India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పేరెంట్స్ బలవంతం వల్లే ఆమిర్ ఖాన్‌ను పెళ్లి చేసుకున్నానని ఆయన మాజీ భార్య, దర్శకురాలు కిరణ్ రావు వెల్లడించారు. వివాహానికి ముందు ఏడాది పాటు సహజీవనం చేసినట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. పెళ్లి వల్ల మహిళలపై ఒత్తిడి పెరుగుతుందన్నారు. ఆమిర్, కిరణ్ రావు 2005లో పెళ్లి చేసుకోగా.. 2021లో విడాకులు తీసుకున్నారు. ఇటీవల కిరణ్ రావు తెరకెక్కించిన ‘లాపతా లేడీస్’ మూవీ మంచి టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
TG: అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. పశ్చిమ మధ్య, దక్షిణ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ఈనెల 25 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని IMD తెలిపింది. అనంతరం అది తూర్పు, మధ్య బంగాళాఖాతంలో తుఫాన్‌గా మారే ఛాన్స్ ఉందని, ఈనెల 26 నాటికి తుఫాన్ బెంగాల్ తీరానికి చేరుకోవచ్చని పేర్కొంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఒకవేళ తుఫాన్‌గా మారితే దీనికి ‘రెమాల్’ అని నామకరణం చేయనున్నారు. ఈ పేరును ఒమన్ దేశం సూచించింది. ‘రెమాల్’ అంటే అరబిక్ భాషలో ఇసుక అని అర్థం. బంగాళాఖాతం, అరేబియా సముద్ర తీరంలోని ఎనిమిది దేశాలు తుఫాన్ పేర్లను నిర్ణయిస్తాయి. బంగ్లాదేశ్, ఇండియా, మాల్దీవులు, మయన్మార్, ఒమన్, పాకిస్థాన్, థాయ్‌లాండ్, శ్రీలంక ఈ జాబితాలో ఉన్నాయి. 2018లో ఇరాన్, ఖతర్, యెమన్, సౌదీ, UAE చేరాయి.
ఉగ్రవాది బిన్ లాడెన్ పేరుతో UKలో తయారైన బీర్లకు ఏర్పడిన డిమాండ్ తయారీ కంపెనీని తాత్కాలికంగా మూసుకునేలా చేసుకుంది. ‘ఒసామా బిన్ లాగర్’ బీర్లు వైరల్ కావడంతో తెగ డిమాండ్ ఏర్పడింది. దానికి అనుగుణంగా సరఫరా లేకపోవడంతో కంపెనీ వెబ్‌సైట్ సేవలను నిలిపివేసింది. బీర్లకు ఇలాంటి పేర్లు పెట్టడం ప్రమాదమేనని సంస్థ వ్యవస్థాపకులు అభిప్రాయపడ్డారు. ఈ సంస్థ కిమ్ జాంగ్, పుతిన్ పేర్లతోనూ మద్యం తయారు చేస్తుండడం గమనార్హం.
ఆకాశంలో ఒకే రేఖలో ఆరు గ్రహాలు ప్రకాశించే అరుదైన ఘట్టం ఆవిష్కృతం కానుంది. జూన్ 3న ఉత్తర అర్ధగోళంలో సూర్యోదయానికి ముందు బుధుడు, అంగారకుడు, బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్ గ్రహాలు ఒకే రేఖలో ప్రకాశిస్తాయి. ఇది అరుదైన ఖగోళ దృగ్విషయమని ఖగోళ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ ఘట్టం ఎలా ఉండనుందో చూపే ఊహాచిత్రాన్ని నెట్టింట పంచుకోగా వైరలవుతోంది.
AP: వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన తరఫు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. కాసేపట్లో ఈ పిటిషన్‌పై కోర్టు విచారణ జరపనుంది. ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో నిందితుడిగా ఉన్న పిన్నెల్లి కోసం పోలీసులు గాలిస్తున్న సంగతి తెలిసిందే.
AP: సీఎం జగన్ చరిత్రాత్మక విజయానికి ఐదేళ్లని వైసీసీ ట్వీట్ చేసింది. ‘సరిగ్గా 5 ఏళ్ల కిందట ఇదే రోజున ఏపీని ఫ్యాను గాలి ఊపేసింది. 151 ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలతో వైసీపీ చరిత్ర తిరగరాసింది. సీఎం జగన్ జూన్ 4న అంతకుమించి ఫలితాలు సాధించి దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేస్తారు’ అంటూ పోస్ట్ చేసింది.
AP: బంగాళాఖాతంలో ఏర్పడే తుఫాను వల్ల ఏపీకి ఎటువంటి ముప్పు లేదని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. అల్పపీడనం రేపటికి వాయుగుండంగా, ఎల్లుండి తూర్పుమధ్య బంగాళాఖాతం వద్ద తుఫానుగా మారే అవకాశం ఉందని పేర్కొంది. మే 26 సాయంత్రానికి బంగ్లాదేశ్, పశ్చిమబెంగాల్ తీరాలకు తీవ్ర తుఫానుగా చేరుకుంటుందని వెల్లడించింది. ప్రస్తుతానికి దీని వల్ల ఏపీకి ఎటువంటి ముప్పులేదని ట్వీట్ చేసింది.
దేశీయ స్టాక్ మార్కెట్లలో సెన్సెక్స్, నిఫ్టీ జీవిత కాల గరిష్ఠాలను తాకాయి. సెన్సెక్స్ 75వేల మార్క్ దాటి గరిష్ఠంగా 75,499కు చేరింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి 75,418 వద్ద స్థిరపడింది. మరోవైపు నిఫ్టీ గరిష్ఠంగా 22,993 పాయింట్లను నమోదు చేసి 22,967 వద్ద ముగిసింది. ఇన్వెస్టర్ల సంపద రూ.3.8లక్షల కోట్లు పెరిగి రూ.420 లక్షల కోట్లకు చేరింది. BSEలో 212 స్టాక్స్ 52 వారాల గరిష్ఠాన్ని నమోదు చేయడం విశేషం.
మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఇన్‌స్టా పోస్ట్ వైరల్‌గా మారింది. ‘ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన టీమ్‌ను గుర్తు చేస్తున్నా. కొన్నిసార్లు రిమైండర్ అవసరం’ అంటూ చెన్నై ప్లేయర్ల వీడియోను షేర్ చేశారు. కొన్నిరోజులుగా ఆర్సీబీపై తీవ్ర విమర్శలు చేస్తున్న రాయుడు ఆ టీమ్‌ను ఉద్దేశించే ఈ పోస్ట్ పెట్టారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. దీనికి చెన్నై బౌలర్ దీపక్ చాహర్ సెల్యూట్ ఎమోజీని కామెంట్ చేశారు.
Sorry, no posts matched your criteria.