India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

టాలీవుడ్ నటుడు పెనుమత్స సుబ్బరాజు పెళ్లి చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. సుబ్బరాజు 50కిపైగా తెలుగు సినిమాల్లో నటించారు. ఎక్కువగా విలన్ పాత్రలు చేసి మెప్పించిన సుబ్బరాజు పలు సినిమాల్లో కామెడీ పాత్రల్లోనూ నటించారు.

AP: రాష్ట్రంలోని పలు నియోజకవర్గాలకు కో ఆర్డినేటర్లను నియమిస్తూ PCC చీఫ్ షర్మిల జాబితా విడుదల చేశారు. ఇచ్చాపురం-చక్రవర్తి, టెక్కలి-దుంపల రామారావు, పాతపట్నం-మజ్జి మురళిమోహన్, నరసన్నపేట-మామిడి సత్యనారాయణ, రాజాం-కుప్పిలి చైతన్య, RCపురం-కోట శ్రీనివాస్, ముమ్మిడివరం-ధర్మారావు, అమలాపురం-సుభాషిణి, రాజోలు-ప్రసన్న, కొత్తపేట-ఈశ్వర్, మండపేట-ప్రభాకర్, వెంకటగిరి-మురళి, రాప్తాడు-ఉమారాణి, చంద్రగిరి-లోకేశ్ రెడ్డి.

థియేట్రికల్ రిలీజ్ చిత్రాలకు మాత్రమే కాకుండా ఓటీటీలో రిలీజైన సినిమాలు, వెబ్ సిరీస్‌లకు కూడా FilmFare అవార్డులను ప్రకటించనుంది. ఉత్తమ సిరీస్-ఫిలిం నామినేషన్స్‌లో ది రైల్వేమెన్, కోటా ఫ్యాక్టరీ(S3), గన్స్ అండ్‌గులాబ్స్, హీరామండి: ది డైమండ్ బజార్, కాలా పానీ, మేడ్ ఇన్ హెవెన్(S2), ముంబై డైరీస్(S2) ఉన్నాయి. హీరామండి అత్యధికంగా 16, గన్స్&గులాబ్స్ 12 నామినేషన్లు దక్కించుకున్నాయి.

విమానాల్లో అతిగా ప్రవర్తించే ప్రయాణికుల కట్టడికి క్రియేటివ్‌గా ఆలోచించి మార్గదర్శకాలు రూపొందించాలని కేంద్రం, విమానయాన శాఖను సుప్రీంకోర్టు ఆదేశించింది. 2022లో ఓ వ్యక్తి మద్యం మత్తులో తనపై యూరినేట్ చేశాడని 73 ఏళ్ల మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు విచారించింది. అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రస్తుతం ఉన్న మార్గదర్శకాలను మెరుగుపరిచేలా ఆయా శాఖలు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

పెర్త్ టెస్టులో ఆస్ట్రేలియాపై టీమ్ ఇండియా విక్టరీ జోష్‌లో ఉన్న భారత అభిమానులకు మరో గుడ్ న్యూస్. ఈ నెల 30న కాన్‌బెరాలో ప్రైమ్ మినిస్టర్స్ లెవెన్‌తో ఇండియా-ఏ ఆడే 2రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌ను కూడా లైవ్ చూడొచ్చు. స్టార్ స్పోర్ట్స్‌లో ఇది టెలికాస్ట్ కానుంది. తొలి మ్యాచ్‌కి దూరమైన కెప్టెన్ రోహిత్ శర్మ, గిల్‌కు రెండో టెస్టు ముంగిట ఈ ప్రాక్టీస్ కీలకం. రెండో టెస్టు వచ్చే నెల 6న అడిలైడ్‌లో ప్రారంభం కానుంది.

AP: వాలంటీర్ దుర్గాప్రసాద్ హత్య కేసులో ప్రధాన నిందితుడు, మాజీ మంత్రి పినిపె విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్‌కు అమలాపురం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కాగా దుర్గాప్రసాద్ హత్య కేసు కోనసీమ జిల్లాలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. నిందితుడిని శ్రీకాంతే హత్య చేయించాడని పోలీసులు నిర్ధారించారు. దీంతో గత నెల 23న కోర్టు రిమాండ్ విధించడంతో ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.

TG: రైతుల నుంచి పెద్ద ఎత్తున ధాన్యం సేకరణ, మద్దతు ధర, బోనస్ చెల్లించిన సందర్భంగా ఈ నెల 30వ తేదీన మహబూబ్‌నగర్‌లో రైతు పండుగను నిర్వహించనున్నట్లు CM రేవంత్ వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని 28, 29, 30 తేదీల్లో వ్యవసాయ ఎగ్జిబిషన్, ఆధునిక పద్ధతులు, యాంత్రీకరణ, ఆదర్శ రైతులతో అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయాలన్నారు. కలెక్టర్లంతా రైతు పండుగ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని CM కోరారు.

ఇంట్లోనే గర్భధారణ చెక్ చేసుకునేందుకు వాడే కిట్స్ ఒక్కోసారి నెగటివ్ చూపిస్తాయి. రాలేదులే అని ఫిక్స్ అయ్యాక ఈ కింది లక్షణాలు కనిపిస్తే మరోసారి చెక్ చేసుకోవాలంటున్నారు వైద్యులు. అవి.. కొన్ని పదార్థాలు, వాసనలపై వికారం పుట్టడం, వక్షోజాల పెరుగుదల, నొప్పి, తరచూ వాంతులు, నీరసం పెరగడం, మూత్రం ఎక్కువగా రావడం, కడుపు నొప్పి వంటివి కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా మరోమారు టెస్ట్ చేయించుకోవాలని చెబుతున్నారు.

Zomato CEO దీపిందర్ గోయల్ ₹3.5 కోట్ల తన వార్షిక వేతనాన్ని మరో రెండేళ్లపాటు(2026 వరకు) వదులుకున్నారు. గోయల్ గతంలోనూ 2021 నుంచి 3 ఏళ్లపాటు జీతం తీసుకోకూడదని నిర్ణయించారు. కంపెనీ ఆర్థిక స్థిరత్వం, వ్యూహాత్మక లక్ష్యాలకు ప్రాధాన్యమివ్వడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. Zomatoలో దీపిందర్‌కు ఉన్న 4.16% వాటా విలువ దాదాపు ₹10 వేల కోట్లు ఉంటుందని అంచనా.

మహారాష్ట్ర CM పదవి కోసం శివసేన శిండే వర్గం పట్టువీడటం లేదు. తాజాగా ఏక్‌నాథ్ శిండే ప్రచార బృందం వ్యూహాత్మక క్యాంపెయిన్‌ను జనంలోకి వదిలింది. ప్రధాని మోదీ నినదించిన ‘ఏక్ హైతో సేఫ్ హై’ను కాస్త ట్వీక్ చేసి ఏక్‌నాథ్ హైతో సేఫ్ హై అంటూ తన వాణిని బలంగా వినిపిస్తోంది. CM అభ్యర్థి విషయంలో ఇంకా స్పష్టత రాకపోవడంతో శిండే వర్గం విశ్వప్రయత్నాల్లో ఉన్నట్టు ఈ ప్రచారం ద్వారా స్పష్టమవుతోంది.
Sorry, no posts matched your criteria.