News November 30, 2024

మందుబాబులకు గుడ్‌న్యూస్.. 3 బ్రాండ్ల మద్యం ధరలు తగ్గింపు

image

APలో చీప్ లిక్కర్ క్వార్టర్ ₹99కే అందిస్తున్న ప్రభుత్వం మరిన్ని బ్రాండ్లపై రేట్లను తగ్గించింది. రాయల్ ఛాలెంజ్ గోల్డ్ విస్కీ క్వార్టర్ ధర ₹230 నుంచి ₹210కి, ఫుల్ బాటిల్ ₹920 నుంచి ₹840కి తగ్గింది. మాన్షన్‌హౌస్ క్వార్టర్ ₹220 నుంచి ₹190కి, ఫుల్ బాటిల్ ₹870 నుంచి రూ.760కి, యాంటిక్విటీ విస్కీ ఫుల్ బాటిల్ ₹1,600 నుంచి ₹1,400కు తగ్గించి అమ్ముతోంది. త్వరలోనే మరో 2 కంపెనీల ధరలు తగ్గిస్తారని తెలుస్తోంది.

News November 30, 2024

పుష్ప-2: వార్ వన్ సైడే!

image

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘పుష్ప-2’పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. డిసెంబర్ 5న థియేటర్లలో ఈ మూవీ సోలో రిలీజ్‌గా వస్తోంది. ఐకాన్ స్టార్ మూవీ వచ్చిన 2 వారాలకు డిసెంబర్ 20న బచ్చలమల్లి(అల్లరి నరేశ్), యూఐ(ఉపేంద్ర), విడుదల:పార్ట్ 2, సారంగపాణి జాతకం, ముఫాసా: ది లయన్ కింగ్ రానున్నాయి. DEC 25న రాబిన్ హుడ్, బేబీ జాన్, 27న పతంగ్ రిలీజ్ కానున్నాయి.

News November 30, 2024

ISKCON బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ చేసిన బంగ్లాదేశ్

image

హిందువులపై దాడుల్ని పట్టించుకోని బంగ్లాదేశ్ మరో కఠిన నిర్ణయం తీసుకుంది. 17 మంది ISKCON ప్రతినిధుల బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయాలని ఆదేశించింది. ఆ సంస్థను నిషేధించాలన్న పిటిషన్‌ను బంగ్లా హైకోర్టు తిరస్కరించిన కొద్ది వ్యవధిలోనే ఈ నిర్ణయం తీసుకుంది. ఆ అకౌంట్లకు చెందిన అన్ని లావాదేవీలు సస్పెండ్ చేయాలని బ్యాంకులు, ఆర్థిక సంస్థలను BFIU ఆదేశించింది. వీటిలో అరెస్టైన చిన్మయ్ కృష్ణదాస్ A/C సైతం ఉంది.

News November 30, 2024

రామ్ చరణ్ ‘RC16’లో మున్నా భాయ్

image

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా బుచ్చి బాబు తెరకెక్కిస్తోన్న ‘RC16’ సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. ఈ చిత్రంలోని ఓ రోల్‌ను మేకర్స్ రివీల్ చేశారు. ఈ చిత్రంలో ‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్ ఫేమ్ దివ్యేందు నటిస్తున్నట్లు ప్రకటించారు. ‘మన భయ్యా, మీ భయ్యా, మున్నా భయ్యా’ అని పేర్కొంటూ ఓ పోస్టర్ రివీల్ చేశారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

News November 30, 2024

ఆటోను మినీ లైబ్రరీగా మార్చేశారు!

image

బెంగళూరు ఆటో డ్రైవర్లు సరికొత్త ఇన్నోవేటివ్స్‌తో నెట్టింట వైరలవుతుంటారు. తాజాగా మరో డ్రైవర్ తన ఆటోను కస్టమర్ల కోసం మినీ లైబ్రరీగా మార్చేశారు. అందులో పదుల సంఖ్యలో పుస్తకాలను ఉంచారు. దీంతోపాటు కస్టమర్లకు ఏ పుస్తకమైనా నచ్చితే ఉచితంగా తీసుకోవచ్చని స్టిక్కర్ అంటించారు. ఓ నెటిజన్ దీనికి సంబంధించిన ఫొటోను షేర్ చేయగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.

News November 30, 2024

పవర్‌ను జన్మహక్కుగా భావించేవాళ్లు పదేళ్లుగా పవర్‌లో లేరు: మోదీ

image

ప్రతిపక్షాలు రాజ్యాంగ స్ఫూర్తిని నలిపేశాయని PM మోదీ అన్నారు. డెమోక్రసీలో అన్ని రూల్స్‌ను తిరస్కరిస్తూ, ప్రజల్ని మోసగించి అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయని దుయ్యబట్టారు. ‘పవర్ తమ జన్మహక్కుగా భావించేవాళ్లు పదేళ్లుగా పవర్‌లో లేరు. ఆది నుంచీ వారు BJP-NDAకు ప్రజలిచ్చిన తీర్పును అంగీకరించడం లేదు. పదేళ్లుగా పవర్‌లో లేకపోవడంతో దేశంపై కుట్రలకు వెనుకాడటం లేదు’ అని పరోక్షంగా రాహుల్‌ను విమర్శించారు.

News November 30, 2024

‘నిద్రలేని రాత్రులకు విముక్తి ఇచ్చావ్ లోకేశ్ అన్న’: యువకుడు

image

మంగళగిరిలో ఏర్పాటు చేసిన జాబ్ మేళాలో ఉద్యోగం పొందానని సంతోషంతో ట్వీట్ చేసిన ఓ యువకుడికి మంత్రి నారా లోకేశ్ రిప్లై ఇచ్చారు. ‘ధన్యవాదాలు నారా లోకేశ్ అన్న. పోయిన వారం మీరు కండక్ట్ చేసిన జాబ్ మేళాలో జాబ్ వచ్చింది అన్నయ్య. ఈరోజు రిపోర్టింగ్ తేదీ కన్ఫర్మ్ చేశారు. ఎన్నో నిద్రలేని రాత్రులకు విముక్తి ఇచ్చావ్ అన్న. థ్యాంక్స్’ అని ట్వీట్ చేశాడు. అతనికి లోకేశ్ ఆల్ ది బెస్ట్ చెప్పారు.

News November 30, 2024

TGPSC కొత్త ఛైర్మన్‌గా బుర్రా వెంకటేశం

image

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) కొత్త ఛైర్మన్‌గా IAS అధికారి బుర్రా వెంకటేశం నియమితులయ్యారు. డిసెంబర్ 3తో ప్రస్తుత ఛైర్మన్ మహేందర్ రెడ్డి పదవీకాలం ముగియనుంది. ఈ మేరకు వెంకటేశంను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు.

News November 30, 2024

రైతుల జీవితాల్లో పండగ తెచ్చాం: సీఎం రేవంత్

image

TG: ఒక్క ఏడాదిలో రూ.54వేల కోట్లతో రైతుల జీవితాల్లో పండగ తెచ్చామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సంతోష సమయంలో అన్నదాతలతో కలిసి రైతు పండగలో పాలు పంచుకునేందుకు ఉమ్మడి పాలమూరుకు వస్తున్నట్లు ట్వీట్ చేశారు. ‘ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజు పొలానికి వెళ్లి అరక కట్టాల్సిన రైతు, పోలింగ్ బూతుకు వెళ్లి మార్పు కోసం ఓటేశాడు. ఆ ఓటు అభయహస్తమై రైతన్న చరిత్రను తిరగరాసింది’ అని పేర్కొన్నారు.

News November 30, 2024

ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రేమ.. చివరికి విషాదాంతం

image

ఆన్‌లైన్ ప్రేమకు మరో యువతి బలైంది. విజయవాడకు చెందిన ఓ యువతి ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన వ్యక్తితో ప్రేమలో పడింది. అతడినే పెళ్లి చేసుకోవాలనుకోగా పేరెంట్స్ నిరాకరించారు. దీంతో ఆమె ఎలుకల మందు తాగింది. కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడారు. తర్వాత ఆమె ఇంట్లో నుంచి వెళ్లిపోగా తిరిగి తీసుకొచ్చారు. మరోసారి వెళ్లిపోయి ఏలూరు కాలువలో దూకింది. తాజాగా ఆమె శవాన్ని పోలీసులు గుర్తించారు.