India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: BRS హత్యారాజకీయాలు చేయడం దురదృష్టకరమని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆ పార్టీ నేత శ్రీధర్ రెడ్డికి అనేక వివాదాల్లో ప్రమేయం ఉందని, కుటుంబ తగాదాల వల్లే ఆయనను హత్య చేశారన్నారు. హత్యలకు, రాజకీయాలకు ముడిపెట్టడం సరికాదని.. కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని జూపల్లి మండిపడ్డారు. నిరాధార ఆరోపణలు చేసినందుకు వారు తనకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
RCBపై అంబటి రాయుడు విమర్శలు గుప్పించారు. ‘ఎన్నో ఏళ్లుగా టీమ్‌కు మద్దతిస్తున్న ఆర్సీబీ అభిమానులను చూస్తుంటే నా హృదయం తరుక్కుపోతోంది. వ్యక్తిగత రికార్డులకంటే జట్టు ప్రయోజనాల కోసం ఆడితే RCB ఇప్పటికే బహుళ టైటిళ్లు నెగ్గేది. మంచి ఆటగాళ్లను ఆ టీమ్ వదులుకుంది. జట్టు విజయమే తొలి ప్రాధాన్యంగా భావించే ప్లేయర్లకు మేనేజ్మెంట్ సపోర్ట్ చేయాలి. మెగావేలం నుంచి ఇది ప్రారంభం కావాలి’ అని తెలిపారు.
క్రికెట్‌లో అతిగా సంబరాలు చేసుకోవడం ఎప్పటికీ మంచిది కాదని మాజీ క్రికెటర్ కృష్ణమాచార్య శ్రీకాంత్ అభిప్రాయపడ్డారు. CSKపై విజయం సాధించగానే RCB ఫ్యాన్స్ గొప్పగా వీడియోలు చేశారని, ఇప్పుడు RR చేతిలో ఓడిపోగానే ట్రోల్స్ వస్తున్నాయని చెప్పారు. జీవితంలో ఏదైనా గొప్పగా సాధిస్తే నోరు అదుపులో పెట్టుకుని దూకుడు తగ్గించుకుని ముందుకెళ్లాలని RCBకి సూచించారు. అనవసరంగా గోల చేస్తే పైకి వెళ్లలేరని స్పష్టంచేశారు.
AP: బెంగళూరు రేవ్ పార్టీతో తనకు సంబంధం లేదని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. అవసరమైతే బ్లడ్ శాంపిల్ ఇవ్వడానికి తాను సిద్ధమేనని చెప్పారు. ‘నాపై ఆరోపణలు చేసే సోమిరెడ్డి తన బ్లడ్ శాంపిల్ ఇవ్వగలరా? నా పాస్‌పోర్ట్ నా దగ్గరే ఉంది. నిందితుడు గోపాల్ రెడ్డితో నాకు పరిచయం లేదు. నా కారు స్టిక్కర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశా. సోమిరెడ్డిపై నేను చేసే ఆరోపణలన్నీ పచ్చి నిజాలు’ అని ఆయన పేర్కొన్నారు.
AP: పల్నాడు జిల్లాలో అరెస్టుల పర్వం ఇంకా కొనసాగుతోంది. పోలింగ్ రోజున విధ్వంసం కేసులో ఇప్పటివరకు దాదాపు 1000 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. 400 మందిని బైండోవర్ చేశారు. 146 కేసుల్లో 1500 మందికిపైగా నిందితులను గుర్తించారు. పరారీలో ఉన్న వారి కోసం ఎస్పీ మల్లికా గార్గ్ స్పెషల్ టీమ్‌లు ఏర్పాటు చేశారు. వచ్చే నెల 4న కౌంటింగ్ నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాటు చేయనున్నారు.
AP: ఈ నెల 13న ఒక్కో పోలింగ్ స్టేషన్ నిర్వహణకు రూ.10,000 వ్యయమైందని VROల సంఘం తెలిపింది. ఆ మొత్తాన్ని BLOలు, VROలకు వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి కోటేశ్వరరావుకు వినతిపత్రం అందించింది. కొన్నిచోట్ల రూ.2వేల నుంచి రూ.8వేలే ఇచ్చారని, దీనివల్ల చిరు ఉద్యోగులు నష్టపోతారంది. అలాగే మూడేళ్లుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పనిచేసిన BLOలకు రూ.18వేలను రిలీజ్ చేయాలని కోరింది.
USAలోని humanmicrobes కంపెనీ మనిషి మలానికి ఏడాదికి ₹1.40 Cr ఇస్తోంది. దాతగా మారాలంటే సంపూర్ణ ఆరోగ్యమే అర్హత. క్యాన్సర్, పార్కిన్సన్స్, ఆటిజం వంటి దీర్ఘకాలిక వ్యాధుల్ని వైద్యులు ఇటీవల ఫికల్ మైక్రోబైమ్స్ ట్రాన్స్‌ప్లాంట్ విధానంలో నయం చేస్తున్నారు. ఇందుకు కావాల్సిన మైక్రోబైమ్స్ మన చిన్నపేగుల్లోనే సులువుగా, ట్రిలియన్లలో ఉంటాయి. కానీ 0.1% కంటే తక్కువ మంది ఆరోగ్యకర మలం విసర్జిస్తారట. అందుకే ఈ డిమాండ్.
ప్రపంచంలోనే ఎత్తైన శిఖరంగా మౌంట్ ఎవరెస్ట్ ఖ్యాతి గాంచింది. ఈ పర్వతం సముద్ర మట్టం నుంచి సుమారు 8848 మీటర్ల ఎత్తులో ఉంది. ఎవరెస్టు శిఖరాన్ని తొలిసారి టెన్జింగ్ నార్గే, సర్ ఎడ్మండ్ హిల్లరీలు అధిరోహించారు. చైనా, నేపాల్ దేశాల సరిహద్దుల్లో ఉన్న ఈ శిఖరాన్ని టిబెట్ భాషలో ‘చోమోలుంగ్మా’, నేపాలీలో ‘సాగర్‌మాత’ అని పిలుస్తారు. ప్రతి సంవత్సరం సుమారు 800 మంది ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహిస్తారట.
తమిళనాడులో గూగుల్ పిక్సల్ పెట్టుబడులు పెడుతున్నట్లు సీఎం స్టాలిన్ వెల్లడించారు. ఈ పెట్టుబడుల ద్వారా డ్రోన్స్, మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లను గూగుల్ నెలకొల్పనుంది. చెన్నైకు సమీపంలో ఉన్న శ్రీపెరంబదూర్‌లో ఈ యూనిట్ స్థాపించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల అమెరికా పర్యటనలో TN మంత్రుల బృందం గూగుల్ ప్రతినిధులతో చర్చలు జరిపింది. గూగుల్ ఎంత మేర పెట్టుబడులు పెట్టనుందనే వివరాలు తెలియాల్సి ఉంది.
AP EAPCET ఇంజినీరింగ్ ప్రిలిమినరీ <
Sorry, no posts matched your criteria.