప్పటికప్పుడు చేరవేయాలన్నారు.
Sorry, no posts matched your criteria.