India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: టీటీడీలో అక్రమాల ఆరోపణలపై విజిలెన్స్ విచారణ తుది దశకు చేరింది. అన్ని విభాగాల్లోని లావాదేవీలు, నిబంధనలకు విరుద్ధంగా చేసిన ఖర్చులపై ఉద్యోగుల నుంచి వివరాలు సేకరించింది. మాజీ టీటీడీ ఛైర్మన్లు భూమన కరుణాకర్, సుబ్బారెడ్డి, మాజీ ఈవోలు ధర్మారెడ్డి, జవహర్‌లకు నోటీసులు ఇచ్చి వివరణ కోరినట్లు తెలుస్తోంది. శ్రీవాణి ట్రస్టు నిధులను దుర్వినియోగం చేశారనే విమర్శలపైనా అధికారులు దృష్టిసారించారు.
TG: హైడ్రా కూల్చివేతలకు మద్దతు తెలుపుతూ BJP MP రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలతో సంబంధం లేకుండా అక్రమ నిర్మాణాలను కూల్చేయాలని ప్రభుత్వానికి సూచించారు. పెద్దలను వదిలి పేదల కట్టడాలను కూలిస్తే సహించేది లేదని తేల్చి చెప్పారు. రికార్డుల ప్రకారం ఎంతటివారినైనా వదిలిపెట్టకుండా హైడ్రా పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. ఎవరైనా అడ్డొస్తే బుల్డోజర్లు ఎక్కించాలని రఘునందన్ వ్యాఖ్యానించారు.
కొవిడ్ సంబంధిత కంటెంట్, పోస్టులను సెన్సార్ చేయాలని బైడెన్, హ్యారిస్ ప్రభుత్వం ఒత్తిడి చేసిందని వైట్‌హౌస్ జుడీషియరీ కమిటీకి ఫేస్‌బుక్ ఫౌండర్ మార్క్ జుకర్ బర్గ్ లేఖ రాశారు. అలా ఒత్తిడి చేయడం తప్పన్నారు. ఇన్నాళ్లూ బహిరంగంగా ఈ విషయం చెప్పనందుకు పశ్చాత్తాపం చెందారు. కొవిడ్‌పై హ్యూమర్, సెటైరికల్ పోస్టులు వస్తే ప్రభుత్వం తమపై తెగ చిరాకు పడేదన్నారు. ఇష్టం లేకున్నా కొన్నిమార్పులు చేయాల్సి వచ్చిందన్నారు.
ఈ నెల 29న ఏర్పడే అల్పపీడనం ప్రభావంతో ఏపీలో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. ఇవాళ పార్వతీపురం, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరోవైపు TGలోనూ ఎల్లుండి నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 29న ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంది.
వామపక్ష ప్రభుత్వానికి ఒప్పుకోనని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ స్పష్టం చేశారు. అది వ్యవస్థల స్థిరత్వానికి ముప్పని పేర్కొన్నారు. దేశం బలహీనపడకుండా చూడటమే తన బాధ్యత అన్నారు. జులైలో జరిగిన ఎన్నికల్లో లెఫ్ట్, ముస్లిం లీగుకు ప్రభుత్వ ఏర్పాటు కన్నా తక్కువ, మిగతా పార్టీల కన్నా ఎక్కువ సీట్లు వచ్చాయి. దీంతో సరైన ఉమ్మడి అభ్యర్థి కోసం మాక్రాన్ అందరితో చర్చిస్తున్నారు.
TG: ఇటీవల 11,062 పోస్టులకు డీఎస్సీ పరీక్ష నిర్వహించిన ప్రభుత్వం మరో డీఎస్సీకి కసరత్తు చేస్తోంది. డిసెంబర్/జనవరిలో నోటిఫికేషన్ జారీ చేసి జూన్-జులైలోపు నియామకాలు పూర్తి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఆలోపు టెట్ కూడా నిర్వహించే అవకాశం ఉంది. ప్రస్తుత డీఎస్సీతో ఎంతమంది ఉపాధ్యాయులు భర్తీ అవుతారు? ఇంకా ఎన్ని ఖాళీలుంటాయనే సమాచారాన్ని జిల్లాల వారీగా సేకరిస్తోంది.
AP: ఇటీవల పుణేలో <<13931902>>కూలిపోయిన<<>> హెలికాప్టర్ సీఎం చంద్రబాబుకు కేటాయించినదేనని తేలింది. ఆయన కోసమే ముంబై నుంచి రప్పిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో సీఎం భద్రతపై ఆందోళనలు రేకెత్తుతున్నాయి. ఏవియేషన్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా 16 ఏళ్లనాటి హెలికాప్టర్‌ను కొనసాగించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దాని సామర్థ్యాన్ని అంచనా వేయడంలో విఫలమయ్యారనే ఆరోపణలు వస్తున్నాయి.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రధాని మోదీని ప్రశంసించారు. ఉక్రెయిన్‌కు మానవతా సాయం, శాంతికి పిలుపునివ్వడంపై అభినందించారు. పోలాండ్, ఉక్రెయిన్‌లో ఆయన పర్యటన వివరాలు తెలుసుకున్నానని ట్వీట్ చేశారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి పరిరక్షణకు రెండు దేశాలు కట్టుబడి ఉన్నాయని, క్వాడ్ సహా ఇతర ప్రాంతీయ కూటముల్లో పరస్పరం సహకరించుకుంటాం అన్నారు. అయితే వారు బంగ్లాదేశ్ గురించి మాట్లాడలేదని వైట్‌హౌస్ ప్రకటించింది.
ప్రధాని నరేంద్రమోదీ త్వరలో సింగపూర్‌లో పర్యటిస్తారని ఆదేశ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్ అన్నారు. రెండు దేశాల మంత్రుల రౌండ్‌టేబుల్ సమావేశాలు ఫలవంతంగా సాగాయన్నారు. డిజిటల్, నైపుణ్యాభివృద్ధి, వైద్యం, కనెక్టివిటీ, అడ్వాన్స్‌డ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంశాల్లో ద్వైపాక్షిక సహకారం మెరుగుదలకు అవకాశాలను అన్వేషించామన్నారు. సెమీ కండక్టర్ల తయారీ, వైమానిక రంగంలో సహకారంపై చర్చించామని పేర్కొన్నారు.
AP: గత ఎన్నికలకు ముందు రాజకీయాలకు గుడ్‌బై చెప్పిన మాజీ ఎంపీ గల్లా జయదేవ్ రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తనకు రాజ్యసభ ఎంపీగా అవకాశం ఇవ్వాలని సీఎం చంద్రబాబును కోరుతున్నట్లు సమాచారం. ఆయనకు ఉన్న పరిచయాల దృష్ట్యా తొలుత ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా నియమించనున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. 2026లో ఖాళీ అయ్యే రాజ్యసభ స్థానానికి ఆయనను ఎంపిక చేస్తారని పేర్కొంటున్నాయి.
Sorry, no posts matched your criteria.